Trinayani Serial Today January 4th: గాయత్రీ దేవి పాడిన పాట ప్లే చేసి లాంతరుతో తిలోత్తమకు చుక్కలు చూపించిన హాసిని!
trinayani serial today episode హాసిని గాయత్రీ దేవిలా గెటప్ వేసుకొని పవర్ కట్ చేసి తిలోత్తమను భయపెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Trinayani Serial Today January 4th: గాయత్రీ దేవి పాడిన పాట ప్లే చేసి లాంతరుతో తిలోత్తమకు చుక్కలు చూపించిన హాసిని! trinayani serial today episode january 4th written update in telugu Trinayani Serial Today January 4th: గాయత్రీ దేవి పాడిన పాట ప్లే చేసి లాంతరుతో తిలోత్తమకు చుక్కలు చూపించిన హాసిని!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/73440dcd3e2ea2614914e67f9dd8523a1704327737647882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
trinayani today episode: గురువుగారు, విశాల్, విక్రాంత్‌లు లాంతరు, వాక్ మేట్ ఎవరు పంపించారు అని మాట్లాడుకుంటుంటారు. ఇక అక్కడికి నయని వస్తుంది. నయనికీ గురువుగారు వాటిని జాగ్రత్తగా భద్రపరిచావా అని అడుగుతారు. జాగ్రత్త చేశానని నయని చెప్తుంది.
విశాల్: నయని ఆ లాంతరు గురించి నీకు ఏమైనా తెలుసా..
నయని: భలేవారే నాకేం తెలుసు.. నేను చూడటం ఇదే మొదటి సారి. గాయత్రీ అమ్మగారు కూడా ఎప్పుడూ చెప్పలేదు. పార్శిల్ చేసింద ఎవరో కానీ వాళ్లకి కృతజ్ఞతలు చెప్పాలి. అందులో గాయత్రీ అమ్మగారి వాయిస్ వినగానే బాబుగారి కళ్లల్లో ఆనందం చూశాను.
విశాల్: అవును నయని అమ్మే ఎదురుగా ఉండి మాట్లాడినట్లు ఉంది.
నయని: వీలు చూసుకొని అందులో మొత్తం వినాలి.. అమ్మగారి వాయిస్ ఉంటుందేమో.. గంట రెండు గంటలు వేచి చూస్తే ఇంకా ఎక్కడైనా మాటలు మాట్లాడి ఉండచ్చేమో..
గురువుగారు: ప్రయత్నించు నయని నువ్వు ఆశిస్తే ఫలితం తప్పక దొరుకుతుంది.
విశాల్: అందులో ఏమైనా ముఖ్యమైన సమాచారం ఉంటే..
నయని: తప్పకుండా మీకు చెప్తాను.
విశాల్: స్వామి నయనికీ తెలికూడదు అనుకుంటున్నాను.
గురువుగారు: ఎవరికి ఏం తెలుసో వాళ్లకి వారే తెలుసుకోవాలి.
మరోవైపు హాసిని తిలోత్తమను భయపెట్టాలి అని అనుకుంటుంది. ఇక ప్లాన్ కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇక డమ్మక్క, ఎద్దులయ్య అక్కడికి వస్తారు. ఇక పెద్ద బొట్టమ్మ కూడూ వస్తుంది. ఈ టైంలో ఎందుకు వచ్చావు అని హాసిని భయపడుతూ అడుగుతుంది.
పెద్దబొట్టమ్మ: పున్నమి అయిన మూడో రోజు ఉలూచీని చూడాలి అని వచ్చాను.
పావనా: వచ్చే వచ్చావు కదా ఈ టైంలో ఉలూచి పాము పిల్లగా మారిపోతుంది కదా నువ్వు కూడా పాములా మారితే ఎవరు ఎవరో తెలుసుకోలేక చస్తాం.
డమ్మక్క: సుమన చూసింది అంటే రచ్చ రచ్చ అవుతుంది దూరం నుంచి చూసి వెళ్లిపో.
ఇక సుమన ఉలూచికి పాలు పట్టుకొని వాళ్ల దగ్గరకు వస్తుంది. పెద్ద బొట్టమ్మ వెంటనే పాములా మారి హాసిని కొంగులోకి చేరుతుంది. ఇక పెద్దబొట్టమ్మ లాంతరు, గాయత్రీదేవి వాయిస్ ఉన్న టేప్ రికార్డ్‌ని వాడుకొని తిలోత్తమ పని పట్టమని హాసినికి సలహా ఇస్తుంది. ఇక హాసిని గెటప్ మార్చుకొని తిలోత్తమకు భయపట్టే పనిలో పడుతుంది. ఇక హాసిని ఇంటి మెయిన్ ఆఫ్ చేసి పవర్ ఆపేస్తుంది. ఇక హాసిని వాక్ మేట్‌ని పెద్ద సౌండ్ బాక్స్‌కి కనెక్ట్ చేస్తుంది. ఇక హాసిని లాంతర్ పట్టుకొని చీకట్లో వెళ్లుంది. ఇక సినిమా పాటలు పెడుతుంది. ఆ పాట విని తిలోత్తమ గాయత్రీ అక్క పాడుతుంది అని కంగారు పడుతుంది.
నయని, విశాల్‌లు కూడా గాయత్రీ దేవి పాడుతుంది అని సంతోష పడతారు. ఇక నయని వాక్ మేట్‌లోని గాయత్రీ దేవి పాడిన పాటని ఎవరు ప్లే చేశారు అని అనుకుంటుంది. ఇక తిలోత్తమ, వల్లభ బయటకు వస్తే వాళ్లకి కనిపించేలా హాసిని లాంతరు పట్టుకొని తిరుగుతుంది. అది చూసి తల్లీకొడుకులు చాలా భయపడతారు. వల్లభ అది పెద్దమ్మే అని అంటాడు. సరిగ్గా తిలోత్తమ దగ్గరకు హాసిని వచ్చి నిల్చొంటుంది. ఇక అప్పుడే పాట ఆగిపోతుంది. మరోవైపు నయని మెయిన్ ఆన్ చేస్తుంది. అందరూ హాసినిని చూసేస్తారు. ఇక తిలోత్తమ అయితే హాసినిని లాగి పెట్టి ఒక్కటిస్తుంది. విశాల్, నయనిలు అడ్డుకుంటారు. గాయత్రీదేవి పాడిన పాట విని తిలోత్తమ భయపడింది అని అంటారు. నేను ఎందుకు భయపడతాను అని తిలోత్తమ ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)