Trinayani October 5th: ఉలూచిని కనిపెట్టిన నయని - విశాల్ ని కాటేసిన నల్ల నాగు!
విశాల్ ని నల్ల నాగు కాటేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Trinayani October 5th Written Update: ఒక పాము పిల్లని అడవి వైపు చూశాను అని నాకు చుట్టుపక్కల వారు చెప్పారు అని అంటుంది తిలోత్తమ.
విక్రాంత్: ఎక్కడ చూసారట?
తిలోత్తమ: అగ్నిగుండం వైపు ఉన్న పాము పుట్ట దగ్గర చూశారట అని అనగానే నయనకి తను త్రినేత్రంతో చూసిన పాము పుట్ట గుర్తుకు వస్తుంది.
నయని: రాత్రి నా త్రినేత్రంలో కూడా అదే కనిపించింది అంటే కచ్చితంగా పాప అక్కడే ఉండి ఉంటుంది. వెళ్లి వెతుకుదాం రండి.
విక్రాంత్: మీరిద్దరూ గడప దాటకూడదు కదా?
సుమన: నా పాప కోసం ఈ మాత్రం చేయలేరా ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు మాత్రమే రండి అందరం వెళ్దాము అని చెప్పగా కుటుంబ సభ్యులందరూ అగ్నిగుండం వైపు వెళ్తారు. నయని చేతిలో తులసి మొక్కలో ఉన్న పసుపు గౌరమ్మ నీళ్ళు ఉంటాయి. దాన్ని పట్టుకుంటూ వెళ్తుంది నయని. మరోవైపు విశాల్ గాయత్రి ని ఎత్తుకుంటాడు.
Also Read: గడప దాటిన నయని - విశాల్ ప్రాణాలు తీసేందుకు తిలోత్తమ ప్లాన్!
అందరూ అగ్నిగుండం దగ్గర ఉన్న పుట్టకు వచ్చినప్పుడు కాలనాగును ఆ పుట్టలో విడిచిపెట్టినట్టు రత్తయ్య తిలోత్తమ కు పక్క నుండి సైగ చేస్తాడు.
తిలోత్తమ: చూడురా రత్తయ్య నాగుని పుట్టలో విడిచినట్టు సైగ చేశాడు. ఇంకా దాన్ని ముట్టుకున్న వాళ్ళు ప్రాణాలు అక్కడికక్కడే పోవడం ఖాయం అని వాల్లభ తో చెప్పి నవ్వుకుంటుంది.
అందరూ ఆ పుట్ట ఉన్న చోటున ఆగుతారు.
తిలోత్తమ: ఆ పిల్ల ఈ పుట్టలోనే ఉన్నట్టు అనిపిస్తుంది
విక్రాంత్: పుట్టలో ఎందుకు ఉంటుంది? ఇప్పుడు తెల్లవారు జామున అంటే ఆడపిల్లలా ఉంటుంది కదా పాము కాదు కదా.
తిలోత్తమ: ఆడపిల్లలా ఉన్నా సరే తన జాతి స్వభావం వలన పుట్టలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది.
సుమన: నిజంగా నా పాప ఇక్కడే ఉండి ఉంటుందా?
వల్లభ: ఇది కేవలం మా అంచనా మాత్రమే ఒకసారి చూస్తే సరిపోతుంది అని అనగా నయని ముందుకు వెళ్దామని ప్రయత్నిస్తుంది. ఇంతలో పుట్ట చుట్టూ మంటలు లాగా కనిపిస్తాయి.
Also Read: ఆదర్శ్ విషయంలో మురారీని బోల్తా కొట్టించిన ముకుంద- అయోమయంలో కృష్ణ!
మరోవైపు గురువుగారు నయని వాళ్ళు అక్కడికి వెళ్లినట్టు తెలుసుకుంటారు.
గురువుగారు: ఆ పుట్ట జోలికి వెళ్లొద్దు అని విశాలాక్షమ్మ మంటల రూపంలో మీకు సైగ చేస్తుంది నయని. గడప దాటొద్దన్నా ఇద్దరు గడప దాటి అక్కడికి వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అమ్మా విశాలాక్షి నువ్వే వాళ్లకి దారి చూపాలమ్మా అని అనగా నయని చేతిలో ఉన్న తులసి మొక్క మరొకవైపు దారి చెప్తుంది.
నయని: తులసి మొక్క నాకు మరొకవైపు దారి చెప్పింది అంటే పాప అక్కడే ఉన్నాదేమో
సుమన: మా ఎవరికి కనిపించని దారి నీకు మాత్రమే కనిపిస్తుందా అక్క? కావాలనే మమ్మల్ని దారి మళ్ళిద్దామనుకుంటున్నావు
నయని: నిజంగానే నాకు కనిపించింది చెల్లి
తిలోత్తమ: అయితే నువ్వు ఇంకొక దారిలో వెళ్లి పాప కోసం వెతుకు ఇక్కడ విశాల్ తో పాటు మేము అందరం ఉంటాము అని అనగా తులసి మొక్క చెప్పిన దారిలో వెళ్తుంది నయని.
ఇటువైపు విశాల్ పుట్ట వద్దకు వెళ్దామని ప్రయత్నించినా మళ్లీ మంటలు వస్తాయి.
సుమన: పిల్లలు దేవుడు తో సమానం అంటారు కదా మీ చేతిలో ఉన్న గాయత్రి ని ముందు పంపించండి. అప్పుడు దాన్ని మంటలు ఏమీ చేయవు తర్వాత మీరు వెళ్లి నా పాపను తెచ్చేయండి.
Also Read: కళ్యాణ్ ని దూరం పెడుతున్న అప్పు- కావ్యపై అనామికలో మొదలైన అసూయ- రాజ్ మంచితనం!
విక్రాంత్: పిచ్చా నీకు ఏమైనా? గాయత్రి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.
సుమన: అయితే ఏంటి సొంత కూతురు కూడా కాదు కదా దత్తకు తీసుకున్న దానిమీద ఉన్న ప్రేమ కూడా నా కూతురు మీద లేదా అని అనగా వెంటనే సుమన చంప పగలగొడతాడు విక్రాంత్.
సుమన: ఇలాగే చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా పాప కనిపించడం లేదని మీ మీదే అనుమానంగా ఉందని చెప్తాను. అప్పుడు ఇంటి పరువు అంతా రోడ్డున పడుతది అని బెదిరిస్తుంది.
తిలోత్తమ: నాకెందుకో సుమని చెప్పింది నిజమే అనిపిస్తుంది. గాయత్రిని ముందుకు పెట్టడమే మంచిది
విశాల్: మీరు ఇంతలా చెప్తున్నారు కదా అదే చేద్దాము
హాసిని: ఒద్దు విశాల్ జరగకూడనిది జరిగితే చాలా ప్రమాదం.
విశాల్: లేదు వదినా పిల్లలు దైవ సంభూతులు కదా ప్రమాదం జరగదు అని గాయత్రిని పుట్ట వైపుకు వెళ్ళమని చెప్తాడు.
మరోవైపు ఆ తులసి మొక్క చూపిస్తున్న దారిలో నయని వెళ్ళగా అక్కడ ఏడుస్తూ ఉన్న ఉలూచి కనిపిస్తుంది.
నయని: అమ్మ ఉలూచి.. ఇక్కడున్నావా అమ్మా? నీకోసం ఎంత కంగారు పడుతున్నాము అని తనని ఎత్తుకొని తిరిగి వచ్చిన దారినే పయనం మొదలు పెడుతుంది.
మరోవైపు గాయత్రి వెళ్లి పాము పుట్టని పట్టుకున్న వెంటనే లోపల నుంచి నల్లనాగు బయటికి వచ్చి గాయత్రిని కాటేయడానికి చూస్తుంది. ఇంతలో విశాల్ వచ్చి గాయత్రిని తప్పించబోగా ఆ పాము విశాల్ నీ వెళ్లి కాటేస్తుంది. విశాల్ వెంటనే స్పృహ తప్పి పడిపోతాడు. అందరూ విశాల్ ని చూసి కంగారుపడగా తిలోత్తమ, వల్లభలు తమలో తామే నవ్వుకుంటారు.
అదే సమయంలో నయని వచ్చి పాప దొరికింది అని ఆనందంగా చెప్తుంది. పక్కనే ఉన్న విశాల్ నీ చూసి కంగారు పడిపోతుంది.
హాసిని: గాయత్రి ని తప్పించబోగా విశాల్ ని పాము కాటేసింది చెల్లి.
నయని: బాబు గారు మీకేం కాదు హాస్పిటల్ కి తీసుకెళ్దామని విక్రాంత్ తో అంటుంది.
అప్పుడు రత్తయ్య అక్కడికి వచ్చి ఈ నల్ల నాకు కాటేస్తే బతికే అవకాశం లేదు అని అంటాడు.
నయని: పర్లేదు నా బాబు గారిని నేను కాపాడుకోగలను. నేను సుమంగళిగా చచ్చిపోతాను కానీ ఇలా ఉండలేను అని విశాలాక్షమ్మకు తెలుసు అంటుంది నయని.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial