Trinayani September 29th: ఉలూచిని దాచేసిన తిలోత్తమ - విశాలాక్షిని నిందిస్తున్న సుమన!
తిలోత్తమ ఉలూచిని దాచేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Trinayani September 29th Written Update: సుమన వద్దు అని చెప్తున్నా కూడా నయని ఉలూచిని ఒక మూలన పెడుతుంది. అప్పుడు వెంటనే పెద్ద బొట్టమ్మ తను మనిషిలా మారి ఉలూచిని ఎత్తుకుంటుంది.
విశాలాక్షి: అలా తీసుకొని నీ కూతురిని లాలించు నాగులమ్మ
సుమన: వద్దు నా కూతురిని నాకు ఇచ్చేయండి. దయచేసి నాకు ఇచ్చేయండి అని అంటుంది కానీ సుమనని హాసిని గట్టిగా పట్టుకుంటుంది. ఇంతలో పెద్ద బొట్టమ్మ ఉలూచిని లాలిస్తూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అప్పుడు సుమను హాసినిని తోసి ఉలూచి మెడలో ఉన్న వాసుకి గొలుసు తీసుకుని వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత సీన్లో తిలోత్తమ వల్లభలు అఖండ స్వామి దగ్గరకు వస్తారు.
తిలోత్తమ: అఖండ స్వామి గారు నేను ఆ విశాలాక్షికి పచ్చి విషం ఇచ్చాను అయినా సరే తను ఎలా బతికింది?
అఖండస్వామి: విషం ఇస్తే ఖచ్చితంగా చనిపోవాల్సిందే ఇది తథ్యం. కానీ విశాలాక్షి ఆ విషయాన్ని తాగలేదు.
వల్లభ: తాగకపోవడం ఏంటి మా ముందే గుటకలేసుకొని మరి ఆ పాయసం తింది.
తిలోత్తమ: ఆ తరువాత పాము వచ్చి ఆ మెడని చుట్టుకున్నది కూడా
అఖండస్వామి: అయితే ఆ మెడకు చుట్టుకున్న పాము ఆ కంటంలో ఉన్న విషయాన్ని పీల్చేసింది. అందుకే విశాలాక్షికి ఏమీ కాలేదు
తిలోత్తమ: మరి ఆ విశాలాక్షిని ఇంటి నుంచి బయటికి పంపడానికి ఏమైనా సలహా ఇవ్వండి స్వామి మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఒకటి కూడా ఫలించడం లేదు.
Also Read: దివ్యపై రాజ్యలక్ష్మి ప్లాన్ మిస్ ఫైర్- అబద్ధం చెప్పిన హనీ, అల్లాడిపోతున్న పసి మనసు
అఖండ స్వామి: పెద్ద బొట్టమ్మ పాపని తీసుకొని వెళ్ళింది కదా తిరిగి ఊయాల మీదే పెడుతుంది అప్పుడు ఆ పాపని మీరు దాచేయండి. నింద విశాలాక్షి మీదకే వస్తుంది అప్పుడు జరగాల్సిన కథంతా కాలమే చెప్తుంది.
తిలోత్తమ: ఐడియా బాగుంది స్వామి ఆ పాపని తీసుకుని ఎక్కడో దగ్గర వదిలేస్తాము. చిన్నపిల్ల కాబట్టి తిరిగి దారి కూడా తెలీదు అప్పటికే విశాలాక్షి ఇంటిబయట ఉంటాది అని అంటుంది.
ఆ తర్వాత సీన్లో సుమన తన గదిలోకి వచ్చి పాప కోసం వెతుకుతూ ఉంటుంది .కానీ అక్కడ పాప కనిపించదు ఇంతలో పవన మూర్తి కూడా అక్కడికి వస్తాడు.
పవనుమూర్తి: ఏంటి సుమన అంత కంగారుగా వచ్చి వెతుకుతున్నావు?
సుమన: ఉలూచి కోసం వెతుకుతున్నాను. పెద్ద బొట్టమ్మ తల్లి ఇక్కడ పెట్టేస్తే ఏమైపోయినట్టు నాకు కనబడాలి కదా అని అనగా ఇంతలో ఎద్దులయ్య అక్కడికి వస్తాడు.
ఎద్దులయ్య: మీరు ఎంత వెతికినా కనిపించదు రేపు బయటకు వెళ్లి రోడ్లమీద పడి వెతుకుతారు
సుమన: ఎవడు నిన్ను లోపలికి రానిచ్చాడు?అసలేం మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావా లేకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోతావా?
Also Read: 'గబ్బర్ సింగ్' స్టైల్ లో ముకుందకి కృష్ణ వార్నింగ్- కొడుక్కి రేవతి సలహా
ఎద్దులయ్య: నేను ఇంటి నుంచి వెళ్లడం కాదు మీరే వెళ్తారు. నేను చెప్పవలసింది చెప్పాను చెప్పాను మీ ఇష్టం. నా మాటల్ని మీరు గ్రహిస్తే మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
పవనమూర్తి: చీకటి పడింది కనుక పాప పాము రూపంలో ఉంటుంది. అందుకే నీకు కనబడ ఉండదు రేపు ఉదయాన్నే వచ్చి చూద్దాము అప్పుడు కనిపిస్తుంది నువ్వేం కంగారు పడొద్దు అని సుమన తో చెప్తాడు.
ఆ తర్వాత రోజు ఉదయం విశాలాక్షి ఇంట్లో అందరితో సనాతన ధర్మం గురించి చెప్తూ ఉంటుంది.
వల్లభ: నీకు ఈ విషయాలన్నీ మా కన్నా బానే తెలుసు విశాలాక్షి అని అనగా ఇంతలో సుమన పరిగెత్తుకుంటూ కిందకు వస్తుంది.
సుమన: విశాలాక్షిని పొగడడం కాదు ముందు నా కూతురు ఎక్కడున్నాదో చెప్పమనండి.
హాసిని: అదేంటి పెద్ద బొట్టమ్మ ఎత్తుకుంది కదా తిరిగి వచ్చి దింపేయలేదా
సుమన: లేదు అందుకే అడుగుతున్నాను ఈ విశాలాక్షి ఏదో చేసింది. అని అనగా ఇందులో పెద్ద బొట్టమ్మ అక్కడికి వస్తుంది. పెద్ద బొట్టమ్మని చూసిన విశాలాక్షి వెంటనే తను ఎవరికీ కనబడకుండా ఉండేటట్టు ఒక మాయ చేస్తుంది. అప్పుడు పెద్ద బొట్టమ్మ వచ్చినట్టు నయని వాళ్ళకి కూడా కనబడదు, వినబడదు.
పెద్ద బొట్టమ్మ: నేనిక్కడే పాపను విడిచిపెట్టి వెళ్ళాను నేను ఏమీ చేయలేదు
విశాలాక్షి: నాగులమ్మ నువ్వు ఎంత మాట్లాడినా ఇక్కడ ఎవరికీ కనబడదు, వినబడదు.
వల్లభ: ఎవరితో మాట్లాడుతున్నావు నీలో నువ్వే మాట్లాడుతున్నావా?
విశాలాక్షి: లేదు పెద్ద బొట్టమ్మతో మాట్లాడుతున్నాను.
సుమన: మరి పెద్ద బొట్టమ్మ నాకు కనిపించడం లేదు నీకు ఎలా కనిపిస్తుంది. మా అక్కకి కూడా కనిపించడం లేదు అంటే నువ్వే నాటకాలు ఆడుతున్నావు. మర్యాదగా నా కూతురు ఎక్కడున్నాదో చెప్పు లేకపోతే ముందు నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను.
పెద్ద బొట్టమ్మ: అమ్మ వీల్లు నిన్ను మాటలు అంటున్నారు. నువ్వు ఒక్క మాట చెప్పమ్మా వెళ్లి కాటేస్తాను.
విశాలాక్షి: లేదు నాగులమ్మ ఇదంతా విధి. ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది.
వల్లభ: పెద్ద బొట్టమ్మ కనిపిస్తే సుమనకి, నయనకి ఇద్దరికి కనిపించాలి వాళ్ళిద్దరికీ కనబడకుండా నీకే కనిపిస్తుంది అంటే అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. ముందు బయటికి పంపించేయండి.
విశాలాక్షి: నిద్రపోయిన వారిని తట్టి లేపవచ్చు కానీ నిద్రపోయేటట్టు నటిస్తున్న వారిని ఎప్పటికీ లేపలేము. ఎందుకో ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్న నీ మొఖాలను చూస్తే చెప్పాలనిపించింది.
సుమన: పాప ఏదని అడిగితే భలే మాట మారుస్తున్నావు. పెద్ద బొట్టమ్మ కనిపిస్తుంది అంటున్నావు, పాప ఎక్కడ ఉన్నదో చెప్పడం లేదు, అసలు ఏం చేసావు నా పాపని ?
విశాల్: తీసుకొని వెళ్ళింది పెద్ద బొట్టమ్మ అయితే విశాలాక్షిని ఎందుకు అంటున్నావు ?
సుమన: చెప్పింది విశాలాక్షి కదా
పెద్ద బొట్టమ్మ: వీళ్ళు నిన్ను ఇన్ని మాటలు అంటుంటే నేను సహనంగా ఆగలేకపోతున్నాను అమ్ మీరు ఆజ్ఞ ఇవ్వండి వెళ్లి కాటేస్తాను .
విశాలాక్షి: నేను చెప్పాను కదా నాగులమ్మ విధి అనుకూలసారమే అన్ని జరుగుతాయి అని
సుమన: అదంతా కాదు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial