అన్వేషించండి

Trinayani Serial Today August 26th: 'త్రినయని' సీరియల్: పెట్టె తెరచిన గాయత్రీదేవి.. పూతని చితక్కొట్టిన ఆత్మ, మోసపోయిన తిలోత్తమ!

Trinayani Today Episode పెట్టెలో ఏముందో చదివించడానికి తిలోత్తమ ఓ వ్యక్తిని తీసుకురావడం గాయత్రీ దేవి అతన్ని చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode విశాల్ నయని ఒడిలో పడుకొంటాడు. నయని విశాల్‌తో తనకు బాబు పుట్టుంటే ఇలాగే పడుకొనే వాడని అంటుంది.. ఏదో ఒక విధంగా చేయి బాగు చేసే బాధ్యత నాది అని నయని అంటుంది. తన కోసం ఇబ్బంది పడొద్దని విశాల్ అంటాడు. ఉదయం హాసిని, పావనా, దురంధరలు నయని తెరచిన పెట్టె చుట్టూ తిరుగుతూ ఉంటారు. విక్రాంత్ వాళ్లు వచ్చి ఏం చేస్తున్నారని అడుగుతారు. 

నయని: సంస్కృతం వచ్చిన గాయత్రీ అమ్మగారు వస్తే తప్ప అందులో ఏముందో చదవలేరు.
తిలోత్తమ: గాయత్రీ అక్కే రావాలా సంస్కృతం వచ్చిన ఎవరైనా చదువుతారు కదా. రప్పింస్తున్నాను.
విశాల్: అమ్మ బయట వాళ్లకి ఈ విషయం గురించి తెలియడం ఎందుకు. 
దురంధర: బయట వాళ్లకి తెలిస్తే మునులు కూడా వాటా అడిగే రకం.
తిలోత్తమ: నేను చెప్పిన వ్యక్తి ఈ కాగితాల్లో ఏముందో సరదాగా చదివి వెళ్లిపోతారు. డబ్బులు కూడా ఇచ్చేశా.

గాయత్రీ పాప బయటకు వెళ్తుంది. ఇంతలో తిలోత్తమ చెప్పిన వ్యక్తి వస్తారు.  నయని ఆయనతో చదివించడం అవసరమా అంటే తిలోత్తమ విశాల్ చేయి తగ్గాలి కదా అని అంటుంది.  ఇక గాయత్రీ పాప బయటకు వెళ్లిందని తెలియగానే విశాల్ తన తల్లి వస్తుందని సంబర  పడతాడు. గాయత్రీ పాప పడుకుంటే గాయత్రీ దేవి వస్తుంది. తిలోత్తమ తెచ్చిన పూత అనే వ్యక్తి ఆ పెట్టెను తాకి షాక్‌తో పడిపోతాడు. ఇక విశాల్ నయనికి పెట్టె తెరవమని అంటే నయనికి గాయత్రీ దేవి ఆత్మ కనిపిస్తుంది, అమ్మగారే వస్తున్నారని చెప్తుంది. అందరూ సరదా పడతారు. తిలోత్తమ షాక్‌లో తెగ కంగారు పడుతుంది. గాయత్రీ దేవిని చూస్తుంది. 

గాయత్రీదేవి: నయని నేను అనుకున్న ప్రకారం పెట్టె తెరవడానికి సమయం వచ్చింది విధి విధాను సారమే విశాల్‌కి తేలు కుట్టింది. 
నయని: బాబు గారు కలిసి మాతో ఉంటున్నారు కానీ నొప్పిని ఆయన ఎంత అనుభవిస్తున్నారో నాకు తెలుస్తుంది అమ్మగారు. 

తిలోత్తమ పూత అనే వ్యక్తికి తొందరగా చదవమని అంటుంది. గాయత్రీదేవి పెట్టె తెరుస్తుంది. ఇక గాయత్రీదేవి తిలోత్తమతో నువ్వు తెచ్చిన వ్యక్తికి త్వరగా చదవమని చెప్పు అని అంటుంది. తిలోత్తమ చెప్తే ఆ వ్యక్తి చదవడానికి వెళ్తాడు. శనివారం ఆంజనేయ స్వామికి వరమాల సమర్పిస్తే మీకు పట్టిన గ్రహా పీడ పోతుందని అందులో ఉందని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. ఆదివారం దీపారాధన చేయాలని అతను అంటే గాయత్రీదేవి పెట్టెతో అతనికి ఒక్కటిస్తుంది. దాంతో ఆయన అటు ఇటు తిరుగుతాడు. ఆయనకు సంస్కృతం రాదని అందుకే గాయత్రీదేవి కొట్టిందని అందరూ అంటారు. దాంతో తిలోత్తమతో పాటు అందరూ ఆయన్ను చితక్కొడతారు. చివరకు ఆయన తనకు సంస్కృతం రాదని ఒప్పుకొని పారిపోతాడు. ఇక నయని, తిలోత్తమ గాయత్రీదేవి ఆత్మ కోసం వెతుకుతారు. గాయత్రీ పాప నిద్ర లేస్తుంది పూతని చూసి నవ్వుతుంది. డబ్బులు వేస్ట్ అయ్యాయని తిలోత్తమ, వల్లభలు ఫీలవుతారు. నయని, హాసినిలు అక్కడికి వచ్చి సెటైర్లు వేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: పాపను పాముల పడగపై పెట్టగానే ఏం జరుగుతుంది..? పెట్టె గురించి గురువుగారు చెప్పిన రహస్యం ఏంటి..?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
BSNL 5G Testing: ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pant Equals MS Dhoni Test Centuries | ఎంఎస్ ధోని సెంచరీల రికార్డును సమం చేసిన పంత్ | ABP DesamAP Govt Permission Devara Special Shows | ఏపీలో దేవర స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ | ABP Desamఅయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
BSNL 5G Testing: ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
MG Baas Explained: కారు బ్యాటరీకి అద్దె - భారీగా తగ్గిపోనున్న ఎలక్ట్రిక్ కార్ల ధరలు - ఎంజీ సూపర్ స్కీమ్!
కారు బ్యాటరీకి అద్దె - భారీగా తగ్గిపోనున్న ఎలక్ట్రిక్ కార్ల ధరలు - ఎంజీ సూపర్ స్కీమ్!
Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
KTRs Corruption allegations against Revanth : బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
Embed widget