అన్వేషించండి

Seethe Ramudi Katnam September 6th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గోడ మీద ఎన్ని క్యాలెండర్లు మారినా నీ తల రాత మారనివ్వను: సీతతో మహాలక్ష్మీ

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ కోడలు అని కుట్టడానికి సీతకి ఎవరూ బట్టలు ఇవ్వడానికి భయపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత ఇంటింటికి వెళ్లి బట్టలు కుడతానని ఇవ్వమని చెప్తుంది. అందరూ కూడా నువ్వు మహాలక్ష్మీ కోడలివని నీతో బట్టలు కుట్టిస్తే మహాలక్ష్మీ మమల్ని చంపేస్తుందని ఇవ్వమని చెప్తారు. మహాలక్ష్మీ కోడలివి అయి కాళ్ల మీద కాళ్లు వేసుకొని తిని కూర్చొవాల్సిన నీకు ఇలాంటి గతి ఏంటని అంటారు.

సీత: ఇదేంటి నేను మహాలక్ష్మీ అత్తయ్య కోడలిని అని నాకు ఎవరూ బట్టలు ఇవ్వమని అంటున్నారు. మహాలక్ష్మీ కోడలిగా నీకు తక్కువ చేయమని అంటున్నారు. ఇన్నాళ్లు నేను ఆమె కోడలిని అని తెలియకపోవడం నా మైనస్ అనుకుంటే ఇప్పుడు ఆవిడ కోడలిని అని తెలియడం ఇంకా పెద్ద మైనస్‌గా మారింది.  ఇప్పుడెలా. అని ఇంటికి వస్తుంది.
మహాలక్ష్మి: చిటికెలు వేసి సీతని పిలుస్తుంది. హలో కోడలు గారు.. ఏంటి అలా డల్‌గా ఉన్నావ్. ఒంట్లో బాలేదా. అవును తమరేదో ఛాలెంజ్ చేశారు. ఆర్డర్స్ మీద ఆర్డర్స్ తీసుకొస్తానని అన్నారు. కళ్లు మూసి తెరిచే లోగా కోటీశ్వరురాల్ని అయిపోతానని తెగ బిల్డప్ ఇచ్చారు. ఖాళీ చేతులతో వచ్చారేంటి కోడలు గారు. నీకు చీరలు ఇవ్వలేము మహాలక్ష్మీ కోడల్ని అవమానించలేం అన్నారు కదూ ఏంటి సీత ఈ విషయం నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా.
సీత: నా ప్రయత్నాలకు మీరు అడ్డుపడుతున్నారని అర్థమైంది.
మహాలక్ష్మీ: నేను మరీ అంత చీప్ కాదు సీత. నేను నీ వెనక నా మనుషుల్ని అని పెట్టలేదు కానీ నీ తల మీద నా కోడలు అనే కిరీటం పెట్టాను. అది నీ అతి తెలివితో నువ్వే పెట్టించుకున్నావ్ అనుకో కానీ అదే ఇప్పుడు నీ పాలిట ముళ్ల కిరీటం అయింది. నువ్వు నా కోడలివని వీధిలో అందరి ముందు చెప్పి పొంగిపోయావ్. ఇప్పుడు అదే జనం నువ్వు నా కోడలివి అని నీకు పని ఇవ్వలేమని చెప్పి మర్యాదగా ముఖం మీద తలుపు వేశారు. నీ ఆశల ద్వారాలు మూసేశారు. ఒక రకంగా నీకు ఈ వీధిలో సెలబ్రిటీ హోదా వచ్చేసింది. ఇక నువ్వు నా కోడలు అనే బ్రాండ్ పడిపోయింది. ఇక నువ్వు ఏం చేయలేం. ఎక్కడా పని చేయవు. ఆఖరికి నువ్వు ఈ వీధిలో చేయి చాచి అడిగినా బిక్ష కూడా పెట్టరు. మహాలక్ష్మీ కోడలు అంటే పులి మీద స్వారీ అని ఇప్పుడు అర్థమైందా. ఇప్పుడేం చేస్తావ్. నువ్వు ఈ సిటీలో ఏ వీధికి వెళ్లిన అక్కడ నీకు నా పేరు వినిపిస్తూనే ఉంటుంది. నువ్వు గెలవాలి అంటే ఈ బట్టలు కుట్టడం ఆపేసి బిజినెస్ చేయాలి. కానీ నీ దగ్గర డబ్బు లేదు నిన్ను నమ్మి ఎవరూ అంత డబ్బు ఇవ్వలేరు. నిన్ను గెలవనివ్వను. గోడ మీద ఎన్ని క్యాలెండర్లు మారినా నీ తల రాత మారనివ్వను.  

మరోవైపు శివకృష్ణ క్యాలెండర్ చూసి రాఖీ పౌర్ణమి అని సుమతితో ఎలా అయినా రాఖీ కట్టించుకోవాలని అనుకుంటాడు. సుమతికి ఇబ్బంది లేకుండా ఏదో ఒకటి చేస్తానని అంటాడు. ఇక విద్యాదేవి అలియాస్ సుమతితో మాట్లాడాలని డైరెక్టగా ఆమెకు చేయకుండా సాంబకి ఫోన్ చేసి విద్యాదేవికి ఫోన్ ఇవ్వమని అంటాడు. ఇక మహాలక్ష్మీ అది చూసి కిందకి వస్తుంది. సాంబని పిలిచి అడుగుతుంది. దాంతో సాంబ సీత తండ్రి ఫోన్ చేశాడని చెప్తాడు. దాంతో మహాలక్ష్మి అక్కడికి వచ్చి మాటలు వింటుంది.

రేపు ఇంట్లోనే రాఖీ పండగ చేసుకుందామని విద్యాదేవి అనడం మహాలక్ష్మి వింటుంది. విద్యాదేవి సీత తల్లిదండ్రులను ఎందుకు అన్నావదినా అంటుందని ఆలోచిస్తుంది.. విద్యాదేవి ఏదో దాస్తుందని అనుకుంటుంది. మరోవైపు సీత బట్టలు ఫైల్‌లు కట్ చేస్తూ మహా, వీధిలో మాటలు తలచుకొని కోపంతో కట్ చేస్తుంది. రామ్ చూసి తన ఆఫీస్ ఫైల్ కట్ చేశావని సీత మీద  అరుస్తాడు. సీత సారీ చెప్తుంది. చివరకు రామ్ సీతతో ముద్దు పెట్టించుకుంటాడు. ఏంటని సీత అడిగితే అవన్నీ చిత్తు కాగితాలు అని అంటాడు. సీత కోపంతో కత్తెర తీయడంతో రామ్ సీతని హగ్ చేసుకుంటాడు. సీత బుంగమూతి పెట్టుకుంటుంది. 

ఇక మహాలక్ష్మీ విద్యాదేవి మాటలు తలచుకొని ఆలోచిస్తుంది. అర్చన వచ్చి ఏమైందని అడిగితే విద్యాదేవి శివకృష్ణకు రమ్మని రాఖీ కడతానని చెప్పిందని అంటాడు. వాళ్లు నిజంగానే అన్నా చెల్లెళ్లేమో అని అనుమానంగా ఉందని చెప్తుంది మహాలక్ష్మీ. శివకృష్ణ హాస్పిటల్లో సీరియస్ కండీషన్లో ఉంటే రాత్రి వెళ్లి విద్యాదేవి కలవడంతో కోలుకున్నాడని చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్య కిడ్నాప్.. అందరి ముందు విడాకుల గురించి చెప్పేసిన భైరవి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget