అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today September 19th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సూర్య కోసం మహాలక్ష్మీకి డబ్బు అడిగిన రామ్.. మహా  మాటలకు చాలా హర్ట్ అయ్యాడుగా! 

Seethe Ramudi Katnam Today Episode సూర్య ఆపరేషన్ కోసం రామ్ మహాలక్ష్మికి డబ్బు అడగటం మహా ఇవ్వను అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సూర్యని యాక్సిడెంట్ చేయించింది మహాలక్ష్మీనే అని శివకృష్ణ అరెస్ట్ చేయడానికి వస్తాడు. సీత అత్త కోసం తండ్రికి ఎదురు తిరుగుతుంది. నీ పెద్ద అల్లుడికి అన్యాయం జరిగిందని మా అత్తయ్యని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం అన్యాయం అని తండ్రితో అంటుంది. సరైన సాక్ష్యాలు, ఆధారాలు తీసుకొని వారెంటీతో వస్తే అప్పుడు అరెస్ట్ చేయొచ్చని అంటుంది.

సీత: చూడండి ఎస్‌ఐ గారు మా అత్తయ్య అలాంటి వారు కాదు. మీరు ఆమెను విచారణ పేరుతో స్టేషన్‌కి తీసుకెళ్తా అంటే నేను ఒప్పుకోను. 
శివకృష్ణ: అనవసరంగా నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు సీత. మా డ్యూటీకి అడ్డం పడొద్దు.
సీత: మీరే  మా పరువు తీస్తున్నారు. కావాలి అంటే ఆ రౌడీలను మరోసారి విచారించండి. వాళ్లు మళ్లీ మా అత్తయ్య పేరు చెప్తే సరైన సాక్ష్యాలతో వారెంట్‌తో రండి. ఇప్పుడు మా అత్తయ్యని అరెస్ట్ చేయడం కాదు విచారణ చేస్తా అన్నా మేం ఒప్పుకోం. ఇంక మీరు బయల్దేరండి.
శివకృష్ణ: నువ్వు తప్పు చేస్తున్నావ్ సీత ఎప్పటికైనా తెలుసుకుంటావ్.
రామ్: చాలా థ్యాంక్స్ సీత మా పిన్నిని కాపాడావ్.
జనార్థన్: మహాని ఇంటి పరువుని కాపాడావు సీత. నువ్వు లేకపోయి ఉంటే మీ నాన్న మహాని అరెస్ట్ చేసే వాళ్లు.
అర్చన: అవును సీత కంగారులో మేం ఏం అడగలేకపోయాం.
గిరధర్: నువ్వు మాటకు మాట సమాధానం చెప్పడం బట్టి మీ నాన్న వెళ్లిపోయారు లేదంటే మీ నాన్న అరెస్ట్ చేసేవాళ్లు. నువ్వు చేసిన సాయం మహా ఎప్పటికీ మర్చిపోదు సీత..
అర్చన: మహా నీకు మనసులో థ్యాంక్స్ చెప్తుకొని ఉంటుంది.

సీత తన తండ్రి దగ్గరకు వెళ్లి మహాలక్ష్మీ అత్తయ్యే అంతా చేసిందని తనకు నిన్నే తెలిసిందని అంటుంది. అక్క, బావల విషయంలో తాను తప్పు చేసినా దుర్మార్గురాలు అయినా నేరాలు చేసినా తనని శిక్షించకూడదని అలా చేస్తే ఇంటిళ్లపాది శిక్ష అనుభవిస్తారని అంటుంది. మహాలక్ష్మీని మార్చాలని కోడలిగా అది నా బాధ్యత అని అంటుంది. ఆమెను తాను కంట్రోల్‌ చేస్తానని అంటుంది. తన అత్తయ్య చేసిన తప్పుని తాను సరిదిద్దుతాను అని అంటుంది. ఇక సూర్య ఆపరేషన్ గురించి తాను చూసుకుంటానని సీత చెప్తుంది. 

సీత గదిలోకి రాగానే రామ్ ఎత్తుకొని గిరగిరా తిప్పి తండ్రిని ఎదురించి తన పిన్నిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. నేను హ్యాపీగా ఉన్నానని ఏమైనా అడగమని అంటాడు. దానికి సీత మీ పిన్ని నుంచి నాకు సాయం కావాలని మీ పిన్ని మా సూర్య బావని కాపాడాలని ఆపరేషన్‌కి కావాల్సిన డబ్బు నువ్వు మీ పిన్నిని అడిగి ఇప్పించమని అంటాడు. రామ్ ఇది చాలా చిన్న విషయం కాబట్టి చేస్తుందని అంటుంది. రామ్ అడగటానికి వెళ్తాడు. రామ్ మహాలక్ష్మీ దగ్గరకు వెళ్లి సూర్య ఆపరేషన్ కోసం డబ్బు అడుగుతాడు. మహాలక్ష్మీ ఇవ్వనని చెప్తుంది. సీత అంత సాయం చేస్తే ఇవ్వను అని అంటే ఎలా అని అడుగుతాడు. దానికి మహాలక్ష్మీ నేను ఏం తప్పు చేయలేదని ఆ తండ్రీకూతుళ్లు నాటకం ఆడారని మహాలక్ష్మీ చెప్తుంది. తప్పుగా ఆలోచిస్తున్నారు అని రామ్ అంటాడు. సూర్య కండీషన్ తెలిసి కూడా డబ్బు ఇవ్వను అనడం తప్పు అని రామ్ అంటాడు. ఇప్పుడు డబ్బు ఇస్తే తానే తప్పు చేసినట్లు అందరూ అనుకుంటారని మహాలక్ష్మీ అంటుంది. తాను ఇవ్వను అని ససేమిరా అనేస్తుంది. తనకు తెలపకుండా ఇస్తే నా మీద ఒట్టు అని రామ్‌తో చెప్తుంది. 

రామ్‌ డల్‌గా గదిలోకి వెళ్లి డబ్బు ఇవ్వను అనేసిందని చెప్తాడు. సీతకు క్షమాపణ చెప్తాడు. ఎంతో చెప్పి చూసిన పిన్ని చెప్పింది వినలేదని బాధ పడతాడు. ఇదంతా నా దురదృష్టమని సీత అంటుంది. ఇక ఆ విషయం వదిలేయమని అంటుంది. నీ కోసం ఏం చేయలేకపోతున్నా అని రామ్ ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: గాజులతో మాయం అయిపోతాననుకొని అందరి ముందు పరువు పోగొట్టుకున్న తిలోత్తమ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget