అన్వేషించండి

Gruhalakshmi September 29th: దివ్యపై రాజ్యలక్ష్మి ప్లాన్ మిస్ ఫైర్- అబద్ధం చెప్పిన హనీ, అల్లాడిపోతున్న పసి మనసు

దివ్య, విక్రమ్ ఒక్కటి కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Gruhalakshmi September 29th:  తులసి కాలికి దెబ్బ తగిలే సరికి తనకి సేవలు చేయడంలో నందు నిమగ్నమవుతాడు. భోజనం చేస్తుండగా హనీ గుర్తుకు వచ్చిందని తులసి వెంటనే పాపకి ఫోన్ చేస్తుంది. అటు హనీ సామ్రాట్ ఫోటో చూస్తూ ఏడుస్తుంది. తులసి ఆంటీ ఫోన్ చేస్తుందని పెద్దాయనతో అంటుంది. విషయం చెప్పకుండా జాగ్రత్తగా మాట్లాడతానని చెప్తుంది. దిగులుగా ఉందని చూడాలని అనిపిస్తుందని తులసి చెప్తుంది. ఆ మాటకి హనీ ఏడుస్తుంది. తిన్నావా లేదా అని ఆరా తీస్తుంది. తిన్నానని హనీ అబద్ధం చెప్తుంది. బాధ తట్టుకోలేక ఏడుస్తుంటే తులసి కంగారుగా ఏమైందని అడుగుతుంది. ఏం కాలేదు మీరు గుర్తుకు వచ్చి ఏడుపు వచ్చిందని అంటుంది. తను సంతోషంగా ఉన్నానని చక్కగా ఆడుకుంటున్నానని చెప్తుంది. హనీ మాటలు నిజమని నమ్మిన తులసి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత పసి మనసు అల్లాడిపోతుంది.

Also Read: 'గబ్బర్ సింగ్' స్టైల్ లో ముకుందకి కృష్ణ వార్నింగ్- కొడుక్కి రేవతి సలహా

విక్రమ్ ని దివ్య నుంచి శాశ్వతంగా దూరం చేసేందుకు రాజ్యలక్ష్మి ప్లాన్ వేస్తుంది. ప్రసన్నని పిలిచి ప్లాన్ చెప్తుంది. టబ్ లో నీళ్ళు పోసి చంద్రుడు కనిపించేలా ఏర్పాటు చేసి అది దివ్య చూసేలా చేయమని రాజ్యలక్ష్మి చెప్తుంది. వినాయక పూజ చేయకుండా చందమామని చూస్తే నీలాపనిందలు పడేలా చేయవచ్చని అంటుంది. దివ్య చేతికి ఇచ్చిన డాక్యుమెంట్స్ మాయమయ్యేలా చేయాలని స్కెచ్ వేస్తుంది. ప్రసన్న టబ్ పెట్టిన దగ్గర ఉన్న బట్టలు తీసుకురమ్మని రాజ్యలక్ష్మి దివ్యని పిలుస్తుంది. చెప్పినట్టుగానే దివ్య బట్టలు తీస్తుంది కానీ టబ్ వైపు కన్నెత్తి కూడ చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని రాజ్యలక్ష్మి తిట్టుకుంటుంది. అప్పుడే తాగి వచ్చిన బసవయ్య టబ్ దగ్గరకి వచ్చి తాగేసి ఊగుతూ పొరపాటున టబ్ లో ఉన్న చందమామని చూసేస్తాడు. తమ ప్లాన్ బెడిసికొట్టేసరికి ప్రసన్న తిట్టుకుంటూ బసవయ్యని తీసుకుని వెళ్ళిపోతుంది.

పండగ కోసమని తులసి పనులు చేస్తుంటే నందు వచ్చి హడావుడి చేస్తాడు. తులసిని ఇంప్రెస్ చేయడం కోసం తప్పదని పనులు చేయాలని పరంధామయ్య నందుకి సలహా ఇస్తాడు. పొద్దున్నే నిద్రలేచిన బసవయ్యని ప్రసన్న తిడుతుంది. వద్దంటే వినకుండా చంద్రుడి చూశావ్ నీలాపనిందలు పడతావని  తిడుతుంది. ఇక దివ్య విక్రమ్ కి నలుగు పెట్టడానికి మొత్తం సిద్ధం చేస్తుంది. తనకి నలుగు పెట్టొద్దని మారాం చేస్తాడు. కానీ దివ్య మాత్రం ఒప్పుకోదు. స్నానం చేయించే దగ్గర నువ్వుల నూనె కనిపించకపోయేసరికి దివ్య బసవయ్యని పిలిచి అడుగుతుంది. అప్పుడే నిందలు మొదలయ్యాయని అనుకుంటాడు. షర్ట్ లేకుండా విక్రమ్ కూర్చుని సిగ్గుపడుతూ ఉంటాడు. నూనె తీసుకొస్తానని చెప్పి దివ్య విక్రమ్ కళ్లకి గంతలు కట్టేసి వెళ్తుంది. దొరికింది సందు అనుకుని జాహ్నవి వచ్చి విక్రమ్ వీపు రుద్దుతూ సరసాలు ఆడుతుంది. రాస్తుంది దివ్య అనుకుని విక్రమ్ నవ్వుతూ ఉంటాడు. దివ్య వచ్చి అది చూసి కోపంగా విక్రమ్ కళ్ళకి కట్టిన గంతలు విప్పేస్తుంది. జానూ  పక్కన ఉండటం చూసి విక్రమ్ షాక్ అవుతాడు.

Also Read: మైఖేల్ బెండు తీసిన కనకం- ఇంటికి తిరిగొచ్చిన స్వప్న, రాహుల్ మైండ్ బ్లాక్!

దివ్య: మా ఆయనకి నువ్వు నలుగు పెట్టడం ఏంటి?

విక్రమ్; అవును నువ్వు పెట్టడం ఏంటి?

రాజ్యలక్ష్మి: మరదలు కదా సరదాగా ఆట పట్టించింది

దివ్య: పెళ్లి కావాల్సిన పిల్ల హద్దుల్లో ఉంటే మంచిది. ఇలాంటివి ఎంకరేజ్ చేయవద్దని చెప్పి తిడుతుంది. ఇక తర్వాత తానే భర్తకి నలుగు పెట్టి రుద్దుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget