Kasturi Serial Actress: నాన్న ప్రేమ తెలీదు - నేను కడుపులో ఉండగానే వదిలేశాడు: తేజస్వీని, ఐశ్వర్య కన్నీళ్లు!

ఇద్దరికీ నాన్న లేరు. ఒకరు కడుపులో ఉండగానే వదిలేస్తే.. మరొకరు తన బిడ్డను ఎంతో అప్యాయంగా పెంచి అకస్మాత్తుగా కన్నుమూశారు. ఐశ్వర్య, తేజస్విని చెప్పింది వింటే.. కన్నీళ్లు ఆగవు.

FOLLOW US: 

సినీ, టీవీ రంగాల్లో ఉండే తారలవి ఎంతో కలర్‌ఫుల్ జీవితాలని అనుకుంటాం. కానీ, వారు ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, సవాళ్లను ఎదుర్కొన్న తర్వాతే ఆ స్థాయికి చేరుతారనే సంగతి చాలామందికి తెలీదు. బుల్లితెరపై వినోదాన్ని పంచుతున్న తేజస్విని (‘C/O అనసూయ’లో శివాణి), కస్తూరి(Kasturi) సీరియల్ నటి ఐశ్వర్యల జీవితాలే ఇందుకు నిదర్శనం. ఇద్దరూ చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. ఒకరు తల్లి కడుపులో ఉండగానే తండ్రికి దూరం కాగా, మరొకరు ఎదిగే వయస్సులో నాన్నను శాస్వతంగా కోల్పోయారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరారు. ‘స్టార్ మా పరివార్ లీగ్ 3’లో పాల్గొన్న తేజస్విని, ఐశ్వర్యలు తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు కష్టాలను గురించి చెబుతూ కన్నీరుమూన్నీరయ్యారు. 

ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘‘నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న.. అమ్మను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అమ్మ కష్టాలు పడుతూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. సింగిల్ పేరెంట్‌ను ఒకలా చూస్తారు. ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఆడదాన్ని జీవితాన్ని ఎందుకు పాడుచేస్తారు. దయచేసి ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకోండి. ఇలా ఒక ఆడదాన్ని జీవితాన్ని పాడు చేయకండి’’ అన్నీ చేతులు జోడిస్తూ.. కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆ షాలో పాల్గొన్న మిగతా నటీనటులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. 

Also Read: మాస్టార్ మారలేదు, ‘బిగ్ బాస్’లో చెంపలు వాయించుకుని ఏడ్చేసిన నటరాజ్

తేజస్విని మాట్లాడుతూ.. ‘‘నేను ప్లస్ టూలో ఉన్ననప్పుడు నాన్న చనిపోయారు. ఊరికి వచ్చే వరకు ఏం జరిగిందో తెలీదు. నేను అక్కడికి వెళ్లేసరికి మొత్తం చేసేశారు. నాకు అక్కడ ఏం జరిగిందో తెలీదు. నాన్న ప్రేమ అనేది తెలియలేదు. నా జీవితంలో ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను’’ అంటూ భావోద్వేగానికి గురైంది. మార్చి 27న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ‘C/O అనసూయ’, ‘కస్తూరీ’ టీమ్‌లోని సభ్యుల మధ్య ఈ పరివార్ లీగ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఝాన్సీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది. 

View this post on Instagram
 
A post shared by Aishwarya pisse__Official (@aishwarya_pisse_)

View this post on Instagram
 
A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official)

Published at : 24 Mar 2022 03:51 PM (IST) Tags: Tejaswini Gowda c/o Anasuya aishwarya pissay Serial Actress Aishwarya Pissay Kasturi Serial Actress

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ

Karthika Deepam మే 25(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్‌కు దగ్గరయ్యేందుకు శోభ వేసిన ప్లాన్‌ జ్వాలకు వర్కౌట్‌ అయిందా?

Karthika Deepam మే 25(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్‌కు దగ్గరయ్యేందుకు శోభ వేసిన ప్లాన్‌ జ్వాలకు వర్కౌట్‌ అయిందా?

Guppedantha Manasu మే 25(ఈరోజు) ఎపిసోడ్: వెడ్డింగ్ కార్డు చూసి రిషి రియలైజేషన్- లైఫ్‌ పార్టనర్‌ దొరికేసిందని ఆనందం

Guppedantha Manasu మే 25(ఈరోజు) ఎపిసోడ్: వెడ్డింగ్ కార్డు చూసి రిషి రియలైజేషన్-  లైఫ్‌ పార్టనర్‌ దొరికేసిందని ఆనందం

Guppedantha Manasu మే 24(ఈరోజు) ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్‌ డిజైన్ చేసిన మహేంద్ర

Guppedantha Manasu మే 24(ఈరోజు) ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్‌ డిజైన్ చేసిన మహేంద్ర
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు