Seethe Ramudi Katnam September 7th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తోపుడు బండి మీద చీరలు అమ్మి మహాలక్ష్మి పరువు తీసేసిన సీత.. ఇంట్లో రచ్చ రచ్చ!
Seethe Ramudi Katnam Today Episode సీత తోపుడు బండి మీద చీరలు అమ్మడం చూసిన మహాలక్ష్మి ఇంట్లో సీత మీద కోప్పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవి శివకృష్ణతో ఫోన్‌లో మాట్లాడిందని రాఖీ కడతానని రమ్మని చెప్పిందని మహాలక్ష్మీ అర్చనతో చెప్తుంది. శివకృష్ణ ప్రాణాపాయంలో ఉన్నప్పుడు రాత్రి టీచర్ వెళ్లగానే పొద్దున్నకి తగ్గిపోయిందని, సీత మీద స్పెషల్ కేర్ తీసుకుంటుందని, రామ్, ప్రీతిలను ప్రేమగా చూస్తుందని ఇవన్నీ చూస్తుంటే అనుమానం వస్తుందని మహాలక్ష్మీ చెప్తుంది. రేపు శివకృష్ణ ఇంటికి వస్తే ఏం చేయబోతుందో మహాలక్ష్మీ అర్చనతో చెప్తుంది. శివకృష్ణ రాగానే నిజం బయటకు వస్తుందని అంటుంది.
మహాలక్ష్మీ, అర్చన వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే చీరలను బండిలో పెట్టి అమ్ముతూ సీత ఎదురవుతుంది. తోపుడు బండి మీద సీత చీరలు పెట్టుకొని అమ్మడానికి వీధిలో చీరలు చీరలు అంటూ అరుస్తూ వెళ్లడం చూసిన మహాలక్ష్మీ, అర్చన తమ పరువు తీస్తుందని సీత దగ్గరకు వెళ్తారు. సీత ఇద్దరు అత్తల్ని చూసి ఏ చీరలు కావాలని అడుగుతుంది.
మహాలక్ష్మీ: ఏయ్ నీకు అసలు బుద్ది ఉందా నడిరోడ్డు మీద ఇలా తోపుడు బండి మీద చీరలు అమ్ముతావా. పిచ్చి పిచ్చిగా ఉందా.
అర్చన: మా కోడలివి అయి ఇలా మా పరువు తీస్తావా సీత.
సీత: మరేం చేయమంటారు మీరు నాకు ఈ వీధిలో ఎవరూ పని ఇవ్వకుండా చేశారు. నాకు సంపాదన లేదు అని అవమానించారు. అందుకే ఇలా పక్క వీధిలో అమ్ముతున్నా.
అర్చన: నువ్వు మా కోడలివి అని మర్చిపోతున్నావా. ఇలా నిన్ను ఎవరినా చూస్తే మా పరువు ఏం అవుతుంది.
మహాలక్ష్మీ: సిగ్గు మాలిన పని చేయడమే కాకుండా మాకే ఎదురు చెప్తావా. ఇప్పుడే నీ సంగతి తేల్చుతాను. అని మహాలక్ష్మీ బండి మీద చీరలన్నీ కింద విసిరేస్తుంది. సీతని లాక్కొని ఇంటికి తీసుకెళ్తుంది. లాక్కొని కారు ఎక్కించి ఇంటికి తీసుకెళ్తుంది. సీతని మహాలక్ష్మీ నెట్టేస్తే రామ్ పట్టుకుంటాడు.
రామ్: ఏం జరిగింది పిన్ని సీతని ఎందుకు నెట్టేశారు.
జనార్థన్: సీత ఏదో చేయకూడని పని చేసుంటుంది అందుకే మహాకి అంత కోపం వచ్చింది.
అర్చన: తను మన పరువు తీస్తుంది రామ్ వీధిలో మనం తలెత్తకుండా చేస్తుంది.
మహాలక్ష్మీ: తను బండి మీద చీరలు పెట్టుకొని వీధిలో అమ్ముతుంది. ఎవరైనా చూసి ఉంటే నా ముఖం మీద ఊసుండేవారు. ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన పరువు గౌరవం అన్నీ మంట కలిసిపోయాయి.
రామ్: అవునా సీత ఎందుకు అలా చేశావ్ నువ్వు బండి మీద చీరలు అమ్మడం ఏంటి.
సీత: నా సంపాదన కోసం చేశాను మామ.
మహాలక్ష్మీ: సంపాదన బండి మీద చీరలు అమ్మితే రోజులు రెండు వందలు వస్తాయి పోని 500 వస్తాయా.
అర్చన: 500 కోసం ఇంటి పరువు తీస్తావా.
సీత: అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అంటే ఎలా నా పాటికి నేను తోచిన పని చేసుకుంటే తిడతారేంటి.
మహాలక్ష్మీ: ఏంటి జనా తను అలా మాట్లాడుతుంది. రామ్ నువ్వు అయినా తనకి చెప్పు.
జనార్థన్: ఈ ఇంటి ముందు తోపుడు బండే వెళ్లదు అలాంటిది నువ్వు తోపుడు బండి మీద బట్టలు అమ్మడం నీచం కాక ఇంకేంటి.
రామ్: మనం వేరు మన స్టేటస్ వేరు సీత మనం బట్టలు అమ్మాలి అంటే ఏ షాపింగ్ మాల్ పెట్టాలి వెజిటేబుల్స్ అమ్మాలి అంటే స్టోర్ పెట్టాలి అది మన రేంజ్. నువ్వు ఉన్న స్థాయి వేరు నువ్వు చేస్తాను అన్న స్థాయి వేరు. అయినా నువ్వు చేయాల్సిన అవసరం ఏంటి.
సీత: నేను సంపాదించాలి అంటే మామ.
మహాలక్ష్మీ: నీకు కారణాలు వేరు సీత కానీ ఈ సిటీలో మనకు ఓ రేంజ్ ఉంది అది నువ్వు పాడు చేస్తే నేను ఊరుకోను ఇంకెప్పుడు ఇలాంటి పరువు తక్కువ పనులు చేయకు.
అందరూ సీతని తలో మాట అని జాగ్రత్తలు చెప్తారు. రామ్ సీతని గదికి వెళ్లమంటాడు. సీత గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. పిన్ని అన్ని మాటలు అంటే ఎందుకు నిలదీయలేదని రామ్ అంటాడు. అలా చేయడం తప్పని సీతని అంటాడు రామ్. మీ పిన్ని వల్లే ఇలా చేశానని రామ్తో సీత చెప్తుంది. తనని హేళన చేయడం వల్లే ఇలా చేశానని అంటుంది. మన స్టేటస్‌కి తగ్గట్టు పనులు చేయమని రామ్ అంటాడు. దానికి సీత తనంతట తానే ఎదుగుతాను అని అంటుంది. రామ్ సాయం కూడా తీసుకోనని అంటుంది.
మహాలక్ష్మీ, అర్చనలు శివకృష్ణల రాకకోసం ఎదురు చూస్తారు. అందరికీ ట్విస్ట్ ఇస్తామని అనుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమికి చాలా బాంబ్లు పేలుతాయని అనుకుంటారు. ఇక చలపతికి అర్చన, మహాలక్ష్మీ రాఖీ కట్టలేదా అని సీత అడుగుతుంది. జనార్థన్, గిరిధర్‌లకు రాఖీ కట్టడానికి రేవతి ఎదురు చూస్తుంది. ఇద్దరూ కిందకి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి ఘనస్వాగతం పలికిన అపూర్వ – చంద్రను చూసి ఎమోషన్ అయిన భూమి