అవును, తేజస్విని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, తన భర్తతో ఫోటోలు షేర్ చేస్తుంది మరియు ఆమెకు స్వంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.
Tejaswini Gowda: తెలుగు, తమిళ, కన్నడ బుల్లితెరపై సత్తా.. బిగ్ బాస్ రన్నర్‌తో ప్రేమ పెళ్లి.. తేజస్విని గౌడ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Tejaswini Gowda: అందం, అభినయంతో తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న మరో కన్నడ బ్యూటీ తేజస్విని గౌడ. కోయిలమ్మ సీరియల్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

- సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, మంచి పారితోషికం అందుకుంటుంది.
Tejaswini Gowda: తెలుగు టెలివిజన్ తెరపై తన అభినయం, అందంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి తేజస్విని గౌడ. స్టార్ మా లో ప్రసారమైన 'కోయిలమ్మ' సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. తేజస్విని గౌడ రియల్ లైఫ్, కెరీర్, పెళ్లి, ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం.
పర్సనల్ లైఫ్
తేజస్విని గౌడ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె కన్నడ కుటుంబానికి చెందిన అమ్మాయి. తేజస్విని గౌడ ప్రముఖ తెలుగు టీవీ నటుడు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2022 డిసెంబర్‌లో వీరి వివాహం బెంగళూరులో ఎంతో ఘనంగా జరిగింది. ఈ బుల్లితెర జంటకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
కెరీర్ & సీరియల్స్
కన్నడ ఇండస్ట్రీతో కెరీర్ మొదలుపెట్టిన తేజస్విని, ఆ తర్వాత తెలుగు, తమిళ టెలివిజన్ రంగంలోనూ సత్తా చాటింది. 2016లో స్టార్ మా లో వచ్చిన 'కోయిలమ్మ' సీరియల్‌తో తేజస్విని తెలుగులోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె పోషించిన 'కోకిల' పాత్ర ఒక సంచలనం. పాటలు పాడే ఒక అమాయకపు పల్లెటూరి అమ్మాయిగా ఆమె చూపించిన నటన, ఎక్స్‌ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సీరియల్ దాదాపు నాలుగేళ్ల పాటు విజయవంతంగా నడిచింది. 'కోయిలమ్మ' తర్వాత ఆమె స్టార్ మా లోనే వచ్చిన 'కేర్ ఆఫ్ అనసూయ' అనే సీరియల్‌లోనూ కీలక పాత్రలో నటించి మెప్పించింది.
కన్నడలో 'బిలి హెండ్తి' (2018) సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తమిళంలో 'సుందరి నీయుం సుందరన్ నానుమ్', జీ తమిళంలో 'విద్యా నెం.1' వంటి విజయవంతమైన సీరియల్స్‌లో లీడ్ రోల్స్ పోషించింది.
Also Read: విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
సోషల్ మీడియా
తేజస్విని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో(_tejaswini_gowda_official) రీల్స్ చేస్తూ, తన భర్త అమర్ దీప్‌తో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆమెకు స్వంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇందులో వారి హోమ్ టూర్స్, పండగ సెలబ్రేషన్స్ , ట్రావెల్ వ్లాగ్స్ అప్‌లోడ్ చేస్తూ అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటుంది.
రెమ్యూనరేషన్
తెలుగు, తమిళ, కన్నడ మూడు భాషల్లోనూ లీడ్ యాక్ట్రెస్‌గా క్రేజ్ ఉండటం వల్ల తేజస్విని బుల్లితెరపై మంచి పారితోషికమే అందుకుంటుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఆమె సీరియల్స్ లేదా ప్రత్యేక షోలలో నటించడానికి రోజుకు దాదాపు రూ.15,000 నుండి రూ.20,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్.
ఇంట్రెస్టింగ్ విషయాలు
అమర్ దీప్, తేజస్విని ఇద్దరూ వేర్వేరు సీరియల్స్ చేస్తూనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. మొదట్లో స్నేహితులుగా ఉండి, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట స్టార్ మా, జీ తెలుగులో వచ్చే పలు కపల్స్ రియాలిటీ షోస్, ఫెస్టివల్ ఈవెంట్స్ లో జంటగా పాల్గొని ప్రేక్షకులను అలరిస్తున్నారు. మధ్యలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వచ్చాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ తాము ఎంతో సంతోషంగా ఉన్నామంటూ ఈ జంట కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వీడియోలు చేయడం ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో తేజస్విని గౌడ తన భర్త అమర్ దీప్ గురించి మాట్లాడిన విషయాలు చూస్తే, వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్, పెళ్లి తర్వాత వారి లైఫ్ ఎలా ఉందో మరింత స్పష్టం అవుతుంది.
Also Read: హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ భాను.. గోమతి ప్రియ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Frequently Asked Questions
తేజస్విని గౌడ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారా?
ట్రెండింగ్ వార్తలు






















