అన్వేషించండి

trinayani november 8th: చాకుతో అమ్మవారి పెట్టెను కోసిన సుమన.. బయటకొచ్చిన రక్తం!

సుమన పెట్టెకు ఉన్న తాడును చాకుతో కోయగా రక్తం కారడంతో ఇవాళ్టి ఏపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

డమ్మక్క: వృథా ప్రయత్నం నయని వదిలేసేయ్ 

తిలోత్తమ: అలా ఎలా వదిలేస్తారు.. పెట్టెని కష్టపడి తెచ్చిందెందుకు

వల్లభ: హా.. పూజ చేయడానికి ఏమో

సుమన: ఇందాకే చేశారు కదా.. దాని ముడి విప్పుకొని కూర్చొంటే టైం వేస్ట్.. కత్తి తెచ్చి తాడు కోసి పడేయండి. 

నయని: వద్దు.. వద్దు.. ఆ పని మాత్రం చేయకండి

ఎద్దులయ్య: పసుపు కుంకుమలతో నిత్యం అభిషేకం చేయించుకునే నాగలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకున్న పెట్టె అది. అంత సులువుగా తెరచుకోదు మరి. 

దురంధర: హా.. నాగులాపురం నాగలక్ష్మి దేవి గుడి దాకా వెళ్లి పెట్టి తెచ్చారు అంటే ఏమైందో ఏంటో అని ఎంత ఆరాటంగా ఉండేదో.. తాడు ముడి విప్పలేకపోతున్నాం అంటున్నారుగా

డమ్మక్క: విప్పలేక కాదు విప్పరాదు. 

పావన మూర్తి: ఊ.. ఇది మరీ బాగుంది. తాడు తీయకుండా పెట్టె ఎలా ఓపెన్ అవుతుంది. 

విక్రాంత్: మామయ్య ఏదో ఒక మార్గం ఉంటుందిలే. 

పావన మూర్తి:  అది ఏంటో నాకు తెలియాలి

హాసిని: మాకు తెలుసుకోవాలనే ఉంది. ప్రతీది తలచుకోగానే అయిపోవాలి అంటే ఎలా

ఇంతలో సుమన చేతిలో చాకు పట్టుకొని వచ్చి ఇదిగో ఇలా అంటూ చూపిస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.  

విశాల్: సుమన ఏం చేస్తున్నావ్

సుమన: ఇంకేం చేయలేదు బావగారు. కోసి పారేయడానికి కూరగాయల కత్తి పట్టుకొని వచ్చా. 

నయని: నిన్ను ఎవరు తీసుకురమ్మన్నారు. 

సుమన: నీకు రాని ఆలోచన నాకు వచ్చినప్పుడు అమలు చేయకపోతే ఎలా అక్క. తెలివి కూడా ఉండాలి అంటావు కదా నీవు

డమ్మక్క: కోస్తే తెగుతుందా

సుమన: అది బ్లేడు కాదు తాడు. 

వల్లభ: చిన్న మరదలు చేసేదే కరెక్ట్. మీరేమో పూజలు పునస్కరాలు అంటూ టైం పాస్ చేస్తున్నారు. 

తిలోత్తమ: కోసేది తాడే కదా. దానికి ఎందుకు వర్రీ అవుతున్నారు. సుమన కట్ చేయ్

సుమన: అలాగే అత్తయ్య

మిగతా ఇంటి సభ్యులంతా చిట్టి వద్దూ.. సుమన వద్దూ అలా చేయొద్దు అంటూ హెచ్చరిస్తారు. అయినా వినకుండా సుమన చాకు తీసుకొని పెట్టె తాడు కోయడానికి వెళ్లి తాడు కోయడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో స్వామీజీ కాలా అపశృతి జరగబోతోంది. విధివిధానం లేదు. అమ్మ భద్రంగా దాచిపెట్టుకున్న పెట్టె మీద దాడి చేయకూడదు. ఘోరంగా దెబ్బతింటారు కాలా అని అంటారు. మరోవైపు ఎంత మంది చెప్పినా వినకుండా సుమన తాడు కోస్తుంటుంది. దీంతో ఆ తాడు తెగి రక్తం సుమన మీద పడుతుంది. అయినా అదేమీ పట్టించుకోకుండా సుమన కట్ చేస్తుంటుంది. దీంతో బలవంతంగా అందరూ ఆమెను వెనక్కి లాగుతారు. దీంతో అప్పుడు గమనించిన సుమన చూసి రక్తం అంటుకుంది ఏంటని గట్టిగా అరుస్తుంది. 

నయని: చెప్పిన మాట వినవా బుద్ది లేని పనులు చేస్తావ్ నువ్వు

హాసిని: ఆ తాడు నుంచి కూడా రక్తం వస్తోంది

దురంధర: ఆపండి అయ్యా మేము భయపడుతుంటే మీకు నవ్వులాటగా ఉందా

ఎద్దులయ్య: భయమెందులకు మాతా

పావన మూర్తి: నెత్తురలా జూసులా కారుతుంటే ఎందుకు అంటావ్ ఏంటి

డమ్మక్క: అది రుధిరం కాదు పవన.. 

