Seethe Ramudi Katnam Serial Today October 24th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కసాయితల్లి అనిపించుకున్న మహాలక్ష్మీ.. చితక్కొట్టేసిన అర్చన.. ప్రీతి జీవితం నాశనమే!
Seethe Ramudi Katnam Today Episode కేవలం సీత దగ్గర పరువు పోతుందని మహాలక్ష్మీ రాకేశ్ నిజస్వరూపం ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ప్రీతికి పెళ్లి చేసేయాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Seethe Ramudi Katnam Serial Today October 24th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కసాయితల్లి అనిపించుకున్న మహాలక్ష్మీ.. చితక్కొట్టేసిన అర్చన.. ప్రీతి జీవితం నాశనమే! seethe ramudi katnam serial today october 24th episode written update in telugu Seethe Ramudi Katnam Serial Today October 24th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కసాయితల్లి అనిపించుకున్న మహాలక్ష్మీ.. చితక్కొట్టేసిన అర్చన.. ప్రీతి జీవితం నాశనమే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/24/664b7bc3394fdf0c95156e3a271d24111729732248167882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Seethe Ramudi Katnam Serial Today Episode రాకేశ్ నిజస్వరూపం తెలుసుకున్న మహాలక్ష్మీని రౌడీలు తరమడంతో సీత వ్యాన్‌లో వచ్చి దాక్కుంటుంది. సీత మహాలక్ష్మీని చూసి దొరికావు అత్త అని డోర్ వ్యాన్ బ్యాక్ డోర్ వేసేసి వ్యాన్ అటూ ఇటూ తిప్పి మహాలక్ష్మీకి అల్లకల్లోలం చేసేస్తుంది. మరోవైపు అర్చన వాళ్లు మహాలక్ష్మీ కోసం ఎదురు చూస్తు ఉంటారు. సీత వ్యాన్ తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో అందరిని సీత బయటకు పిలుస్తుంది. సిటీలో దొంగలు ఎక్కువ అయ్యారని ఎక్కడ పడితే అక్కడ దొంగతనం చేస్తున్నారని ఈ సారి మన ఇంట్లో దొంగలు పడ్డారని చెప్తుంది.
అందరూ ఏం అర్థం కాలేదు అని అంటే నా వ్యాన్‌లో దొంగలు పడ్డారని చూపించడానికి అందరినీ వ్యాన్ దగ్గరకు తీసుకెళ్తుంది. దొంగని చితక్కొడతాం మీ సపోర్ట్ కావాలి చిన్నత్తయ్య అంటే అర్చన పద దొంగ సంగతి తేల్చేద్దాం అంటుంది. ఇక మహాలక్ష్మీ ముఖం కనిపించకుండా చీరలు చుట్టుకుంటుంది. అందరూ అర్చనతో దొంగని చితక్కొట్టేయమని అంటే అర్చన నా కోడలి చీరలే దొంగలిస్తావా అని చితక్కొడుతుంది. మహాలక్ష్మీని అర్చన చితక్కొట్టేస్తుంది. తట్టుకోలేక మహాలక్ష్మీ బయటకు వస్తుంది. అందరూ మహాలక్ష్మీని చూసి షాక్ అయిపోతారు. నువ్వేంటి మహా అని అంటారు. అర్చన బిత్తర పోతుంది. మహాకి సారీ చెప్పి లేపడానికి ప్రయత్నిస్తే మహాలక్ష్మీ కోపంగా చూస్తుంది. వ్యాన్‌లో ఉన్నది నువ్వు అని తెలీదని సారీ అత్తయ్య అని సీత నటిస్తుంది. ఇక మహాలక్ష్మీ వీధి కుక్కలు వెంటపడితే ఈ వ్యాన్ ఎక్కానని చెప్తుంది.
మహాలక్ష్మీ దగ్గరకు సీత వెళ్లి వ్యాన్ కుదుపులకు షేక్ అయ్యారా అని అడుగుతుంది. దానికి మహాలక్ష్మీ కావాలనే నన్ను అర్చనతో కొట్టించావు కదా అంటే మీరు నా వ్యాన్‌లో ఎక్కడం ముందే చూశానని చెప్తుంది. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. వీధి కుక్కలకు భయపడి వ్యాన్ ఎక్కానని చెప్పారు కానీ నాకు నమ్ముబుద్ధి కావడం లేదు వేరే కారణం ఉందని అంటుంది. అలాంటిదేమీ లేదని మహాలక్ష్మీ అంటుంది. మీరు చెప్పింది నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు అని సీత అంటుంది. ఇక సీత తనలో తాను మ్యాటర్ ఇంకేదో ఉందని అది కనిపెట్టాలని అనుకుంటుంది.
మహాలక్ష్మీ దెబ్బలకు విలవిల్లాడిపోతూ ఉంటే అర్చన వచ్చి సారీ చెప్తుంది. కుక్కల వల్లే ఇదంతా వచ్చిందని అంటే మహాలక్ష్మీ కుక్కల వల్ల కాదు రాకేశ్ మనుషుల వల్ల వచ్చిందని రాకేశ్ విశ్వరూపం ఓ వ్యక్తిని చంపడం మొత్తం అర్చనకు చెప్తుంది. రాకేశ్ ఓ పెద్ద రాక్షసుడని అంటుంది.
అర్చన: వాడి గురించి నీకు ముందే తెలీదా మహా. మహాలక్ష్మీ: తెలిస్తే ఎందుకు ఊరుకుంటాను. సీత ఎంత చెప్పినా వినకుండా నిశ్చితార్థం చేశాను. ఇప్పుడేం అవుతుందో అని భయంగా ఉంది. నిజం చెప్తే సీతకి అలుసు అయిపోతాను. అలా అని ఈ పెళ్లి చేస్తే ప్రీతికి అన్యాయం చేసిన దాన్ని అయిపోతాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలి అర్చన.
అర్చన: ఈ పెళ్లి జరిపించేద్దాం మహా.
మహాలక్ష్మీ: ఏం అంటున్నావ్ అర్చన ప్రీతి అన్యాయం అయిపోతుంది కదా
అర్చన: ప్రీతి ఏం నీ కన్న కూతురు కాదు కదా మహా తనేమైపోతే నీకేంటి. వాడు దుర్మార్గడే అయినా పెళ్లాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు కదా. అలాంటి వాడు మన చెప్పు చేతల్లో ఉంటే మనకే లాభం కదా. పైగా ఇప్పుడు నువ్వు సీత ముందు తక్కువ అవ్వకూడదు. ఇప్పుడు అందరూ ప్రీతికి మంచి సంబంధం తెచ్చావంటున్నారు ఇప్పుడు నిజం చెప్తే అందరూ నిన్ను అవమానిస్తారు. వాడి గురించి చెప్తే నిజం చెప్పిన నీ ప్రాణం తీసేస్తాడు.
మహాలక్ష్మీ: నిజాన్ని దాచేసి ఈ పెళ్లి చేసేద్దాం
మరోవైపు కిరణ్‌కి కంపెనీ వాళ్లు డబ్బులు ఇవ్వమని బెదిరిస్తారు. వారంలో డబ్బు ఇవ్వకపోతే చీటింగ్ కేసు పెడతామని అంటారు. ఇంతలో సీత అక్కడికి వస్తుంది. ఇదంతా మహాలక్ష్మీ అత్తయ్యే చేసిందని చెప్తుంది. ఆవిడ ప్లాన్స్ ఆవిడకు ఉంటే మన దారులు మనకు ఉంటాయని అంటుంది. మీ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉందని సీత ఇద్దరూ ఏదో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)