Rangula Ratnam July 22th: అర్చననే తన భార్య అని తెలుసుకున్న శంకర్ ప్రసాద్.. భర్తకు దగ్గర కానని చనిపోవడానికి నిర్ణయించుకున్న పూర్ణ?
అర్చననే తన భార్య అని శంకర్ ప్రసాద్ తెలుసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Rangula Ratnam July 22th: వర్ష మీకు కళ్ళు ఇచ్చిందని శంకర్ ప్రసాద్ కి ఆకాష్ చెప్పటంతో శంకర్ ప్రసాద్ బాగా ఎమోషనల్ అవుతాడు. ఇక ఆకాష్ ఇక మాతోనే ఉండండి అని భోజనాల దగ్గరికి వెళ్ళగా ఇక్కడ ఉంటే రఘు వాళ్లకు ఎదురుపడతాను అని అక్కడి నుంచి వెళ్తాడు శంకర్. ఇక తన కూతురు సమాధి దగ్గరికి వెళ్లి వద్దంటే బలవంతంగా పెళ్లి చేశాను.
కానీ నీ అత్తింటి వారిని మొత్తం మార్చుకున్నావని తెలుసుకో లేక పోయాను.. వాళ్ళు నీపై చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఇదంతా నా వల్లే అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. నేను చేసిన తప్పులకు ఇప్పుడు నువ్వు కోల్పోయినందుకు శిక్ష అనుభవిస్తున్నాను అని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు పూర్ణ శంకర్ ప్రసాద్ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.
అప్పుడే రఘు అక్కడికి వచ్చి నాన్న అన్నమాట తలుచుకొని ఇంకా బాధ పడుతున్నావా అమ్మ అంటూ అడుగుతూ ఉంటాడు. దాంతో పూర్ణ తన బాధను మొత్తం బయటికి చెప్పుకుంటుంది. తనకు నేను నీ భార్య పూర్ణ అని చెప్పినా కూడా వినలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు చెప్పినా ఆయన వినడు. రేఖ వచ్చి చెప్పినా కూడా అసలే వినడు. ఎందుకంటే రేఖ తనను మోసం చేసినప్పటికీ కూడా గతంలో రేఖ నా గురించి చెప్పిన మాటలు ఆయనలో పాకిపోయాయి.
ఇప్పుడు ఆయన నా గురించి ఎవరు చెప్పినా కూడా అసలు వినడు అని అంటుంది. అప్పుడే చనిపోతే బాగుండేది ఇప్పుడు ఈ బాధలు పడకపోయేదాన్ని.. గతంలో చావు బతుకులో ఉన్నప్పుడు డాక్టర్ అమ్మ కాపాడింది. ఇక రేఖ సహాయంతో అర్చనగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టాను. ఆ సమయంలో నాకు గతం గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే గతం గుర్తుకు వచ్చిందో అప్పటినుంచి నేను పూర్ణ అని చెప్పిన కూడా మీ నాన్న వినలేదు.
డాక్టర్ అమ్మతో నిజం చెప్పించాలని ప్రయత్నించగా తనను కిడ్నాప్ చేసింది. అంతేకాకుండా గతంలో కోర్టులో చక్రి దంపతులు చేసిన పని వల్ల నాన్నను కాపాడటం కోసం అర్చనగా నటించాల్సి వచ్చింది అని చెబుతూ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి ఆకాష్ వచ్చి శంకర్ ప్రసాద్ గురించి చెప్పటంతో ఇప్పుడే ఇంతకీ ఇంటికి తీసుకొని వస్తాము అని అంటాడు రఘు. కానీ పూర్ణ మాత్రం ఆయన ఇక రాడు. నేనిక్కడ ఉన్నాను సంగతి తెలిస్తే అసలే రాడు అని అంటుంది.
దాంతో రఘు ఆ విషయాలని నాన్నకు తర్వాత చెబుదాం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో వెతుకుతామని అక్కడి నుంచి ఆకాష్ తో బయలుదేరుతాడు. ఇక పూర్ణ మీ అందరికీ ఎలా చెప్పాలి ఆయన రాడు. ఆయనకు నిజం తెలియాలంటే రేఖనే చెప్పాలి. అలా అయితేనే ఆయనకు నిజం తెలుస్తుంది అని అంటుంది. మరోవైపు శంకర్ ప్రసాద్ రోడ్డుపై నడుచుకుంటూ వర్ష ఫోటో లేదు అని బాధపడుతూ ఉంటాడు.
తన ఇంటి దగ్గరికి చేరుకోగానే ఇంట్లో వర్ష ఫోటో ఉంటుందేమో అని అక్కడికి వెళ్తాడు. గది మొత్తం వెతకటంతో వర్ష ఫోటో దొరుకుతుంది. అదే సమయంలో అక్కడికి సీత వచ్చి రేఖ పై కోపంగా అరుస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు.. నీకు మా మామయ్య ఆస్తులు కావాలి కదా తీసుకున్నాక మళ్ళీ ఎందుకు మా అత్తయ్య ను బాధ పెడుతున్నావు అని అంటుంది. తను మామయ్య కోసం చాలా బాధపడుతుంది. తనే పూర్ణ అని చెప్పిన కూడా మామయ్య వినడం లేదు ఇదంతా నీ వల్లే అని అంటుంది.
తను కూడా నీలాగే ఒక ఆడదే కదా అనటంతో వెంటనే రేఖ శంకర్ తనని నమ్మకుండా తన గుండెని రాయిని చేసింది నేనే అని అనటంతో అప్పుడే పైనుండి కిందికి వస్తున్న శంకర్ ఆ మాటలు విని షాక్ అవుతాడు. ఇక గతంలో తను పూర్ణ విషయంలో చేసిన మోసాలన్నీ ఒకటి తర్వాత ఒకటి బయట పెడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సీత, శంకర్ షాక్ అవుతారు. ఆ అర్చననే పూర్ణ అని తను డాక్టర్ అమ్మచే నిజం చెప్పించాలని చేస్తుందని తనను కిడ్నాప్ చేయించాను అని అన్ని నిజాలు బయట పెడుతుంది. దాంతో శంకర్ కోపంతో రగిలిపోతాడు. తరువాయి భాగంలో పూర్ణ శంకర్ ఫోటో చూసి ఇక ఈ జన్మకు పూర్ణ అని చెప్పిన కూడా తను నమ్మడు అని చనిపోవాలని ఫిక్స్ అవుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial