Madhuranagarilo July 10th: సంయుక్త అడ్డు తొలగించుకున్న శ్యామ్.. అపర్ణ మాటలకు నిజం తెలుసుకున్న కూతురు?
పార్కుకు వచ్చిన సంయుక్త అడ్డు తొలగించడానికి శ్యామ్ ప్లాన్ చేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Madhuranagarilo July 10th: రాధ సంయుక్త కు ఫోన్ చేసి తాము పార్కుకు వచ్చాము అని శ్యామ్ తో నువ్వు టైం స్పెండ్ చేయొచ్చు అని రమ్మని అంటుంది. దాంతో సంయుక్త సరే అని లొకేషన్ పంపమంటుంది. ఆ తర్వాత పండు తో కలిసి వీరిద్దరు కూడా స్వీట్ కార్న్ తింటూ ఉంటారు. మరోవైపు హోటల్లో దెబ్బలు తిన్నందుకు నెల్సన్, గోపాల్ నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటారు.
అప్పుడే అక్కడికి గన్నవరం వచ్చి కాసేపు వేటకారం చేసి మీరు ఏ విధంగా దెబ్బతిన్నారో ఒక స్వామిజీ చెప్పాడు అని.. ఈ విషయం కాలనీ వాళ్ళందరికీ చెబుతాను అనటంతో వాళ్ళు వద్దని అంటారు. కానీ మరోసారి వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు గన్నవరం. ఆ తర్వాత పార్కులో ఒక భర్త తన భార్యకు కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసి తాగమని అంటుంటాడు. తను పదిమందిలో ఇలా తాగటం ఇష్టపడను అని అంటుంది.
దాంతో అతడు పెద్ద గొడవ చేసి మరో పెళ్లి చేసుకుంటాను అని బెదిరిస్తూ ఉంటాడు. తను మాత్రం కూల్ డ్రింక్ తాగాను అని బ్రతిమాలుతూ ఉంటుంది. దాంతో అతడు ఆమె మీదికి చెయ్యి ఎత్తబోతూ ఉంటే శ్యామ్ వచ్చి అడ్డు ఆపుతాడు. కొట్టబోతుంటే ఆవిడ నా భర్తను కొట్టొద్దు అని బ్రతిమాలుతుంది. దానితో శ్యామ్ అతడికి బుద్ధి చెబుతాడు. ఇక ఆ మాటలు విని ఫిదా అవుతుంది రాధ.
అప్పుడే పార్కు దగ్గరికి సంయుక్త వస్తుంది. ఈ ముగ్గురు ఒకచోట కూర్చుని ఉంటారు. అప్పుడే శ్యామ్ కు రావడంతో అక్కడ నుండి బయటికి వెళ్తాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత రాధకు ఎలా ప్రపోజ్ చేయాలా అని అనుకుంటాడు. సంయుక్త మాత్రం అక్కడ వీళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో శ్యామ్ ఎదుట కారు ఉండగా ఆ కారు అద్దంపై ఐ లవ్ యు రాధ అని రాస్తాడు.
దాంతో సంయుక్త అది చూసి నా కారుపైనే రాస్తాడా అంటూ కోపంతో రగిలిపోతుంది. ఇక శ్యామ్ వెంటనే ఇది రాధకు చూపించాలి అని రాధ దగ్గరికి వెళ్లి బయట నీకోసం ఎవరో ఎదురుచూస్తున్నారు అని అనడంతో రాధ అక్కడ నుంచి వెళ్తుంది. శ్యామ్ కూడా రాధను ఫాలో అవుతాడు. కారు అద్దం చూస్తుంది అని తెగ సంబరపడిపోతాడు. ఇక రాధ ఇక్కడ ఉన్న సంయుక్తను చూసిన అవుతుంది కానీ కారు అద్దంపై ఏమి ఉండదు. అప్పటికే సంయుక్త దానిని చెరిపి వేస్తుంది.
వెంటనే శ్యామ్ సంయుక్త దగ్గరికి వెళ్లి నువ్వేంటి ఇక్కడ అనటంతో రాధ ఫోన్ చేసి పిలిచింది అని అంటుంది. ఆ తర్వాత అందరూ ఒక దగ్గర కూర్చోగా టీ తీసుకొని వస్తుంది రాధ. రాధ సంయుక్తకు టీ ఇస్తుండగా కావాలని శ్యామ్ సంయుక్త మీద పడేలా చేస్తాడు. వెంటనే రాధ చూసుకోలేదు అని సారీ చెబుతుంది. ఈ పార్కులో నేను ఈ డ్రెస్ పై ఎలా తిరగాలి అని సంయుక్త ఇబ్బంది పడుతుంది.
దాంతో శ్యామ్ ఇంటికి వెళ్లిపో అని నేరుగా చెప్పేస్తాడు. ఇక సంయుక్త ఇంటికి వెళ్లడంతో అదంతా శ్యామ్ ప్లాన్ అని అర్థమవుతుంది. ఇక రాధ వాళ్లు కూడా ఇంటికి బయలుదేరుతారు. వెళ్ళిన తర్వాత సంయుక్త శ్యామ్ ఫోటో చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అపర్ణ వచ్చి ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లండి అని అంటుంది.
శ్యామ్ తనతో రాడు అని చెప్పటంతో రాధ ను చెప్పమని అని అంటుంది. కానీ సంయుక్త నిన్ననే టీ మీద పోసింది అనటంతో వెంటనే అపర్ణ నువ్వు ఇంటికి వెళ్ళాలి అని శ్యామ్ అలా చేసి ఉంటాడు అని అనటంతో సంయుక్త కూడా నిజం అదే అని అనుకుంటుంది. ఇక తరువాయి భాగంలో చీకటి పడ్డాక శ్యామ్ లవ్ సింబల్ తో ఉన్న బెలూన్ తీసుకొచ్చి రాధకు ప్రపోజ్ చేస్తాడు. అదే సమయంలో అక్కడికి మధుర దంపతులు రావడంతో వారిద్దరిని అలా చూసి షాక్ అవుతారు.
Also Read: Trinayani July 10th: ‘త్రినయని’ సీరియల్: సుమనకు పాము గండం, విశాలాక్షి తలకు ఢీకొట్టిన తిలోత్తమా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial