Trinayani July 5th: ‘త్రినయని’ సీరియల్: విశాలాక్షిని అవమానించిన సుమన, చేతులారా కష్టం తెచ్చుకుంటున్న తిలోత్తమా?
విశాలాక్షి ఎదుట తిలోత్తమా, సుమన అతిగా ప్రవర్తించడం వల్ల వాళ్లకు తగిలే ఎదురు దెబ్బతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Trinayani july 5th: సుమన తనకు మణి పెట్టె కావాలని అంటుంది. అప్పుడే నయని వచ్చి ఏం కావాలని అడగడంతో పెట్టె కావాలని అంటుంది. దానిని నేను భద్రంగా దాచాను అని అనటంతో వెంటనే పావని మూర్తి చంద్రకాంతం ఉన్న పెట్టెనా అనటంతా అవును అంటుంది సుమన. ఇక పావని మూర్తి భార్య ఆ పెట్టె గురించి అడుగుతూ ఉంటుంది.
దాంతో పావని మూర్తి అందులో చంద్రకాంతం ఉందని దానికోసం సుమన అడుగుతుందని.. అది సుమన చూడకూడదు అనటంతో.. వెంటనే ఆవిడ అందులో అంతా ఏముంది.. దానిని రాయితో ముక్కలు చేసేస్తాను అని అనటంతో సుమన వెంటనే తన గొంతు నొక్కడానికి వెళ్తుండగా వెంటనే నయని ఆపి తనపై కోపంగా అరుస్తుంది.
ఇక పావని మూర్తి దంపతులు సుమన ప్రవర్తనకు భయపడి షాక్ అవుతారు. ఇక నయని వాళ్లను అక్కడ నుంచి వెళ్ళమని చెప్పి బంగారు పాము విగ్రహం చూపించి చేతిలో పట్టిస్తుంది. దానితో సుమన అక్కడే స్పృహ కోల్పోతుంది. ఇక నువ్వు డెలివరీ అయ్యే వరకు ఇలాగే నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అనుకుంటుంది నయని.
ఆ తర్వాత హాల్ లో కొడుకుతో కొత్త చప్పుడు తెప్పించుకొని తిలోత్తమా వేసుకొని షో చేస్తుంది. ఇక అప్పుడే నయని దంపతులు వచ్చి నట్టింట్లో చెప్పులు వేసుకోవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. అదే సమయంలో డమ్మక్క, ఎద్దులయ్య వచ్చి విశాలాక్షి అమ్మవారు కుండని తీసుకొని వస్తుందని అనటంతో ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు.
ఇక విశాలాక్షి ఇంట్లోకి రావడంతో నయని ఇంటికి కళ వచ్చింది అని అంటుంది. కానీ సుమన బిచ్చగత్తె వచ్చింది అన్నట్లు మాట్లాడటంతో నయని దంపతులతో పాటు విక్రాంత్ సుమనపై కోప్పడతారు. విశాలాక్షి సుమనను ఏమీ అనద్దు అని.. తమ వారు కూడా ముల్లోకాలు చుట్టూ బిక్షం ఎత్తుకుంటాడు అని అనటంతో వల్లభ వెటకారించి మాట్లాడుతూ ఉంటాడు.
ఇక మీ వారు ఎవరు అని అడగటంతో శివుడి పేర్లు చెబుతుంది విశాలాక్షి. దానితో సుమన నీ మొగుడు అని చెప్పొచ్చు కదా అనడంతో వెంటనే నయని తనను అక్కడి నుంచి వెళ్లిపోమని అంటుంది. వెళ్ళను అని ఆ కుండ ఎందుకు తీసుకొచ్చిందో అది తెలుసుకున్నాకే వెళ్తాను అని అంటుంది. ఇక విశాల్ ఆ కుండ ఎందుకు తెచ్చావ్ అమ్మ అని అడగటంతో.. బోనం కోసం అని ఇంట్లో బోనం సమర్పించాలి అని అంటుంది.
దాంతో నయని తాము కూడా ఆదివారం అమ్మవారిని పెట్టి పూజ చేయాలని అనుకుంటున్నాము అని.. ఆరోజు ఈ కుండలో ప్రసాదం వండి బోనం సమర్పించమని ఎద్దులయ్య అంటాడు. ఇక ఆ కుండను తిలోత్తమా చేతితో తీసుకొని ఆ తర్వాత సుమనకిచ్చి కడగమని చెబుతుంది. దాంతో తిలోత్తమా చెప్పులు వేసుకొని ఉండగా చెప్పులు విప్పేయమని అంటుంది విశాలాక్షి.
ఇంట్లో వాళ్ళు కూడా చెప్పులు వదిలేయమని అంటారు. కానీ తిలోత్తమా మొండిగా చెప్పులు వేసుకుని రావటంతో జారి కింద పడుతుంది. ఇక రెండోసారి విశాలాక్షి తలకు గుద్దుకుంటుంది. ఇక విశాల్ మరోసారి గుద్దుకోమని లేదంటే కొమ్ములు వస్తాయని నయని చెప్పింది అనటంతో తిలోత్తమా ఆ మాటలు వినదు. దాంతో విశాలాక్షి అలా చేయకపోతే తన కాలచక్రం వెనక్కి తిరుగుతుంది అని అప్పుడు తను వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది అని అంటుంది.
కాని తిలోత్తమా ఆ మాటలను లెక్క చేయకుండా కుండని తీసుకొని సుమనకు ఇచ్చి అక్కడినుండి వెళ్తుంది. ఇక సుమనను శుభ్రం చేయమని అనడంతో సుమన చెయ్యను అని మొండికి వేస్తుంది. దాంతో అందరూ చెప్పటంతో చివరికి ఒప్పుకొని తనతో పాటు విక్రాంత్ ను కూడా తీసుకెళ్తుంది. ఆ తర్వాత విశాల్ విశాలాక్షికి పండ్లు, పాలు తీసుకురమ్మని నయనికి చెబుతాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial





















