Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ తండ్రి మరణానికి కారణం అదే, 38 ఏళ్ల వయస్సులోనే తమ్ముడు అలా: శ్రీలక్ష్మి
ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ మంచి నటుడు. అయితే, ఆయన 38 ఏళ్లకే ఆయన మరణించారు. అందుకు గల కారణాన్ని ఆయన సోదరి శ్రీలక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Aishwarya Rajesh: ఎవరికి ఏ సమయం ఎలా రాసి ఉంటుందో తెలియదు కానీ ఆ సమయంలో ఏదైతే జరగాలో అదే జరుగుతుంది అనే అంశాన్ని ఫాలో అయ్యేవాడు ఒకప్పటి హీరో రాజేష్. ఈతరం ప్రేక్షకులకు ఈయన గురించి అంత తెలియదు. కానీ ఒకప్పటి తరం ప్రేక్షకులకు మాత్రం బాగా తెలుసనే చెప్పాలి. ఇక ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ మాత్రం ఇప్పటికి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో హీరోయిన్ గా ఒక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా ఓ సినిమాలో చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. వారసత్వంగా అడుగుపెట్టిన ఐశ్వర్య రాజేష్ మొత్తానికి తండ్రికి తగ్గ కూతురుగా పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇక ఈమె మేనత్త ఎవరో కాదు ఒకప్పటి లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి.
ఇక శ్రీలక్ష్మి సినిమాలకు దూరంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇంటర్వ్యూల ద్వారా తమ ఫ్యామిలీ విషయాలు చెబుతుంటారు. ఇక ఈమె తమ్ముడు రాజేష్ గురించి కూడా చాలా విషయాలు వెల్లడించారు. రాజేష్ దాదాపు 54 కు పైగా సినిమాలలో చేసి నటుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అప్పటి ప్రేక్షకులు ఈయనపై మంచి అభిమానం చూపించారు.
అయితే శ్రీలక్ష్మి గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో తన తమ్ముడు ఫ్యామిలీ గురించి చాలా విషయాలు పంచుకుంది. తన తమ్ముడు రాజేష్ బాగా తాగుడికి బానిస అయ్యాడని.. ఇక అది కర్మనో లేక మరేంటో తెలియదు కానీ.. ఆ తాగుడు వల్లే చనిపోయాడు అని తెలిపింది.
తన తమ్ముడు రాజేష్ చనిపోయినప్పుడు కేవలం 38 ఏళ్ల వయసులో మాత్రమే ఉన్నాడట. రాజేష్ చిన్న వయసులోనే పెళ్లి చేసుకోగా ముగ్గురు అబ్బాయిలకు, ఒక అమ్మాయికి జన్మనిచ్చాడు. ఆ అమ్మాయే ఐశ్వర్య రాజేష్. ఇక ఒక కొడుకు జాబ్ చేస్తున్నాడు అని.. మిగతా ఇద్దరు కొడుకులు చనిపోయారు అని తెలిపింది. ఇక ఇప్పుడు వాళ్ల కాళ్ళ మీద వాళ్లు బతుకుతున్నారు అని తెలిపింది శ్రీలక్ష్మి.
ఈ విషయాన్ని ఐశ్వర్య రాజేష్ కూడా గతంలో ఓసారి తెలిపి బాగా ఎమోషనల్ అయింది. ఇక తను ఇండస్ట్రీకి అడుగు పెట్టాక హీరో రాజేష్ అభిమానులు సంతృప్తి చెందారు. ఈమె కూడా తండ్రికి తగ్గట్టుగా మంచి పేరు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అని దీవించారు. మొత్తానికి ఐశ్వర్య రాజేష్ తన తండ్రి మరణించాక తన తండ్రి గౌరవాన్ని ఇండస్ట్రీలో కాపాడటం కోసం చిన్న ఆర్టిస్టుగా అడుగుపెట్టి మొత్తానికి హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది.
ఐశ్వర్య ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ల ఫామ్ లోకి కూడా వస్తుంది ఐశ్వర్య రాజేష్. తెలుగు ప్రేక్షకులు కూడా ఈమెను తెలుగు సినిమాలలో చూడాలని తెగ ఆరాటపడుతున్నారు. అయితే, ఐశ్వర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు తెలుసు సినీ దర్శక నిర్మాతలు తెలుగులో అవకాశాలు ఇవ్వడంలేదని వాపోయింది. అలాగే, ‘పుష్ప’లో రష్మీక పాత్రకు తాను సరిపోతానంటూ చేసిన ఆమె వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. దానిపై మళ్లీ ఐశ్వర్య వివరణ ఇచ్చుకోవల్సి వచ్చింది.
Also Read: పోలీసు కావాలనుకున్న శరత్ బాబు నటుడు ఎలా అయ్యారు? ఆయన గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు