News
News
X

Hyper Aadi Sreemukhi : 'హైపర్' ఆది దెబ్బకు పరుగులు తీసిన శ్రీముఖి

శ్రీముఖి అంటే బుల్లితెర రాములమ్మ. ఆమెకు భయపడే వాళ్ళు ఉన్నారు. అటువంటి శ్రీముఖిని హైపర్ ఆది భయపెట్టారు. స్టేజి వదిలి కిందకు పరుగులు తీసేలా చేశారు. 

FOLLOW US: 

శ్రీముఖి (Sreemukhi) కి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆమెను అభిమానులు ముద్దుగా బుల్లితెర రాములమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఆమెకు భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి శ్రీముఖిని ఫేమస్ టీవీ సెలబ్రిటీ, సినిమాల్లో కూడా హాస్య నటుడిగా కనిపిస్తున్న 'హైపర్' ఆది (Hyper Aadi) భయపెట్టారు. అదీ ఎంత ఎలా భయపెట్టారంటే... శ్రీముఖి స్టేజి వదిలి కిందకు పరుగులు తీసేలా! భయం అంటే వార్నింగ్ గట్రా ఇవ్వలేదు. ముద్దులతో భయపెట్టారు. అలా కూడా భయానికి గురి చేయవచ్చా? అంటే అసలు వివరాల్లోకి వెళ్ళాలి మరి!

మూడ్ వస్తే ముద్దులు పెడతా!
రాఖీ (Raksha Bandhan 2022) పండగ సందర్భంగా ఈటీవీ ఛానల్ కోసం మల్లెమాల సంస్థ 'హలో బ్రదర్' అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసింది. ఆగస్టు 7న ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. లేటెస్టుగా ప్రోమో విడుదల చేశారు. అందులో 'హైపర్' ఆది, 'ఆటో' రామ్ ప్రసాద్ మధ్య శ్రీముఖి ఒక పోటీ పెట్టారు.

ఒక సాంగ్ ప్లే చేస్తామని, ఆ పాటలో ఏయే వస్తువుల పేర్లు అయితే ఉన్నాయో... వాటిని తీసుకు వచ్చి తన చేతిలో ఎవరు అయితే ముందుగా పెడతారో? వాళ్ళు గెలిచినట్టు, ఎవరు అయితే తర్వాత పెడతారో వాళ్ళు ఓడినట్టు అని శ్రీముఖి చెప్పారు. 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాలో ఐటమ్ సాంగ్ 'ఆకలేస్తే అన్నం పెడతా...' ముందుగా ప్లే అయ్యింది. అందులో 'మూడ్ వస్తే ముద్దులు పెడతా' అని ఉంటుంది కదా! అందుకని, వస్తువులను వదిలేసి శ్రీముఖి దగ్గరకు వెళ్లి ఆది, రామ్ ప్రసాద్ ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశారు. అఫ్ కోర్స్... అదీ చేతి మీదే అనుకోండి. వాళ్ళిద్దరూ చేసిన పనికి శ్రీముఖి షాక్ తిన్నారు (Hyper Aadi Tried To Kiss Sreemukhi).
 
నవీన్ చంద్రకు శ్రీముఖి ముద్దు
శ్రీముఖికి ముద్దు పెట్టాలని 'హైపర్' ఆది, 'ఆటో' రామ్ ప్రసాద్ ట్రై చేస్తే... శ్రీముఖి మాత్రం నవీన్ చంద్రకు ముద్దు పెట్టారు (Sreemukhi Kissed Naveen Chandra). నవీన్ చంద్ర బుగ్గ మీద ముద్దు పెట్టమని వేలితో చూపించడంతో ముద్దు పెట్టినట్టు చేశారు శ్రీముఖి. అంతే కాదు... ఆయన్ను బావా అని పిలవడం కూడా విశేషం. ఆ తర్వాత 'మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటది...' సాంగ్ ప్లే అయ్యింది. అంతే... శ్రీముఖికి విషయం అర్థం అయ్యింది. తన వైపు ఆది రావడం గమనించి స్టేజి మీద నుంచి కిందకు పరుగులు తీశారు.  

Also Read : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?

'హలో బ్రదర్'లో దివంగత హీరో ఉదయ్ కిరణ్‌ను గుర్తు చేశారు. ఆయనకు నివాళిగా ఆయన జీవితాన్ని పెర్ఫార్మన్స్ రూపంలో చూపించారు. ఈ కార్యక్రమంలో రీతూ చౌదరి,  భాను శ్రీ తదితరులు సందడి చేశారు. 

Also Read : హీరోలకు సంతోషాన్ని ఇచ్చిన 'బింబిసార', 'సీతా రామం'... కంగ్రాట్స్ చెబుతూ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ ట్వీట్స్

Published at : 06 Aug 2022 01:16 PM (IST) Tags: Sreemukhi Naveen Chandra Auto Ram Prasad Hyper Aadi Aadi Kisses Sreemukhi Sreemukhi Kiss To Naveen Chandra

సంబంధిత కథనాలు

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Guppedantha Manasu ఆగస్టు 18 ఎపిసోడ్: వసుకి క్యారియర్ పంపించి జగతికి అన్నం తినిపించిన రిషి, దేవయానిలో మొదలైన భయం

Guppedantha Manasu ఆగస్టు 18 ఎపిసోడ్:  వసుకి క్యారియర్ పంపించి జగతికి అన్నం తినిపించిన రిషి, దేవయానిలో మొదలైన భయం

Janaki Kalaganaledu August 18th Update: జ్ఞానాంబ పెట్టిన షరతుల్లో జానకి మొదటి తప్పు చేసేసిందా? మల్లిక ఇరికించేసిందిగా

Janaki Kalaganaledu August 18th Update: జ్ఞానాంబ పెట్టిన షరతుల్లో జానకి మొదటి తప్పు చేసేసిందా? మల్లిక ఇరికించేసిందిగా

Karthika Deepam Serial ఆగస్టు 18 ఎపిసోడ్: శౌర్యకి వాటర్ బాటిల్ కొనిచ్చిన దీప, ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బాబు -మోనిత కోసం వెయిటింగ్

Karthika Deepam Serial ఆగస్టు 18 ఎపిసోడ్: శౌర్యకి వాటర్ బాటిల్ కొనిచ్చిన దీప, ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బాబు -మోనిత కోసం వెయిటింగ్

Gruhalakshmi August 18th Update: తులసి మీద అరిచిన సామ్రాట్, నీచంగా మాట్లాడిన లాస్య- ప్రేమ్ దగ్గరకి వెళ్లనని తేల్చి చెప్పిన శ్రుతి

Gruhalakshmi August 18th Update: తులసి మీద అరిచిన సామ్రాట్, నీచంగా మాట్లాడిన లాస్య- ప్రేమ్ దగ్గరకి వెళ్లనని  తేల్చి చెప్పిన శ్రుతి

టాప్ స్టోరీస్

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు