Trinayani Serial Today April 17th: 'త్రినయని' సీరియల్: విశాల్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నయని అనుమానాలు.. తాళి దొంగతనానికి వచ్చిన అత్తాకోడళ్లు!
Trinayani Serial Today Episode విశాలాక్షి మెడలో వజ్రాల తాళిని తెంపాలని తిలోత్తమ ప్రయత్నించగా.. గాయత్రీ పాప తిలోత్తమ తాళి లాగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode గాయత్రీదేవి విశాలాక్షి అమ్మవారికి ఇచ్చిన వజ్రాల మంగళ సూత్రాన్ని విశాలాక్షి వేసుకొని వస్తుంది. గాయత్రీ దేవి చేయించిన సూత్రం విశాలాక్షి దగ్గరకు ఎలా వచ్చిందని అందరూ అనుకుంటారు. అమ్మవారికి ఇచ్చిన సూత్రం చూసే అదృష్టం ఈ అమ్మ వల్లే కలిగింది అని ఎద్దులయ్య అంటాడు. దానికి పావనా అంతా మన అదృష్టమని అంటాడు.
తిలోత్తమ: పాప పుణ్యాలు పక్కన పెట్టండి. మర్యాదగా తన మెడలో ఉన్న మంగళ సూత్రాలు తీసి ఇచ్చేయ్ మంట ఇంకా మంచిది.
విశాల్: అదేంటి అమ్మ మనం పోగొట్టుకోలేదు. ఒకసారి గుడిలో ఇచ్చేసింది ఇక మనది కాదు.
వల్లభ: అదేంటి పెద్దమ్మ గుడిలో ఇచ్చింది ఈ పిల్ల తన మెడలో వేసుకొని తిరిగితే ఈపిల్ల సొంతం అయిపోతుందా.
విశాలాక్షి: నాది కాబట్టే నా దగ్గర ఉంది.
తిలోత్తమ: చూశారా మనది కాస్తా తనది అంటుంది.
నయని: ఉండనివ్వండి అత్తయ్య.
హాసిని: చిన్న పిల్ల సరదాగా వేసుకొని వస్తే కంగారు పడతారెందుకు.
దురంధర: తాళి మెడలో వేసుకోవడం ఏం సరదానే.
ఇక తిలోత్తమ ఇచ్చేయ్ అని విశాలాక్షి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఎందుకు ఇవ్వాలి అని విశాలాక్షి అడుగుతుంది. దాంతో తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి లాగుతుంది. దీంతో తిలోత్తమ తాళి బిగుసుకుపోతుంది.
తిలోత్తమ: ఏయ్ నా తాళి పట్టుకుంది ఎవరు.
విశాలాక్షి: నీ చావు..
నయని: మీరు విశాలాక్షి మెడలో తాళి వదలకపోతే గాయత్రీ కూడా మిమల్ని వదిలేలా లేదు అత్తయ్య.
వల్లభ: మమ్మీ వదిలేయ్. తిలోత్తమ విశాలాక్షి తాళి విడిచిపెట్టగానే గాయత్రీ పాప కూడా వదిలేస్తుంది.
తిలోత్తమ: పిల్ల చేతికి తాళి నయని ఇచ్చే నన్ను బెదిరించింది.
సుమన: తిలోత్తమ అత్తయ్య గాయత్రీ అత్తయ్య చేయించిన తాళి లాగితే ఈ పిల్ల ఎందుకు తిలోత్తమ అత్తయ్య తాళి లాగింది.
ఎద్దులయ్య: అర్థం చేసుకుంటే బాగుంటుంది చిట్టి మాతా.
డమ్మక్క: అంత జ్ఞానం ఉంటే ఎప్పుడే సంతోషించేవాళ్లం.
నయని: చెప్పు విశాలాక్షి నీకు అది ఎవరు ఇచ్చారు.
విశాలాక్షి: చెప్పలేను అమ్మ ఇబ్బంది పడతారు.
విశాల్: విశాలాక్షి చెప్పు తల్లి.
విశాలాక్షి: చెప్పొచ్చా నాన్న. నాకు ఈ మంగళ సూత్రాలు ఇచ్చింది ఎవరో కాదు తను (గాయత్రీ దేవి ఫొటో చూపిస్తుంది.) అందరూ షాక్ అవుతారు. వల్లభ పగలబడి నవ్వుతాడు. ఇక తిలోత్తమ నేను చెప్తానురారా అని వల్లభను తీసుకొని వెళ్లిపోతుంది.
మరోవైపు సుమన విక్రాంత్‌తో లొల్లి పెట్టకుంటుంది. విశాలాక్షి వజ్రాల మంగళ సూత్రం వేసుకుందని తనకి మాత్రం వజ్రం రాయి ఉన్న ముక్కు పుడక కూడా చేయించలేదని అంటుంది. దానికి విక్రాంత్ నాకు అంత స్తోమత లేదు అంటాడు. ఇక ఉడికిపోయిన సుమన నేనే సంపాదించుకుంటాను లెండీ అని వెళ్లిపోతుంది.
మరోవైపు నయని, విశాల్, హాసిని, పావనాలు కలిసి మాట్లాడుకుంటారు. తిలోత్తమ అత్తయ్య మెడలో తాళిని గాయత్రీ పాప ఎందుకు పట్టుకుంది అని నయని ప్రశ్నిస్తుంది. ఆ మాట వినగానే హాసిని పొలమారుతుంది. ఇక పావనా అయితే నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తే పొలమారడం కాదు బుర్రలో ఫ్యూజులు ఎగిరిపోతాయి అని అంటాడు. ఇక ముగ్గురు నయని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పని ఉంది అని వెళ్తామంటారు.
నయని: నేను అయోమయంలో ఉంటే మీరు వెళ్లిపోతా అంటారు ఏంటి.
విశాల్: చిన్నపిల్లి పొరపాటున తాళి పట్టుకుంటే ఎందుకు ఇలా జరిగింది అని నువ్వు అడిగితే ఏం చెప్పాలి.
నయని: పిల్లలు ఎలా పట్టుకుంటారు బాబుగారు పట్టు విడుపు అన్నట్లు పట్టుకుంటారు. కానీ గాయత్రీ పాప ఉడం పట్టు పట్టినట్టు పట్టుకుంది.
హాసిని: చంపేయాలి అనుకుందేమో..
విశాల్: వదినా.. పాప ఎందుకు అలా అనుకుంటుంది. నోరు జారినా కూడా లేని పోని అనుమానాలు వస్తాయి నయనికి. మరోవైపు నయని మాట్లాడినా వినకుండా వెళ్లిపోతారు.
ఇక హాల్‌లో విశాలాక్షి పడుకొని ఉంటే తిలోత్తమ, వల్లభలు తాళి కోసం వస్తారు. తాళిని దొంగిలించాలి అనుకొని కత్తెర తీసుకొని వస్తారు. ఇక గాయత్రీ పాప ఆ సీన్ చూస్తుంది. మరో వైపు సుమన కూడా ఆ తాళి కోసం చాకు పట్టుకొని కిందకి వస్తుంది. సుమనను చూసి తిలోత్తమ, వల్లభ దాక్కుంటారు. సుమన తాళి కట్ చేయాలి అనుకునేలోపు గాయత్రీ పాప ఫ్లవర్ వాష్ పక్కన పడేస్తుంది. దీంతో సుమన తిలోత్తమ పక్కకు వెళ్లి దాక్కుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: నయతారను ఇలా చూస్తే మతిపోవాల్సిందే - ఈ చీరలో ఏముంది కదా!