News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Madhuranagarilo June 16th: ‘మధురానగరిలో’ సీరియల్: షాక్ ల మీద షాకిచ్చిన శ్యామ్, పెళ్లి కార్డు చూసి కంగుతిన్న రాధ?

పెళ్లి పత్రికలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో కాకుండా ప్రేమించిన అమ్మాయి ఫోటోతో శ్యామ్ షాక్ ఇవ్వడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

FOLLOW US: 
Share:

Madhuranagarilo June 16th: శ్యామ్ రాధ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా రాధ అతడిది వన్ సైడ్ లవ్ అని తెలుసుకొని కాసేపు ప్రేమ పెళ్లి గురించి వివరిస్తుంది. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు కచ్చితంగా ప్రేమించుకుంటారు అంటూ భారీ భారీ డైలాగులు కొడుతూ ఉంటుంది. ఇక వారి మాటలు విని పండు ఆడుకుందాము అంటే ఏమేమో మాట్లాడుతున్నారు అంటూ తల పట్టుకోవడంతో రాధ పండుని లోపలికి తీసుకొని వెళుతుంది.

ఇక గోపాల్ గ్యాంగ్ మొత్తం శ్యామ్ పార్టీ ఇచ్చాడని చేసుకుంటుండగా గన్నవరం వచ్చి తాగేసి ఆ పార్టీ శ్యామ్ ఇవ్వడు అని ధనుంజయ ఇవ్వచ్చు అని కాసేపు రచ్చ రచ్చ చేస్తూ ఉంటాడు. మరోవైపు మధుర, ధనుంజయ్ శుభ కార్డులు సెలక్షన్ చేస్తూ ఉండగా అదే సమయంలో శ్యామ్ అక్కడికి రావడంతో.. కార్డు సెలక్షన్ చేయమని అంటారు.

దాంతో శ్యామ్ కాస్త కోపంగా నేను కార్డు సెలక్షన్ చేయకపోతే పెళ్లి ఆగిపోతుందా అంటూ మాట్లాడటంతో వెంటనే మధుర దంపతులు షాక్ అవుతారు. అలా అంటున్నావ్ ఏంటి అని ఆశ్చర్యంగా అడగటంతో.. మా ఇద్దరికి రాసి ఉంటే ఎలాగైనా జరుగుతుంది లేదంటే ఆఖరి క్షణంలో కూడా ఆగిపోతుంది అంటూ మాట్లాడుతాడు. ఆ తర్వాత ఎలాగైనా సంయుక్త తో పెళ్లి జరుగుతుంది అని తన తల్లిదండ్రులకు కాస్త ధైర్యం ఇస్తాడు.

ఇక మధుర సంయుక్త, శ్యామ్ ఫోటోలను పెళ్లి కార్డులో పెట్టించాలని అనుకుంటుంది. ఆ విషయాన్ని శ్యామ్ కి చెప్పి ప్రింట్ చేయమని చెబుతుంది. ఇక శ్యామ్ గదిలోకి వెళ్లి సంయుక్తది, తనది ఫోటో పక్కన పెట్టి అస్సలు మ్యాచ్ కాలేదు.. ఇక లాప్టాప్ లో రాధ ఫోటోను తన ఫోటో పక్కన పెట్టడంతో ఇప్పుడు జంట సెట్ అయింది అని మురిసిపోతాడు. ఆ సమయంలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతాడు.

అప్పుడే గోపాల్ వచ్చి డిన్నర్ కి పిలుస్తాడు. గోపాల్ ఎక్కడ ఆ ఫోటో చూస్తాడో అన్న భయంతో వెంటనే గోపాల్ ను అక్కడ నుంచి పంపిస్తాడు. ఆ తర్వాత రాధ పెళ్లి కార్డు ప్రింట్ చేయించడం ఆపాలి అని మధుర దగ్గరికి వస్తుంది. ఇక మధుర తో మాట్లాడుతూ ఉండగా సంయుక్త కూడా వస్తుంది. ఇక ఆ సమయంలో కాసేపు కార్డు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

దాంతో రాధ కాస్త టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. మధుర కాఫీ తేవడానికి వెళ్లగా శ్యామ్ ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసుకున్నావా అంటూ సంయుక్త రాధని అడిగి ఎలాగైనా అమ్మాయిని పట్టుకొని నాకు అప్పచెప్పు అని అంటుంది. మరోవైపు గన్నవరం తనకు రాత్రి పార్టీ ఇచ్చినట్లు కల వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగా తన గ్యాంగ్ మొత్తం వచ్చి అది కల కాదు నిజం అంటూ కాసేపు చివాట్లు పెడుతూ ఉంటారు.

ఇక ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి శ్యామ్ వెళ్లి అక్కడ సంయుక్త ఫోటో కాకుండా రాధ ఫోటో పెట్టి ప్రింట్ చేయిస్తాడు. తరువాయి భాగంలో ఇదంతా రాధ వల్ల సాధ్యమైంది అని మధుర మొదట రాదను కార్డు చూడమని అంటుంది. ఇక ఆ కార్డు చూసి రాధ షాక్ అయినట్లు కనిపిస్తుంది. ఇక శ్యామ్ మాత్రం కాస్త భయపడుతూ కనిపిస్తాడు.

Read Also: Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ తండ్రి మరణానికి కారణం అదే, 38 ఏళ్ల వయస్సులోనే తమ్ముడు అలా: శ్రీలక్ష్మి

Published at : 16 Jun 2023 09:42 AM (IST) Tags: Madhuranagarilo serial Madhuranagarilo telugu serial Madhuranagarilo star maa serial Madhuranagarilo June 16th

ఇవి కూడా చూడండి

Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'

Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'

Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌‌పై రతిక చెత్త కామెంట్స్

Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌‌పై రతిక చెత్త కామెంట్స్

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు-  చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్

Prema Entha Madhuram September 29th: తాంబూలాలు మార్చుకున్న జలంధర్,నీరజ్- స్కూల్ ని తిరిగి తెరిపించిన ఆర్య!

Prema Entha Madhuram September 29th: తాంబూలాలు మార్చుకున్న జలంధర్,నీరజ్- స్కూల్ ని తిరిగి తెరిపించిన ఆర్య!

Trinayani September 29th: ఉలూచిని దాచేసిన తిలోత్తమ - విశాలాక్షిని నిందిస్తున్న సుమన!

Trinayani September 29th:  ఉలూచిని దాచేసిన తిలోత్తమ - విశాలాక్షిని నిందిస్తున్న సుమన!

టాప్ స్టోరీస్

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే

CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే