Daawath Promo: కీరవాణి, మీరు మాట్లాడుకోరా? ఏమైనా గొడవలా? - హీరో సింహా కోడూరిపై రీతూ ప్రశ్నల వర్షం
Daawath Promo: ‘దావత్’ షోకు తరువాతి ఎపిసోడ్‌లో గెస్ట్‌గా వచ్చాడు సింహా కోడూరి. అందులో రీతూ అడిగిన పలు కాంట్రవర్షియల్ ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది.
Simha Koduri In Daawath Promo: టాలీవుడ్ యంగ్ హీరోలలో డిఫరెంట్ స్క్రిప్ట్స్ సెలక్ట్ చేస్తూ ముందుకెళ్తున్న వారిలో సింహా కోడూరి. తన తండ్రి కీరవాణి, అన్న కాళభైరవలా కాకుండా మ్యూజిక్ ఫీల్డ్‌కు దూరంగా ఉంటూ యాక్టింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు సింహా. తాజాగా రీతూ చౌదరీ హోస్ట్ చేస్తున్న ‘దావత్’కు హోస్ట్‌గా వచ్చిన సింహా.. తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.
లిప్ లాక్‌కు రియాక్షన్..
సింహా కోడూరి ఫ్యామిలీకి చెందిన రాజమౌళి దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్లుగా కీరవాణి, కాళభైరవ ఇప్పటికే ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఇక యాక్టర్ కేటగిరిలో సింహా కూడా సెటిల్ అయ్యాడు. దీనిపై సింహా స్పందిస్తూ ఎవరి ఇంట్రెస్ట్‌తో వాళ్లు ముందుకెళ్లారు అని సమాధానమిచ్చాడు. ఒకవేళ తన సినిమాలో లిప్ లాక్ ఉంటే రాజమౌళి, కీరవాణి రియాక్షన్ ఎలా ఉంటుందని అడగగా.. తనకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదంటూ సిగ్గుపడ్డాడు సింహా. తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ టీవీలో క్యారెక్టర్ నీళ్లు అడిగిందని నిజంగానే నీళ్లు తీసుకెళ్లి టీవీకి ఉన్న హోల్స్‌లో పోసేవాడిని అని చెప్పి అందరినీ నవ్వించాడు.
కాంట్రవర్షియల్ ప్రశ్నలు..
స్కూల్‌లో తను చేసిన అల్లరిని గుర్తుచేసుకున్న సింహా.. ‘‘క్లాస్‌లో టీచర్లు ఎవరూ లేనప్పుడు బెంచ్‌లు అన్నీ మార్చేసి, బ్లాక్ బోర్డ్ తీసి పడేసి, తర్వాత ఏమీ తెలియనట్టు మేమే మళ్లీ టీచర్లకు వెళ్లి కంప్లెయింట్ చేసేవాళ్లం’’ అని చెప్పాడు. కీరవాణి.. రాజమౌళి సినిమాలకు అందించినట్టుగా మ్యూజిక్‌ను మిగతా సినిమాలకు అందించరు ఎందుకు? ఇన్‌స్టాగ్రామ్‌లో కీరవాణితో ఒక్క ఫోటో కూడా లేదు ఎందుకు? కీరవాణి, మీరు మాట్లాడుకోరని బయట టాక్, మీకు ఏమైనా గొడవలు అయ్యాయా? కీరవాణి కొడుకు అని చెప్పకుండా సుకుమార్ దగ్గర ఎందుకు పనిచేశారు? లాంటి కాంట్రవర్షియల్ ప్రశ్నలను అడిగింది రీతూ చౌదరీ అడిగింది. దానికి సింహా కోడూరి ఎలాంటి సమాధానాలు ఇచ్చాడో తెలియాంటే ఎపిసోడ్ చూడాల్సిందే.
బంక్ కొట్టి గుడికి వెళ్లాం..
‘దావత్’లో సింహా కోడూరితో ఒక టాస్క్‌ను కూడా ఆడించినట్టుగా ప్రోమోలో చూపించారు. తన ఫ్యామిలీలోని వ్యక్తుల ఫోటోలను పెట్టి వారికి ఒక ట్యాగ్‌ను యాడ్ చేయమని చెప్పగా.. ‘పెండింగ్’ అనే ట్యాగ్‌ను కీరవాణికి ఇచ్చాడు. అంటే తన తండ్రితో ఎప్పటికీ సినిమా చేయడం ఇష్టం లేదనే అర్థం వచ్చేలా ఆ ట్యాగ్‌ను ఇచ్చాడంటూ రీతూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘రాడ్’ అనే ట్యాగ్‌ను రాజమౌళికి ఇచ్చాడు. తన కాలేజ్ రోజులను గుర్తుచేసుకుంటూ ‘‘నేను, నా ఫ్రెండ్స్ కాలేజ్ బంక్ కొట్టినప్పుడు ఏం చేయాలో తెలియక ఒకసారి గుడికి వెళ్లాం. పులిహోర బాగుంటుందంటే వెళ్లాం’’ అని చెప్పాడు. అయితే తను చెప్తున్న సమాధానాలు ఏవీ ఇంట్రెస్టింగ్‌గా లేవని రీతూ అనగా.. ‘‘అన్ని ఛానెల్స్‌కు థంబ్‌నెయిల్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది’’ అని కౌంటర్ వేశాడు సింహా. అలాగే, తండ్రి ఇంటి పేరు ఎంఎం అని స్టార్టవుతుంటే.. మీ పేరు సింహా కోడూరి అని ఎందుకు ఉంది? మీ తండ్రితో మీరు మాట్లాడరట నిజమేనా అంటూ కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు కూడా అడిగింది రీతూ చౌదరి. మరి, ఆమె ప్రశ్నలకు ఏం సమాధానం ఇచ్చాడో తెలియాలంటే.. ఆ ఎపిసోడ్ స్ట్రీమ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.
Also Read: ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడితో హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లి - ఫోటోలు చూశారా?