తిలోత్తమ: రక్తం కాకపోతే ఇంకేంటి

ఎద్దులయ్య: నవ వనితగా.. రాశి భూత సౌందర్యంతో.. చిరు ముత్యాలు సవ్వడి చేస్తూ.. బంగారు కంఠాభరణాలు.. మంజీరాలు.. మొలనులు చేతినిండా ధగధగ మెరిసే బంగారు గాజులు.. మొగలి సువాసనలు వెదజల్లే పూలకొప్పు విశాల మైన కటి ప్రదేశం సువాసలు వెదజల్లు నోరు, చెవులకు అలంకరించిన చంద్ర రేఖలు.. దట్టమైన కనుబొమ్మలు కల అమ్మవారి నుదిట మూడో కన్నులా ప్రకాశిస్తున్న ఎర్రటి కుంకుమ ఆ ధార..

వల్లభ: హేయ్.. నువ్ ఊరుకోవయ్యా ఎమోషనల్‌గా గంభీరంగా చెప్పగానే పెద్ద మరదలు అప్రయత్నంగానే రెండు చేతులు జోడించి దండం పెట్టేస్తోంది. 

తిలోత్తమ: భయపెట్టడానికి శివభక్తులు ముందుంటారు. 

డమ్మక్క: ముందు మేము లేము. అమ్మవారి ప్రభావం గల పెట్టె ఉంది. దాన్ని తెరవాలి అంటే దుర్లభం. ప్రయత్నిస్తే అపచారం

సుమన: కారింది కుంకుమేగా ఇంకోసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది. 

విక్రాంత్: ఈ సారి నీ రక్తం కారేలా ఉంది జాగ్రత్త

హాసిని: అవును చిట్టీ.. అసలే డైటింగ్ పేరుతో తక్కువ తింటున్నావ్..ఉన్న రక్తం కాస్తా ఊడ్చుకుపోయిందనుకో నువ్ ఉండవు. 
దురంధర: 3 కోట్లు పెట్టి కొన్న బంగారు నగలు నీ శవ పేటిక మీద అలంకరించి ఫోటోలు తీసుకున్నాక వాటిని తీసేసుకుంటారు. 

సుమన: ఎవరు తీసుకుంటారు. దెయ్యమై వారిని పీక్కు తింటాను 

విక్రాంత్: చూశావా నువ్వు దెయ్యం అని ఒప్పుకున్నావు

తిలోత్తమ: అబ్బా.. ఆగరా నువ్వు. ఏదో ఒకటి అనకుండా ఉండలేవా..ఈ పెట్టెలో ఏముందో తెలుసుకోకుండా అక్కర్లేని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. 

విశాల్: అమ్మా.. ఏముందో ఏమో గానీ దాన్ని బలవంతంగా తెరిచే ప్రయత్నం చేయడం మంచిది కాదు 

నయని: అవును అత్తయ్యా.. తెరుచుకునే మార్గం ముహూర్తం వచ్చేవరకు తొందర పడకుండా ఉండాలి. 

తిలోత్తమ: అలాగేలే.. చెక్క పెట్టెలో ఏముంటుంది. అది ఏమైనా ఇనప పెట్టె అయ్యుంటే ధనకనక రాశులు ఉండొచ్చు అనుకోడానికి.. ఏమున్నా సరే ఈ పాటికి చెదలు పట్టే ఉంటాయి. 

పావన మూర్తి: అంతే అక్కాయ్.. లైట్ తీసుకోండి. ఇప్పుడైతే అర్జెంటుగా దీన్ని ఓపెన్ చేసి చేయాల్సిన ఘన కార్యాలు ఏమీ లేవుగా..

తిలోత్తమ: లేదు

దురంధర: మరింకే శుభ్రంగా భోజనం చేసి పడుకోండి.. ప్రయాణం చేసి అలసి పోయి ఉంటారు నయని వాళ్లు. 

 డమ్మక్క: దాన్ని జాగ్రత్తగా ఒక చోట ఉంచండి

వల్లభ: ఆ.. అవును హాలు మధ్యలో మాత్రం పెట్టకండి ఒక సైడ్‌కు పెట్టండి. మమ్మీ నువ్ రా మమ్మీ 

హాసిని: పెట్టమని చెప్పడమే కాని చేయడు చావడు

ఇక విశాల్.. విక్రాంత్ ఆ పెట్టెను భద్రంగా ఓ చేటు దాచి పెడతారు. ఇక రాత్రి దురంధర పక్కనే పడుకున్న పవన మూర్తి మీద కాలు వేయడంతో ఆయన దురంధరతో మాట్లాడితే ఆమె పవన మూర్తి ఫోన్‌లో మాట్లాడుతున్నాడని అనుకొంటుంది. వాళ్ల మధ్య సంభాషణ కామెడీగా ఉంటుంది. ఇంతలో వారి గది బయట నుంచి వల్లభ పెట్టె దాచిన చోటుకు రంపం తీసుకొని వెళ్తాడు. దాన్ని చూసిన పవన మూర్తి ఆ విషయం తన భార్యకు చెప్పగా ఆమె వినిపించుకోదు. దీంతో పవన మూర్తి ఒక్కడే వెళ్తాడు. ఇక అక్కడ వల్లభ డమ్మక్కను చూసి బయపడతాడు. 

వల్లభ: అమ్మో నువ్వా

డమ్మక్క: నేను కాక ఇంకెవరు పుత్రా

వల్లభ: ఏయ్ పళ్లికిలిస్తావ్ ఎందుకు పో అవతలకి

ఎద్దులయ్య: ఎక్కడికి వెళ్తున్నావ్ పుత్రా

వల్లభ: హా నాకు పనుంది. నన్ను డిస్టబ్ చేయకండి. వెళ్లి పడుకోండి. 

డమ్మక్క: రంపం దేనికి

వల్లభ: కోయుటకు

డమ్మక్క: దేన్నీ

వల్లభ: హా నీ ముక్కుని

ఎద్దులయ్య: పరిహాసం వలదు పుత్రా

వల్లభ: ఏయ్.. మా ఇంట్లో పడున్న మీకు నన్ను ప్రశ్నించే హక్కు లేదు

ఎద్దులయ్య: నీ క్షేమం కోరి అడుగుతున్నాను

వల్లభ: సర్లే చెప్తాను కానీ మీరు ఎవ్వరికీ చెప్పను అంటేనే సరేనా.. 

ఎద్దులయ్య, డమ్మక్క చెప్పం చెప్పం అని అంటారు. దీంతో వల్లభ నాగులాపురం నాగలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆ పెట్టెను కోయడానికి ఈ రంపం తీసుకొచ్చా అని చెప్పి వెటకారంగా నవ్వుతాడు. నవ్వు చూసి భయం వేస్తుందా.. విలన్‌లా కనిపిస్తున్నానా.. అని అడుగుతాడు. 

ఎద్దులయ్య: లేదు పుత్రా కొందరి జీవితాల్లో సంతోషం పాలు తక్కువే. 

వల్లభ: నేను ఆవు పాలు తాగనుగా.. ఎలా ఉంది నా పంచ్. పక్కకు వెళ్లండి. పక్కకు వెళ్లండి

ఇంతలో పావనమూర్తి అక్కడకు వచ్చి అల్లుడు ఏం చేస్తున్నాడు. కొంపతీసి ఆ రంపంతో పెట్టెను కట్ చేస్తాడా ఏంటి అని అనుకొని వల్లభ దగ్గరకు వెళ్తుండగా ఎద్దులయ్య, డమ్మక్క పావనమూర్తి నోరు నొక్కేసి పక్కకు లాగేస్తారు. 

వల్లభ: ఏంటి ముడి విప్పితే రాదా.. దీన్ని కత్తితో కోస్తే కుంకుమ ధారగా వస్తుందా.. గొల్లెం తీయడానికి రాకపోతే నాలాంటి వాడు ఊరుకుంటాడా.. హా.. పెద్ద రంపమే తీసుకొచ్చాను. సరాసరా మని కోస్తే రెండు ముక్కలై ఇందులో ఏముందో బయట పడిపోతుంది. 

ఎద్దులయ్య: వల్లభుడు ఎవరికీ చెప్పొద్దు అన్నాడయ్యా కొంచెం ఆగు(పావన మూర్తితో) 

వల్లభ రంపాన్ని పెట్టెకు పెట్టగానే షాక్‌ కొట్టి పెద్దగా అరుస్తాడు. ఆ కేకలకు కుటుంబ సభ్యులు అంతా కంగారుగా అక్కడికి వస్తారు. ఇంతలో హాసిని తన భర్త వల్లభను కాలితో గట్టిగా తన్నేస్తుంది. షాక్ నుంచి వల్లభ బయటకు రాగానే ఆనందంతో గెంతులేస్తుంది. 

 సుమన: కరెంట్ షాక్ ఎలా కొట్టింది

విక్రాంత్ : వెళ్లి పట్టుకో తెలుస్తుంది

విశాల్: అక్కడ ఎలాంటి కనెక్షన్ లేదు కదా 

తిలోత్తమ: మరి ఎలా పవర్ పాస్ అయ్యింది.
 
ఇంతలో హాసిని ఎలా పాస్ అయినా సరే నా మొగుడిని నేను కాపాడుకున్నాను అని అనడంతో ఎద్దులయ్యా, డమ్మక్క నవ్వుతారు. వారిని చూసి తిలోత్తమ ఎందుకు అలా నవ్వుతున్నారు అంటే ఇందాకే మీ పుత్రుడు నవ్వాడు అని అంటారు. ఇంతలో పావనమూర్తి వీరు చెప్పరు కానీ నేను చెప్తా అంటూ అల్లుడు రంపం తీసుకొచ్చి ఆ పెట్టె ముక్కలు చేద్దాం అనుకున్నాడు అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో నేటి ఏపిసోడ్ పూర్తయింది. 
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
Charith Balappa Arrested: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
Embed widget