Geeta Madhuri - Nandu Son: ఘనంగా గీతా మాధురి కుమారుడి అన్నప్రాసన వేడుక... అబ్బాయి పేరేంటో తెల్సా? - ఫోటోలు, వీడియో వైరల్
Dhruvadheer Tarak Annaprasam Ceremony : గీతా మాధురి, నందు కుమారుడి అన్నప్రాసన వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకను సోషల్ మీడియా ద్వారా గీతామాధురి పోస్ట్ చేశారు.
Geeta Madhuri - Nandu Son Annaprasanam Ceremony: టాలీవుడ్ టాప్ సింగర్ గీతా మాధురి కుమారుడి అన్నప్రాసన వేడుక ఘనంగా జరిగింది. గీతా మాధురి, ఆమె భర్త నందు కుటుంబ సభ్యులు, బంధువులు హాజరు కాగా, ఈ వేడుకను వైభవంగా జరిపించారు. గీతా మాధురి తాజాగా సోషల్ మీడియాలో ఈ స్పెషల్ ఈవెంట్ కు సంబంధించిన పిక్స్ ను షేర్ చేయగా, అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
గీతా మాధురి కుమారుడి అన్నప్రాసన వేడుక
టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో సింగర్ గీతా మాధురి, యాక్టర్ అండ్ హోస్ట్ నందు జంట కూడా ఒకటి. తాజాగా ఈ జంట తమ కుమారుడి అన్నప్రాసన వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అటు నందు, ఇటు గీతా మాధురి కుటుంబ సభ్యులతో కలిసి శాస్త్రబద్ధంగా ఈ అన్నప్రాసన వేడుకను నిర్వహించారు. అందులో తమ తనయుడి ఎదురుగా సాంప్రదాయం ప్రకారం ఆహారం, పూలు, పుస్తకాలు, డబ్బులు పెట్టారు. అయితే గీత మాధురి కుమారుడు ముందుగా డబ్బును ముట్టుకోవడం విశేషం. ఆ తర్వాత బంగారాన్ని పట్టుకున్నాడు. ఈ తంతు జరిగిన తర్వాత నందు, గీత కుటుంబంలోని పెద్ద వాళ్లంతా ఒక్కొక్కరిగా వచ్చి, ఆ బాలుడికి తీపి తినిపించి ఆశీర్వదించారు. చివరికి కుటుంబ సభ్యులంతా కలిసి హారతి ఇచ్చి, ఈ అన్నప్రాసన వేడుకను పూర్తి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను గీతా మాధురి, నందు సోషల్ మీడియాలో షేర్ చేయగా, తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే నెటిజెన్లు గీత మాధురి తనయుడు ఎంత క్యూట్ గా ఉన్నాడో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ జంట ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని దీవిస్తున్నారు.
2014లో ప్రేమ వివాహం
గీతా మాధురి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ సింగర్ అన్న విషయం తెలిసిందే. ఓ సింగింగ్ షోకి ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు నందు యాక్టర్ గా, హోస్ట్ గా బిజీగా ఉన్నారు. అయితే కెరీర్ మొదట్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పట్లో నందు సినిమాల్లో హీరోగా ట్రై చేస్తుండగా, అప్పటికే గీతా మాధురి సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. 2014లో ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2019లో ఈ సెలబ్రిటీ కపుల్ ఒక పాపకి తల్లిదండ్రులయ్యారు. ఆమెకు దాక్షాయణి ప్రకృతి అనే పేరు పెట్టారు. 2024 ఫిబ్రవరి 10న గీతా మాధురి రెండవసారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకి ధృవ్ ధీర్ తారక్ అనే పేరు పెట్టారు.
ప్రస్తుతం నందు - గీతా మాధురి ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. గీతా మాధురి సింగింగ్ కాన్సర్ట్స్ తో అదరగొడుతుంటే, నందు ఓవైపు ఢీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూనే, మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. రీసెంట్ గా నందు 'వెల్కమ్ టు మోక్ష ఐలాండ్', 'వధువు' వంటి వెబ్ సిరీస్ లలో కనిపించాడు. అయితే ఇప్పటిదాకా ఆయన హీరోగా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఇప్పుడు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.