అన్వేషించండి

Naga Panchami Serial Today February 19th: 'నాగ పంచమి' సీరియల్: కరాళికి వార్నింగ్‌ ఇచ్చిన పంచమి.. మోక్షని చంపేస్తా అంటూ బెదిరించి కరాళి.. అడవిలో నక్కల వీరంగం!

Naga Panchami Serial Today Episode కరాళి ఆశ్రమానికి వెళ్లిన పంచమి కరాళిని చంపేస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode  పంచమి కరాళిని పిలుస్తుంది. అదంతా కరాళి తన మంత్ర శక్తితో చూస్తుంటుంది. తనతో పోరాడమని పంచమి పిలుస్తుంది.  దీంతో కరాళి డేగను పంచమి మీదకు పంపిస్తుంది. దీంతో డేగ పంచమి చుట్టూ తిరుగుతూ పంచమిని పొడవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో సుబ్రహ్మణ్య స్వామి వాహనం అయిన నెమలి అక్కడికి వస్తుంది. నెమలిని డేగ మీదకు వెళ్లి పోరాడుతుంది. దీంతో డేగ కింద పడిపోతుంది. 

పంచమి: సుబ్రహ్మణేశ్వరా నువ్వే నన్ను కాపాడుకుంటూ వస్తున్నావు. నువ్వే నాకు రక్ష తండ్రి. కరాళి.. నువ్వు పాతాళంలో దాక్కున్నా వదిలిపెట్టను ఎక్కడున్నా వదిలిపెట్టను. పంచమి కరాళి ఉన్న చోటుకు వెళ్తుంది. అక్కడ కరాళిని చూస్తుంది. 
కరాళి: మృత్యువుని వెతుక్కుంటూ వచ్చావా పంచమి. 
పంచమి: మృత్యు భయం ఉన్నవాళ్లే నీలా దాక్కుంటారు కరాళి. 
కరాళి: నేను ఎక్కడికి పారిపోలేదు. ఇది నా ఆశ్రమం నువ్వే నా దగ్గరకు వచ్చావు.
పంచమి: అవును నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. నేను ఎవరో ఏంటో నీకు బాగా తెలుసు. మోక్షా బాబు జోలికి వస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అయినా నువ్వు సాహసం చేస్తున్నావ్. ఇది నీకు మంచిది కాదు కరాళి.
కరాళి: నువ్వు నన్ను ఏం చేయలేవు పంచమి. నేనే నిన్ను హెచ్చిరిస్తున్నాను. నీకు శక్తి ఉంటే నా నుంచి నీ భర్తని కాపాడు చాలు.
పంచమి: ఆ విషయం చెప్పడానికే వచ్చాను పంచమి. నేను మీ అన్న నంబూద్రీని చంపాను కాబట్టి నువ్వు నా మీద పగ పట్టి ఉండొచ్చు. నీ ప్రతీకారం ఏంటో నా మీద చూపించు అంతే కానీ మోక్ష బాబు జీవితంతో చలగాటం ఆడకు కరాళి. 
కరాళి: మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు నీ ప్రాణం అంతా మోక్షలో ఉంటుంది. పంచమి. నిన్ను కొడితే కన్నీళ్లు కార్చుతావ్ అదే మోక్షని కొడితే నీ ప్రాణాలు గిలగిలా కొట్టుకుంటాయ్.
పంచమి: దాన్నే పైశాచికత్వం అంటారు కరాళి. మోక్షాబాబు ఎవరికి హాని చేసే రకం కాదు. అయినా నువ్వు అతన్ని రకరకాలుగా హింసిస్తున్నావ్. ఒకసారి అతన్ని ఇదే ఆశ్రమానికి తీసుకొని వచ్చి మోక్షాబాబుని ఏదో చేయబోయావు. మరోసారి తన మెదడు మీద ప్రయోగం చేసి చాలా బాధలు పెట్టావు. ఏం ఆశించి ఇవన్నీ చేస్తున్నావ్ చెప్పు  కరాళి.
కరాళి: చెప్తే గుండాగి చస్తావ్ పంచమి. ఆ చచ్చేదేదో మోక్ష చావు చూసి చచ్చిపో.
పంచమి: అది కలలో కూడా జరగదు కరాళి. నేను పక్కన ఉండగా నువ్వు మోక్షాబాబు నీడను కూడా తాకలేవు.
కరాళి: నువ్వు నన్ను ఏం చేయలేవు. నీకు తెలిసే నీ కళ్ల ముందే నేను మోక్షని తీసుకెళ్లి బలి ఇవ్వబోతున్నాను. అది అతి త్వరలోనే జరగబోతుంది. నీకు శక్తి ఉంటే ఆపుకో పంచమి.
పంచమి: వద్దు కరాళి. మోక్షాబాబుతో ప్రయోగాలు చేయకు. నీకు చేతనైతే నీ ప్రతాపం నామీద చూపించు అవసరం అయితే  నా ప్రాణాలు తీసుకో. మోక్షాబాబుని ఏం చేయకు. 
కరాళి: చేస్తాను పంచమి నా యజ్ఞానికి కావాల్సింది మోక్షా ప్రాణాలు. పెళ్లి అయిన కఠిన బ్రహ్మచారిని బలి ఇస్తే నాకు శక్తులు వస్తాయి. అందుకు ముహూర్తం కూడా పెట్టేశాను. ఇక నువ్వే మోక్షని కాపాడలేవు. ఆశలు వదిలేసుకో. నువ్వు ఎంత ఆలోచించినా మోక్షను కాపాడుకోలేవు పంచమి. మోక్షకి నువ్వు చేస్తాను అన్న పెళ్లి జరగనివ్వను పంచమి. 
పంచమి: జరుగుతుంది కరాళి నేనే జరిపిస్తాను. 
కరాళి: జరగనివ్వను మేఘనతో మోక్ష పెళ్లి చేస్తే నా యాగానికి పనికిరాడు. 
పంచమి: అందుకే కరాళి వెంటనే నేను మోక్షాబాబు పెళ్లి చేస్తాను. మోక్షాబాబుని కాపాడుకుంటాను. నాకు అడ్డొస్తే మీ అన్న నంబూద్రీకి పట్టిన గతే నీకు కూడా పడుతుంది. నాగలోకం నుంచి ఆజ్ఞ రావడంతో నేను పాముగా మారి మీ అన్నని కాటేశాను తప్ప నాకు నీతో ఏ వైరం లేదు కరాళి. కానీ నువ్వు నా మీద పగ పెంచుకొని మోక్షబాబుకి అన్యాయం చేయాలని చూస్తున్నావ్. 
కరాళి: నా కల నా ధ్యేయం. నేను మహా మాంత్రికురాలిని కావాలి. అందుకే నేను నా జీవితాన్ని పూర్తిగా త్యాగం చేశాను.  అందుకు ఎన్నో సార్లు ప్రాణత్యాగం చేయడానికి రెడీ అయ్యాను. ఇందుకోసం ఎంతమందిని అయినా బలి ఇస్తాను. త్వరలో నాగమణిని కూడా సొంతం చేసుకుంటాను. మోక్ష కంటే ముందు నీ ప్రాణాలు పోతాయి.
పంచమి: దుష్ట శక్తిని నమ్ముకొని నీకే అంత ఉంటే దైవశక్తి నమ్ముకున్న నాకు ఎంత ఉండాలి. నీ చావు తప్పుదు.
కరాళి: తేల్చుకుందాం పంచమి. 
పంచమి: చూస్తుంటే నువ్వే నన్ను హంతకురాలిని చేసేదానిలా ఉన్నావు. మోక్షాబాబు కోసం నీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను. గుర్తుపెట్టుకో.. 

మరోవైపు పంచమి అడవిలో వెళ్లడాన్ని కరాళి చూస్తుంది. మార్గమధ్యంలో పంచమి చుట్టూ నక్కలు వస్తాయి. పంచమి మీద దాడికి సిద్ధమవుతాయి. పంచమి చాలా భయపడుతుంది. పరుగులు తీస్తుంది. ఇంతలో కర్రను తన్నేసి పంచమి పడిపోతుంది. చుట్టూ చేరుకుంటాయి. అదంతా కరాళి చూస్తూ ఉంటుంది. ఇంతలో సుబ్రహ్మణ్య స్వామి తన శూలాన్ని పంచమి చుట్టూ కవచంలా వేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: శ్రద్ధాదాస్ : గాల్లోనే పోతామని రష్మిక నేనూ అనుకున్నాం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget