అన్వేషించండి

Krishnamma kalipindi iddarini July 13th: ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సీరియల్ : గౌరీని కిడ్నాప్ చేసిన సూరిబాబు, సంబరాలు చేసుకుంటున్న అఖిల?

సూరిబాబు గౌరీని కిడ్నాప్ చేయటంతో సీరియల్ ఇంట్రెస్ట్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Krishnamma kalipindi iddarini July 13th: సౌదామిని తన కూతురు వాళ్ళతో నా తల్లి గారి ఇంట్లో నా కూతురు కోడలుగా అడుగు పెట్టాలన్న ఆశను ఎందుకు వదులుకుంటాను.. ఆస్తి మొత్తం నీకు దక్కేలాగా చూస్తాను అనటంతో మరి కాసేపట్లో పెళ్లి జరుగుతుంది అలా ఎలా చేస్తావు అని అడుగుతారు. అసలు పెళ్లి జరిగితేనే కదా.. ఇప్పట్లో గౌరీ కిడ్నాప్ అవుతుంది అని అనటంతో వాళ్ళు షాక్ అవుతారు. కిడ్నాప్ ఏ కాదు వేరొకరితో పెళ్లి కూడా జరుగుతుంది అని అంటుంది.

ఇక ఎవరు అతను అని అడగటంతో సూరిబాబు అని చెబుతుంది. సూరిబాబు గౌరీపై మనసు పడ్డాడట కాసేపట్లో తను కిడ్నాప్ కి గురవుతుంది అని చెబుతుంది. మరోవైపు గౌరీ వాళ్ళు పూజ చేస్తారు. ఇక గౌరీ అమ్మవారి పాట పాడి పూజ పూర్తి చేసుకుంటుంది. అందరూ చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. పూజ పూర్తయ్యాక ఆనందయ్య తన కూతురు గౌరీ దగ్గరికి వచ్చి తనను వదిలి అత్తారింటికి వెళ్తుంది అని బాధపడతాడు.

అంతేకాకుండా కూతురికి ధైర్యం చెబుతాడు. నువ్వు చాలా అమాయకురాలివి అందరినీ గుడ్డిగా నమ్ముతావు అని.. ఎవరి విషయంలోనైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతాడు. నీతో పాటు నీ చెల్లెలు కూడా ఈ ఇంటి కోడలు అవుతుంది అని.. తను అన్న మాటలు పట్టించుకోకు అని.. దాంతో గౌరీ తనని తలిలాగా చూసుకుంటాను అని మాట ఇస్తుంది. ఇక త్వరగా రెడీ అయ్యి మండపం దగ్గరికి రమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఆనందయ్య.

ఇక ఈశ్వర్ గౌరీని తలుచుకుంటూ ఉంటాడు. గౌరీ కి ఫోన్ చేసి కాసేపట్లో భార్యాభర్తలమవుతున్నాము అంటూ మనసులో మాటలు చెబుతూ ఉంటాడు. మరోవైపు సూరిబాబు బయట కార్ లో ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక గౌరీ దగ్గరికి వచ్చి ఒక ఆవిడ పిలవటంతో ఫోన్ కట్ చేసి తన దగ్గరికి వెళ్లగా తను బయట మీ అత్తగారు మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెబుతుంది.

దాంతో గౌరికి అనుమానం వస్తుంది. కానీ తను మీ అత్తగారు ఏదో సీక్రెట్ మాట్లాడారని పిలిచారేమో రమ్మని అంటున్నారు అనటంతో గౌరీ వెళ్తుంది. ఇక కారులో ఉన్నారు మీ అత్తగారు అనటంతో గౌరీ అక్కడ ఎందుకు ఉంటారు ఏదైనా ఉంటే ఇంట్లోకి పిలిచి మాట్లాడుతారు కదా అని అనుమానంతో అడగటంతో ఆవిడ మాత్రం తన మాటలతో నమ్మించి గౌరీని కారు దగ్గరికి తీసుకెళ్తుంది.

గౌరీ కార్ లో ఉన్న సూరిబాబును చూసి షాక్ అవ్వగా వెంటనే తనను అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. గౌరీ ఎంత వదలమన్నా కూడా వదలరు. ఆ తర్వాత అందంగా రెడీ అవ్వగా తన తల్లి చూసి మురిసిపోతుంది. ఇక సునంద జలజ వాళ్ళతో వెంటనే అఖిలను, గౌరీని మండపం దగ్గరికి తీసుకెళ్లాలి త్వరగా తీసుకురా అని చెబుతుంది.

జలజ అఖిలను పిలవగా గౌరీని కూడా పిలవడానికి వెళ్తారు. గౌరీ కనిపించకపోయేసరికి టెన్షన్ పడతారు. భవాని కూడా గౌరీ కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతుంది. అఖిలకు ఆ విషయం చెప్పటంతో అఖిల తెగ సంబరపడిపోతుంది. కానీ భవాని గౌరీ లేకుంటే నీ పెళ్లి జరగదు అని అనడంతో ఆలోచనలో పడుతుంది. మరోవైపు సూరిబాబు గౌరీని తీసుకెళ్తాడు.

also read : Prema Entha Madhuram July 13th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ : సుబ్బును కాపాడిన కూతురు, ఆర్యకు దక్కకుండా ముందు జాగ్రత్తలో ఉన్న అను?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget