Tillu Square: టీవీలో ప్రీమియర్‌కు సిద్ధమయిన ‘టిల్లు స్క్వేర్’ - ఆ సీన్స్ లేనట్టేనా?
Tillu Square: ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కి ఒక రేంజ్‌లో హిట్ అందుకుంది ‘టిల్లు స్క్వేర్’. ఇక ఈ మూవీ టీవీలో ప్రీమియర్ అవ్వడానికి సమయం వచ్చేసింది. కానీ ప్రేక్షకుల్లో ఒక సందేహం మొదలయ్యింది.
Tillu Square Tv Premiere: కొన్నాళ్లుగా తెలుగులో కూడా ఎన్నో బోల్డ్ చిత్రాలు విడుదల అవుతున్నాయి. పోస్టర్లలో సైతం లిప్ లాక్ సీన్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు మేకర్స్. అలా థియేటర్లలో బిగ్ స్క్రీన్‌పై అలాంటి బోల్డ్ సీన్స్ చూసి చాలామంది ఎంటర్‌టైన్ అవుతున్నారు. ఓటీటీలకు అయితే అసలు సెన్సారే లేదు కాబట్టి ఆ బోల్డ్ సీన్స్‌ను అలాగే చూసే అవకాశం సబ్‌స్క్రైబర్లకు దొరుకుతుంది. కానీ టీవీలో అలా కాదు. బుల్లితెరపై వచ్చే సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూస్తారు కాబట్టి ఛానెల్ యాజమాన్యాలు ప్రత్యేకంగా అలాంటి సీన్స్‌ను కట్ చేస్తాయి. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ పరిస్థితి కూడా అదే.
ఇప్పుడు టీవీ వంతు..
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను ఒక రేంజ్‌లో ఇంప్రెస్ చేసింది. అంతే కాకుండా విడుదలయిన కొన్నిరోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు కూడా బాగానే పోటీ జరిగింది. మొత్తానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయిన నెట్‌ఫ్లిక్స్.. ఈ మూవీ హక్కులను దక్కించుకుంది. ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా వ్యూస్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘టిల్లు స్క్వేర్’. ఇప్పుడు మొదటిసారి టీవీలో ప్రీమియర్ అవ్వడానికి సిద్ధమయ్యింది. కానీ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉండవేమో అని ప్రేక్షకుల్లో సందేహం మొదలయ్యింది.
‘అర్జున్ రెడ్డి’ తరహాలో..
ఆగస్ట్ 11న సాయంత్రం 6.30 నిమిషాలకు స్టార్ మాలో ప్రీమియర్ అవ్వడానికి సిద్ధమయ్యింది ‘టిల్లు స్క్వేర్’. కానీ ఒక బోల్డ్ మూవీ టీవీలో వచ్చిందంటే కచ్చితంగా అందులోని లిప్ లాక్ సీన్స్ అన్నీ డిలీట్ అయిపోవాల్సిందే. దానికి ఉదాహరణే ‘అర్జున్ రెడ్డి’. ఈ మూవీని టీవీపై ఇప్పటికీ పూర్తిగా చూడలేదు ప్రేక్షకులు. దాదాపు గంట సినిమాను కట్ చేసింది ఛానెల్ యాజమాన్యం. అందులో చాలావరకు హీరో, హీరోయిన్ మధ్య జరిగే లిప్ లాక్ సీన్సే ఉంటాయి. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’కు కూడా అదే పరిస్థితి వస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి ఇలాంటి బోల్డ్ సినిమాలను టీవీలో వచ్చినప్పుడు పూర్తిగా చూడడం కష్టమే అంటూ ఫిక్స్ అయిపోతున్నారు.ల
అనుపమతో హైప్..
మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’.. ‘డీజే టిల్లు’కు పర్ఫెక్ట్ సీక్వెల్ అని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. ‘డీజే టిల్లు’లోని ఒరిజినాలిటీ పోకుండా అదే క్యారెక్టర్‌ను కంటిన్యూ చేస్తే సిద్ధు జొన్నలగడ్డ నటన ప్రేక్షకులను తెగ ఇంప్రెస్ చేసింది. అంతే కాకుండా ఎప్పుడూ పక్కింటమ్మాయి పాత్రలు పోషించే అనుపమ పరమేశ్వరన్.. ఈ మూవీ కోసం తన రూటే మార్చేసింది. ‘టిల్లు స్క్వేర్’కు అంతగా హైప్ క్రియేట్ అవ్వడానికి అనుపమ బోల్డ్‌నెస్ కూడా ఒక కారణమే. అనుపమతో పాటు నేహా శెట్టి, ప్రియాంక జవాల్కర్ వంటి యంగ్ హీరోయిన్స్ కూడా ఇందులో గెస్ట్ రోల్స్‌లో కనిపించి అలరించారు.
Also Read: ‘హమ్ ఆప్కే హై కౌన్’కు 30 ఏళ్లు - బ్లాక్ టికెట్లు అమ్మేవాడి జీవితాన్ని మార్చేసిన సినిమా ఇది