Seethe Ramudi Katnam Serial Today October 9th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్తామామల్ని పరుగులు పెట్టించిన సీత.. రిజిస్టర్ ఆఫీస్‌కి చేరిన రేవతి, కిరణ్!
Seethe Ramudi Katnam Today Episode రేవతి, కిరణ్‌లను సీత మహాలక్ష్మీ అండ్ బ్యాచ్‌తో రిజిస్టర్ ఆఫీస్‌కు తీసుకొచ్చేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ వాళ్లే రేవతిని కిడ్నాప్ చేశారని సీత రామ్‌తో చెప్తుంది. గంట ఆగితే నిజం తెలుస్తుందని సీత అంటుంది. అందుకే వాళ్లకు బుద్ధి రావాలని ఇలా చేశానని సీత అంటుంది. ప్రీతి, ఉషలు నా మరదళ్లు అని వాళ్లని తన ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశారని వాళ్ల మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటారని అంటుంది. నాకు కూడా తెలియకుండా ఇంత చేస్తావా అని అంటాడు.
సీత: ఈ పాటికి మీ పిన్ని వాళ్లు రేవతి పిన్ని దగ్గరకు వెళ్లుంటారు.
అర్చన: అయ్యో రేవతి ఏంటమ్మా అంత నీరసంగా ఉన్నావ్ ముఖం చూడండి ఎలా వాడిపోయిందో ఏవండీ కట్లు విప్పండి.
గారిధర్: కిరణ్‌తో నీ పెళ్లికి ఒప్పుకుంటున్నాం రేవతి ఇప్పుడే నిన్ను రిజిస్టర్ ఆఫీస్‌కు తీసుకెళ్తాం.
రేవతి: కాళ్ల మీద కాళ్లు వేసుకొని మీరు కాళ్ల బేరానికి వస్తారని నాకు ముందే తెలుసు అన్నయ్య. సీత మీ మెడలు వంచుతుందని నాకు తెలుసు. అందుకే ధైర్యంగా ఉన్నాను. సీత మాటిస్తే ఏమైనా చేస్తుందని నాకు తెలుసు.
అర్చన: నీకు అన్నీ తెలుసు తల్లీ మేమే ఎర్రివాళ్లలా ఇలా ఏదో చేసేస్తాం అని ఇంకేదో చేశాం.
రేవతి: ఏంటి వదిన నా పెళ్లి ఆపుతా అన్నావ్.
మహాలక్ష్మీ: ఆ సీతని చూసుకొని నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ రేవతి.
జనార్థన్, గిరిధర్‌లు కిరణ్‌ని విడిపించి రిజిస్టర్ ఆఫీస్‌కు వస్తామని రేవతిని రెడీ చేసి తీసుకురమ్మని అర్చన, మహాలక్ష్మీలకు చెప్తారు. ఇంక రిజిస్టర్ ఆఫీసర్ సీత వాళ్ల దగ్గరకు వచ్చి తొందరగా పెళ్లి చేయాలని టైం అయిపోతుందని అంటాడు. ఇక సీత టైంకి వచ్చేస్తారని చెప్తుంది. ఇక జనార్థన్, గిరిధర్‌లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కిరణ్‌ని విడిపించమని అంటారు. కేసు వాపస్ తీసుకొని కిరణ్ని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్తారు. జనార్థన్, గిరిధర్‌లు పెళ్లి అని చెప్తే కిరణ్ షాక్ అయిపోతాడు. సీత ఏదో ట్విస్ట్ ఇస్తారు అనుకుంటే ఇలా చేస్తుందని అనుకోలేదని అనుకుంటాడు. ఇక సీత తల్లిదండ్రులు రిజిస్టర్ ఆఫీస్‌కు వస్తారు. విద్యాదేవి టీచర్ చెప్పడంతో ఇక్కడికి వచ్చాం అని శివకృష్ణ వాళ్లు చెప్తారు. ఇక కాసేపట్లో అందరూ వస్తారని సీత అంటుంది. ఇక మహాలక్ష్మీ, అర్చనలు రేవతిని పెళ్లి కూతురిలా రెడీ చేసి తీసుకొని వస్తారు.
రేవతి అత్తయ్యని కిడ్నాప్ చేసింది వీళ్లే అని పెళ్లి ఆపడానికి ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అని రామ్ సీరియస్ అవుతాడు. ఇక జనార్థన్, గిరిలు కూడా కిరణ్‌ని తీసుకొని వస్తారు. ఇక రామ్ తండ్రి, పిన్నిల సంగతి తేల్చుతా అంటే సీత రామ్‌ని ఆపుతుంది. అందరూ లోపలికి వెళ్తారు. మహాలక్ష్మీ పిల్లల్ని పిలిపించమని అంటే సీత ముందు మీరు సాక్షి సంతకాలు పెట్టిన తర్వాత పిల్లలు వస్తారని అంటుంది. ఇక రామ్ విజిల్ వేయడంతో గంగాధర్, శివలు ప్రీతి, ఉషల్ని తీసుకొని వస్తారు. ప్రీతి, ఉషల్ని చూసి మహాలక్ష్మీ, అర్చనలు హ్యాపీగా ఫీలవుతారు. సీత శివ, గంగాధర్లకు అందర్ని పరిచయం చేస్తుంది. ఇక కిరణ్, రేవతిలు సంతకాలు చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.