అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today September 12th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి విషయంలో మహాని ప్రశ్నించిన జనార్థన్.. టీచర్ బ్యాగ్‌లో ఫొటో అర్చన చూసేస్తుందా!

Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవి ఎవరో తెలుసుకోవడానికి ఆమె గదిలో ఆధారం కోసం మహా అర్చనకు పంపించడం సీత అది చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత విద్యాదేవి ఫోన్‌లో మాట్లాడటం విని పక్కకి రమ్మని మీతో మాట్లాడాలి అని చెప్తుంది. ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నారని అడుగుతుంది. మీ నాన్నతో మాట్లాడాను అని టీచర్ చెప్తారు. తనతో రాఖీ కట్టించుకున్నందుకు కృతజ్ఞత చెప్పానని అంటుంది. ఇక విద్యాదేవి నా మీద నీకు కూడా అనుమానం ఉందా అని సీతని అడుగుతుంది.

సీత: అనుమానం కాదు నా దగ్గర మీరు ఏదో దాస్తున్నారు. జనార్థన్ మామయ్యకు మిమల్ని రాఖీ కట్టమని మీకు మహాలక్ష్మీ అత్తయ్య అడిగినప్పుడు మీరు తడబడ్డారు.
విద్యాదేవి: అవును తడబడ్డాను ఎందుకు అంటే అది నాకు ఊహించని సందర్భం. మహాలక్ష్మి సడెన్‌గా అలా చెప్పడంతో షాక్ అయ్యాను. పరిచయం లేని ఆడమగ మధ్య అన్న చెల్లెల సంబంధం ఉంటే తప్ప వాళ్లు పవిత్రులు కారా అని బాధ పడ్డాను. నువ్వు మీ అత్తయ్యలా ఎక్కువ ఆలోచిస్తున్నావ్ మీ సుమతి అత్తయ్య లెటర్ రాసిందిగా ఏదో ఒక రోజు ఇంటికి వస్తుంది ఆ రోజు నీకు సమాధానం దొరుకుతుంది. ఒకవేళ నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే చెప్పు వెళ్లిపోతా.
సీత: టీచర్ అలా అనొద్దు 

టీచర్ దగ్గర ఏదో పెద్ద రహస్యం ఉందని సీత అనుకుంటుంది. ఏదో ఒక రోజు తప్పకుండా తెలుసుకుంటానని అనుకుంటుంది. మరోవైపు జనార్థన్ సుమతి రాసిన లెటర్ చూస్తూ ఫీలవుతుంటే మహాలక్ష్మి వస్తుంది. సుమతి ఎందుకు రావడం లేదు తనని ఎవరు ఆపుతారు అని అంటుంది. జనార్థన్ కూడా తమని ఎంతో ఇష్టపడిన సుమతి వదిలేసి ఎలా ఉంటుందో అని అంటాడు. సుమతి ఇంటి నుంచి వెళ్లినప్పుడు తనతో నీకు ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు. మీ మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. 

మహాలక్ష్మీ ఏడుస్తూ తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అని సుమతి వెళ్లాక నేను నీ కోసం పిల్లల కోసం ఎంత కష్టపడ్డానో నీకు తెలీదా అని అంటుంది. సుమతి వెళ్లినప్పుడు మిమల్ని తనకు అప్పగించి వెళ్లిందని నీ మీద నాకు ఇంకా అనుమానమా అని అడుగుతాడు. దానికి జనార్థన్ సుమతి నిన్ను అపార్థం చేసుకుందేమో  అని అంటాడు. ఇక మహాలక్ష్మీ తనని జనార్థన్ ఇలా అడగటం బాధగా ఉందని అంటుంది. సుమతి వస్తే తన బాధ్యతలు తనకి ఇచ్చేస్తాను అని అంటుంది. మహా మాటలకు జనార్థన్ ఫీలవుతాడు. విద్యాదేవి తన ఫ్యామిలీ స్కెచ్ తీసి ఎవరికీ నిజం చెప్పలేకపోతున్నా అని ఫీలవుతుంది. మహాలక్ష్మీ నిజస్వరూపం తెలిసే వరకు తనకు అజ్ఞాతం తప్పదని అనుకుంటుంది. 

సుమతి వస్తే తనకు ఇంట్లో స్థానం ఉండదని ఆలోపే ఏదో చేయాలని మహాలక్ష్మీ అనుకుంటుంది. అర్చన అక్కడికి వస్తుంది. విద్యాదేవి ఇంట్లో జరిగేవి అన్నీ సుమతికి చెప్తుందని అంటుంది. విద్యాదేవి గదిలోకి వెళ్లి మొత్తం వెతకమని ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూడమని అంటుంది మహాలక్ష్మీ. అర్చన విద్యాదేవి గదిలోకి వెళ్లి మొత్తం వెతుకుతుంది. విద్యాదేవి బ్యాగ్‌లో ఫ్యామిలీ స్కెచ్ చూసే టైంకి సీత వస్తుంది. ఈ గదిలో నీకేం పని అని అడుగుతుంది. సీత బ్యాగ్‌ని అర్చనను తీసుకొని కిందకి వచ్చి అందర్ని పిలుస్తుంది. అర్చన మళ్లీ దొరికిపోయిందని మహాలక్ష్మి తిట్టుకుంటుంది. ఇంటి దొంగ అని అర్చనను చెప్తుంది. ఇక విద్యాదేవి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని ఫొటో చూసేసిందా అని టెన్షన్ పడుతుంది. ఇక బ్యాగ్ తీసుకొని చూసి ఫొటో ఉండటంతో ఊపిరి పీల్చుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీని చంపడానికి పాయసంలో విషం కలిపిన తిలోత్తమ.. ఎలుక ఏం చేసిందంటే!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Godavari Serial Today July 30th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
Karthika Deepam 2 Serial Today July 30th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
Nindu Manasulu Serial Today July 30th: నిండు మనసులు: నీ కొడుకు ఫొటోకి దండ వేసేస్తావ్.. సారీ చెప్పిన ఎమ్మెల్యేకే సిద్ధూ సెన్సేషనల్ వార్నింగ్! గణ ఫైర్!
నిండు మనసులు: నీ కొడుకు ఫొటోకి దండ వేసేస్తావ్.. సారీ చెప్పిన ఎమ్మెల్యేకే సిద్ధూ సెన్సేషనల్ వార్నింగ్! గణ ఫైర్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Embed widget