![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Trinayani July 10th: ‘త్రినయని’ సీరియల్: సుమనకు పాము గండం, విశాలాక్షి తలకు ఢీకొట్టిన తిలోత్తమా?
సుమనకు పాము కుడుతుందని తెలియడంతో నయని టెన్షన్ పడటం వల్ల సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
![Trinayani July 10th: ‘త్రినయని’ సీరియల్: సుమనకు పాము గండం, విశాలాక్షి తలకు ఢీకొట్టిన తిలోత్తమా? Sumana has a snake gandam in Trinayani July 10th serial episode Trinayani July 10th: ‘త్రినయని’ సీరియల్: సుమనకు పాము గండం, విశాలాక్షి తలకు ఢీకొట్టిన తిలోత్తమా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/10/791d820b1edffe46eb92c8d47eff407f1688964694727768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trinayani july 10th: ఇక నయని తిలోత్తమాతో ఆడుతుండగా తిలోత్తమా తిరిగి విశాలాక్షి తలకు ఢీ కొట్టబోతు ఉండగా అప్పుడే విశాలాక్షి ఎద్దులయ్యని పిలవడంతో ఎద్దులయ్య ఆపుతాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకలా ఆపావు అని విశాలాక్షిని అడగటంతో తిలోత్తమా వచ్చిన వేగం వల్ల నా తల తనకు తగిలితే తలముక్కలయ్యేది అని అనడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.
ఆ తర్వాత నయని గాయత్రి పాపను పడుకోబెడుతూ ఉండగా అక్కడికి ఎద్దులయ్య, డమ్మక్క వచ్చి సుమన చంద్రకాంతపు మణి గురించి డమ్మక్కను ఎక్కడ ఉందో చెప్పమని ఇబ్బంది పెడుతుందని.. తిరిగి నేను కూడా సుమనను అడగటంతో తనని తిడుతుందని చెబుతారు. దాంతో ఈ మధ్య సుమనకు బాగా పిచ్చి లేసింది అని కోపంతో చెబుతుంది నయని. ఇప్పుడే తన దగ్గరికి వెళ్లి తనను అడిగేసి వస్తాను అని గాయత్రి పాప దగ్గర మీరు ఉండండి అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే నయని తర్వాత ఏం జరుగుతుందో అనేది చూస్తుంది.
ఇక అప్పుడు సుమనకు పాము కాటేయడం కనిపిస్తుంది. దాంతో నయని భయపడుతుంది. సుమనను నాగరాజు కాటేయడం ఏంటి అని అనుకుంటుంది. ఇక అక్కడే ఉన్న ఎద్దులయ్య వాళ్ళు.. ఏం జరిగింది సుమన దగ్గరికి వెళ్లాలి అనుకుంటే దూరం అవుతుందా అని అనటంతో నయని ఆలస్యం చేస్తే అదే జరిగేలా ఉంది అని అంటుంది. ఏం జరిగింది అని మళ్ళీ వాళ్ళు అడగటంతో ఏమి లేదు అని కంగారుగా మాట్లాడుతూ కనిపిస్తుంది.
మరోవైపు సుమన మొగలి పువ్వుల వాసనతో ఉన్న పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన విక్రాంత్ ఈ ఘాటు వాసన ఏంటి అని ఇబ్బంది పడుతూ ఉంటాడు. దాంతో సుమన మొగలిపువ్వు వాసన అని.. ఎంత బాగుందో మీరు కూడా కొట్టుకోండి అని అనటంతో విక్రాంత్ దూరంగా జరుగుతాడు. మొగలిపువ్వులు వాసన పాములకు ఇష్టం కదా అని విక్రాంత్ అడుగుతాడు. దాంతో సుమన అవేమో కానీ ఈ వాసన మాత్రం చాలా బాగుంది అని అంటుంది.
ఇక విక్రాంత్ మాటల్లో పడి నీకు వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను అంటూ.. నయని వదిన నిన్ను పిలుస్తుంది. వెళ్లి మాట్లాడు అనటంతో నేను వెళ్ళను.. తను మా అక్క కాదు ఒకరికొకరు పడని తోటి కోడలు రేపు వారసుడు పుట్టాక ఈ ఇంటి ఆస్తులు వారసుడికి వస్తాయని అంటుండగా ఇక నువ్వు మారవు అంటూ విక్రాంత్ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు.
ఇక మరుసటి రోజు అందరూ హాల్లో ఉండగా అక్కడికొచ్చిన నయని సుమనను పక్కకు రమ్మని అంటుంది. కానీ సుమన మాత్రం వెళ్ళదు. ఏదైనా చెప్పాలంటే ఇక్కడ అందరూ ముందు చెప్పు అనటంతో నయన్ చెప్పకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడే హాసిని మినప్పప్పు తీసుకొచ్చి పాయసం చేయలా వడలు చేయాలా అంటూ అడుగుతూ ఉంటుంది.
ఇప్పుడు మనం ఆలోచించేది అమ్మ పరిస్థితి గురించి అని తను విశాలాక్షితలకు ఎలా ఢీ కొట్టాలో అనేది ప్లాన్ చేయాలి విశాల్ అంటుండగా అప్పుడే అక్కడికి విశాలాక్షి వస్తుంది. ఇక విశాలాక్షిని మార్గం అడగటంతో తను ఇప్పుడే శివుడికి విభూతి అభిషేకం చేస్తుంటే వెళ్లి వచ్చాను అని.. విభూతియే ఇప్పుడు మార్గం అని హాసినిని తన చేతిలో ఉన్న మినప్పప్పును కింద వెయ్యమని అంటుంది. తిలోత్తమా వచ్చి ఆ పప్పుపై కాలు పెట్టగానే తను వేగంగా వస్తున్న సమయంలో ఆ విభూతి నుదుట పెట్టాలి అని చెబుతుంది.
దాంతో అందరు ఇది రిస్క్ అని అనటంతో నేను చేస్తాను అని నయని అంటుంది. ఇక అప్పుడే తిలోత్తమా అక్కడికి రాగా అక్కడున్న పప్పు పై కాళ్ళు పెట్టడంతో వెంటనే జారుతూ వస్తుండగా నయని విభూతి పెడుతుంది. ఆ తర్వాత తిలోత్తమా విశాలాక్షి తలకు ఢీ కొట్టి స్పృహ కోల్పోతుంది. దాంతో ఎద్దులయ్య నీరు చల్లి తనను లేపగా తను అందర్నీ అదోరకంగా చూస్తూ ఉంటుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)