Madhuranagarilo July 25th: ‘మధురానగరిలో’ సీరియల్: రాధను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన శ్యామ్ - షాక్‌లో కుటుంబ సభ్యులు
శ్యామ్ రాధని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో కుటుంబ సభ్యులు షాక్ అవ్వటం వల్ల సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Madhuranagarilo July 25th: శ్యామ్ రాధతో శోభనం గురించి నీకు ఏమి తెలియదా అడగటంతో వెంటనే రాధ కోపంతో ఛీదరించుకొని ముందే పండు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో అని అంటుంది. నువ్వే అన్నావు కదా ఇక్కడే దగ్గర్లో ఉన్నాడని గుడిలో ఎవరో చెప్పారు అని అంటాడు శ్యామ్. ఉన్నాడు కానీ అతను ఎదురుపడితే ఎలా గుర్తుపట్టాలి అని నోరు జారుతుంది రాధ. వెంటనే ఆశ్చర్యపోయిన శ్యామ్ నీ భర్తను నువ్వు ఎలా గుర్తుపట్టవు అని తిరిగి ప్రశ్నిస్తాడు.
దాంతో రాధ తాము విడిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది అని ఇప్పటికీ ఇప్పటికీ ఆయన ముఖంలో మార్పు రావచ్చు అని సర్దుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక చీకటి పడ్డాక శ్యామ్ కిరణ్ తో కలిసి మందు కొడుతూ తనకు రాధ విషయంలో చాలా బాధలు ఉన్నాయి అని అంటాడు. అంతేకాకుండా తన భర్త ఎలా ఉంటాడో కూడా తనకు తెలియదు అని అన్నదని అసలు తనకు తన భర్త ఎలా ఉంటాడో తెలియకుండా ఉంటుందా అని అడుగుతాడు.
ఇక కిరణ్ అదంతా ఏమీ లేదు తను నిన్ను ఇష్టపడుతుంది. ఎలా చెప్పాలో అర్థం కాకుండా అలా ప్రవర్తిస్తుంది.. నువ్వు ఇప్పుడు వెళ్లి తనకు ముద్దు పెట్టు. ఒకవేళ లాగి కొడితే తను నిన్ను ఇష్టపడటం లేదు అని.. ఏమనకుండా మౌనంగా ఉంటే తను నిన్ను ఇష్టపడుతుంది అని అనటంతో శ్యామ్ సరే అని రాధ గదికి బయలుదేరుతాడు. ఇక తనకు కాకుండా పండుకు ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్లగా ఏం జరిగింది అని కిరణ్ ఫోన్ చేస్తాడు.
అలా ముద్దు పెట్టడం తప్పు అనిపించింది అని.. తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలి అని అంటాడు. ముందు ప్రేమ గురించి పక్కకు పెట్టి నేరుగా పెళ్లి చేసుకో అని సలహా ఇస్తాడు కిరణ్. దాంతో అంతే అంటావా అయితే ఇప్పుడే చేసుకుంటాను అని అంటాడు శ్యామ్. మరోవైపు విల్సన్ నిద్రపోతున్న తన భార్య పై ఫ్యాన్ గాలి తగిలేలా చేసి తన అందాలు చూడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.
వెంటనే శిరోజా విల్సన్ ను బయటకి గెంటేస్తుంది. అప్పుడే పెరుగు తోడు కోసం వాసంతి వచ్చి నగల కోసం, డబ్బుకు సంబంధించిన దూరం పెట్టొద్దు. అలా పెడితే వేరే అమ్మాయి జోలికి వెళ్తాడు అని.. కాబట్టి ఆలోచించుకొని తనకు సలహా ఇవ్వటంతో శిరోజా కూడా కాస్త ఆలోచనలో పడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అపర్ణ, సంయుక్త న్యూస్ పేపర్ తీసుకొని కోపంతో ఊగిపోతూ మధుర ఇంటికి వస్తారు.
పేపర్లో ఏం రాసి ఉందో చూడండి అంటూ మధుర భర్తకి ఇవ్వటంతో ఆయన చదవగా అందులో శ్యామ్ రాధ పై ఉన్న ప్రేమను బయట పెడుతూ ఈరోజు గుడిలో పెళ్లి చేసుకోవడానికి నీకోసం ఎదురు చూస్తున్నానని ఉండటంతో మధుర షాక్ లో ఉంటుంది. ఆ న్యూస్ పేపర్ రాధకు చూపించగా రాధ కూడా షాక్ అయ్యి వెంటనే గుడికి వెళుతుంది. అక్కడ శ్యామ్ చేతిలో తాళిబట్టుకొని నిలబడి ఉండగా చూసి అందరూ షాక్ లో ఉంటారు.
also read it : Madhuranagarilo July 24th: ‘మధురానగరిలో’ సీరియల్: సంయుక్త, అపర్ణ లను బెదిరించిన రాధ.. గుడిలో పెళ్ళికొడుకు గెటప్ లో శ్యామ్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial