Guppedantha Manasu Serial New Time: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ టైమింగ్ మార్పు, రిషీ రీ-ఎంట్రీ కూడా ఫిక్స్? రోజూ ఎన్ని గంటలకు ప్రసారమంటే?
Guppedantha Manasu Serial New Time: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషి ఎంట్రీ ఇస్తున్నాడా? అందుకేనా మరోసారి స్టార్ మా సీరియల్ టెలికాస్ట్ టైంను సాయంత్రానికి మార్చింది.
![Guppedantha Manasu Serial New Time: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ టైమింగ్ మార్పు, రిషీ రీ-ఎంట్రీ కూడా ఫిక్స్? రోజూ ఎన్ని గంటలకు ప్రసారమంటే? star maa changes guppedantha manasu serial timings from afternoon to evening Guppedantha Manasu Serial New Time: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ టైమింగ్ మార్పు, రిషీ రీ-ఎంట్రీ కూడా ఫిక్స్? రోజూ ఎన్ని గంటలకు ప్రసారమంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/da9dc564e3ae6596207581a22cc2180a1716910034109239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guppedantha Manasu Serial New Timeings: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ అభిమానులకు స్టార్‌మా ఛానెల్ గుడ్ న్యూస్ చెప్పింది. బుల్లితెర మీద సూపర్ డూపర్ లవ్ స్టోరీగా దూసుకుపోయిన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఈ మధ్య గాడి తప్పింది. ఇప్పటికే పలుమార్లు ఈ సీరియల్ టైమింగ్స్ మార్చిన టీమ్ తాజాగా మరోసారి ‘గుప్పెడంత మనసు’ టైమ్ మార్చేశారు. అయితే ఈసారి ఈ టైం సీరియల్ అభిమానులకు కిక్ ఇస్తుందనే చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్‌ని తీసుకొస్తున్న స్టార్ మా ఇప్పుడు ‘నిన్నుకోరి’ అనే కొత్త సీరియల్‌ని ‘గుప్పెడంత మనసు’ టైంలో తీసుకొస్తుంది. దీంతో ‘గుప్పెడంత మనసు’ సీరియల్ టైం మరోసారి మార్చేశారు.
‘గుప్పెడంత మనసు’ సీరియల్ ప్రస్తుతం ఈ సీరియల్ మధ్యాహ్నం 12.30కి ప్రసారం అవుతుంది. తాజాగా ఈ సీరియల్ టైంని సాయంత్రానికి షిఫ్ట్ చేశారు. దీంతో ‘గుప్పెడంత మనసు’కి మంచి రోజులు మొదలవ్వనున్నాయి. సీరియల్‌కి మంచి కథతో ఉంటే సరిపోదు. ప్రేక్షకులు ఎక్కువగా టీవీలు చూసే టైంలో టెలికాస్ట్ చేయడం ముఖ్యం. రిషి, వసు, జగతిల అద్బుతమైన నటనకు ఈ సీరియల్ టైమింగ్ బాగా సపోర్ట్ చేసింది. సీరియల్ ప్రారంభంలో సాయంత్రం 7 నుంచి 7.30 వరకు ప్రసారం కావడంతో విపరీతంగా అభిమానులు పెరిగారు. తర్వాత ఈ సీరియల్ టైమ్‌ను చాలా సార్లు మార్చేశారు. తాజాగా ‘గుప్పెడంత మనసు’ మరోసారి టైం మార్చుకుంది. జూన్ 3 నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా టీం ప్రకటించారు.
కొడుకు కోసం తల్లి ఆరాటం, తల్లిని కొడుకు అపార్థం చేసుకోవడం.. తీరా తల్లిని అర్థం చేసుకున్న టైంలో తల్లి దూరం కావడంతో సీరియల్ మీద కాస్త ఎఫెక్ట్ పడింది. అయినా సరే రిషి, వసుల కోసం సీరియల్‌ని చాలా మంది చూసేవాళ్లు. కానీ జగతి క్యారెక్టర్‌ని చంపేసిన కొన్ని రోజుల్లోనే రిషి కూడా మాయమైపోయాడు. దీంతో రిషి లేని ‘గుప్పెడంత మనసు’ను ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. రిషి స్థానంలో మనుని తీసుకొచ్చినప్పటికి అంత ఇంపాక్ట్ చూపించలేదు. పైగా ఈ సీరియల్ మధ్యాహ్నం టెలికాస్ట్ చేయడం బాగా ఎఫెక్ట్ చూపించింది. తాజాగా సీరియల్ టైం మారడంతో పాటు రిషి ఎంట్రీ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ సీరియల్ గాడిలో పడనుందని తెలుస్తోంది.
‘గుప్పెడంత మనసు’ సీరియల్ స్టార్టింగ్‌లో సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం అయ్యేది. తర్వాత దాన్ని సాయంత్రం ఆరు గంటలకు మార్చారు. ఇక సీరియల్‌లో జగతి రిషిలు లేకపోవడంతో పాటు స్లాట్‌ని మధ్యాహ్నం 12.30కి మార్చేయడంతో టాప్‌లో ఉన్న సీరియల్ ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. తాజాగా మారిన టైంతో మళ్లీ ‘గుప్పెడంత మనసు’కి పాత రోజులు వస్తాయని అందరూ ఆశిస్తున్నారు.
View this post on Instagram
ఒకప్పుడు ‘గుప్పెడంత మనసు’లో రిషి, వసుల ఎమోషనల్ లవ్ ట్రాక్ ఆడియన్స్‌ని కట్టిపడేసింది. కానీ ఇప్పుడు ఈ సీరియల్ లవ్ ట్రాక్ కాస్త కుళ్లు, కుతంత్రాలు, కిడ్నాప్‌లు అంటూ రణరంగంలా మారిపోయింది. ఒకప్పుడు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్లు ఇప్పుడు అబ్బా సీరియల్ వచ్చేసిందిరా అని తలబాదుకొనేలా మారింది. సీరియల్ పూర్తిగా ప్లాఫ్ అయిన టైంలో అనుపమ అంటూ కొత్త క్యారెక్టర్‌ని దించారు. అది సరిపోకపోవడంతో ఆమె కొడుకు మనూని రంగంలోకి దించారు. మహేంద్ర, అనుపమల కొడుకే మను అని ట్విస్ట్ ఇచ్చారు. అయినా మను రిషి ప్లేస్‌ని రీప్లేస్ చేయకపోగా దరిదాపులకు కూడా వెళ్లలేకపోయాడు. తాజాగా సీరియల్ సాయంత్రానికి మారడంతో మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారు. మూడు నెలల్లో రిషిని తీసుకొస్తా అని వసు శపథం చేసింది. దాని ప్రకారం రిషి రీ ఎంట్రీ ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు రిషి రీ ఎంట్రీ ఉంటుందా లేక మొత్తానికి సీరియల్‌కి శుభం కార్డు పెట్టేస్తారా అని అందరూ అనుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)