అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today October 17th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీ సూసైడ్.. పెళ్లికి ఓకే చెప్పిన ప్రీతి.. సీతకు మొదలైన అనుమానం!

Seethe Ramudi Katnam Today Episode ప్రీతికి మహా రాకేశ్ సంబంధం తీసుకురావడం ప్రీతి ఒప్పుకోకపోవడంతో మహాలక్ష్మీ సూసైడ్ అట్మెంట్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మి, జనార్థన్ సంతోషంగా ఇంటికి  వస్తారు. అందరినీ పిలిచి ప్రీతికి పెళ్లి సంబంధం కుదిరిందని చెప్తారు. సంతోషించాల్సిన విషయానికి అందరూ సంతోషించకుండా షాక్ అవుతారని జనార్థన్ అడుగుతాడు. దాంతో సీత సంబంధం చూశాం అని చెప్పకుండా ఏకంగా కుదిరింది అని చెప్పడం ఏంటి? అంటుంది. దానికి మహాలక్ష్మి మాకు తెలిసిన సంబంధమే అని అంటుంది. 

విద్యాదేవి: అబ్బాయి ఏం చేస్తుంటాడు. వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటి. తల్లిదండ్రలు ఎవరు. 
మహాలక్ష్మి: అవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారు. ప్రీతి పెళ్లి విషయంలో మీకు ఇంత ఇంట్రస్ట్ ఎందుకు. 
విద్యాదేవి: ఏం లేదు ఊరికే తెలుసుకుందామని.
సీత: మా టీచర్ రామ్‌ని కొడుకులా ప్రీతిని కూతిరిలా చూస్తుంది.
అర్చన: నిన్ను కోడలిగా చూడటం లేదా.
జనార్థన్: సంబంధం గురించి చెప్పు మహా ఈ మాటలెందుకు.
మహాలక్ష్మి: అబ్బాయి పేరు రాకేశ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. మనలాగే బిజినెస్ ఫ్యామిలీ కోట్ల ఆస్తి ఉంది. రేపు పెళ్లి చూపులకు రమ్మని చెప్పా.
జనార్థన్: మాకు వాళ్లు ఎప్పటి నుంచో తెలుసు అబ్బాయి రేపు అమెరికా నుంచి వస్తున్నాడు. ఇదే ఫొటో చూడండి. అందరూ అబ్బాయిని చూసి బాగున్నాడు అనుకుంటారు. 
విద్యాదేవి: నీ అభిప్రాయం చెప్పు ప్రీతి అది ముఖ్యం.
మహాలక్ష్మి: పెళ్లి కొడుకుపై నీ ఒపీనియన్ ఏంటి ప్రీతి.
సీత: అలా డైరెక్ట్‌గా అడిగితే ఎలా చెప్తుంది అత్యయ్యా. 
విద్యాదేవి: అబ్బాయి క్యారెక్టర్ కూడా తెలియాలి కదా.
మహాలక్ష్మి: అవన్నీ తెలీకుండా మేం ఈ సంబంధం కుదిర్చాం అనుకుంటున్నారా. 
సీత: అబ్బాయి గురించి పూర్తి తెలుసుకున్న తర్వాతే పెళ్లి చూపులు పెట్టుకుందాం. అబ్బాయి గురించి మీకేం తెలుసు.
ప్రీతి: అతని గురించి ఏం తెలీకుండా ఇంత అర్జెంట్‌గా పెళ్లి అంటే నాకు ఏదోలా ఉంది పిన్ని.
మహాలక్ష్మి: అంటే నువ్వు నేను చెప్పిన సంబంధమే కాదు అంటున్నావా.
రామ్: ఆ సంబంధం మంచిదో కాదో తెలుసుకుందా పిన్ని.
మహాలక్ష్మి: విన్నావా జనా ఇన్నాళ్లు వీళ్లు మనం ఏం చెప్పినా విన్నారు ఇప్పుడు మాత్రం సీత మాటలు విని మనల్నే ఎదురు తిరుగుతున్నారు. మన పిల్లలు మన మాట వింటారు అని వాళ్లకి మాట ఇచ్చేసి వచ్చాం. ఇప్పుడు పెళ్లి చూపులు లేవు అంటే మాట తప్పినట్లే. మాట తప్పినట్లు నా పరువు పోవడం నాకు ఇష్టం లేదు. దాని కంటే నా ప్రాణం పోవడమే బెటర్. 

మహాలక్ష్మి గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంటుంది. రామ్‌తో పాటు అందరూ చూసి షాక్ అవుతారు. అందరూ మహాలక్ష్మికి కిందకి దింపుతారు. మీ కోసం నేను పిల్లల్ని కూడా కనలేదు. రామ్ పెళ్లి కూడా నాకు నచ్చినట్లు జరగలేదు ఇప్పుడు ప్రీతి పెళ్లి కూడా నాకు నచ్చినట్లు జరగకూడదా అని ఎమోషనల్ అవుతుంది మహాలక్ష్మీ. ప్రీతిని బలవంతం చేయొద్దని తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సీత అంటుంది. దాంతో మహాలక్ష్మి సరే ప్రీతి నీకు నచ్చిన సంబంధమే చేసుకో నేను చనిపోతా అంటుంది. దాంతో ప్రీతి పిన్ని మీ ఇష్టమే నా ఇష్టమని మీరు చూపించిన సంబంధం చేసుకుంటానని అంటుంది. 

మహాలక్ష్మి: ఈ పెళ్లి జరిగితే కోట్ల టర్నోవర్ ఉన్న మోహన్ రావు కంపెనీ ఈ మహాలక్ష్మి కంపెనీలో కలిసిపోతుంది. నేను మరింత కోటీశ్వరురాలిని అవుతాను.
రామ్: ప్రీతి పెళ్లి సంబంధం గురించి ఆలోచిస్తున్నావా సీత.
సీత: అవును మామ మీ పిన్ని ఇంత పంతంతో ఈ పెళ్లి ఎందుకు చేయాలి అనుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఏదో స్వార్థం  తోనే చేస్తున్నట్లుంది. 
రామ్: ఇందులో పంతం స్వార్థం ఏం లేవు సీత. ప్రీతి పెళ్లి చేయడం పిన్ని బాధ్యత. ప్రీతికి ముందు ముందు విక్కీ నుంచి ఏ సమస్య లేకుండా ఉండాలి అంటే ఈ పెళ్లి చేయాలి.
సీత: మీ పిన్ని పంతం వెనక ఏదో ఉందని నా అనుమానం. 
రామ్: అబ్బాయి మంచి వాడు కాకపోతే నిశ్చితార్థం వరకు రానివ్వొద్దు.
సీత: నాకు ఎందుకో ఈ సంబంధం విషయంలో ఏదో తేడా కొడుతుంది మామ. ఏదైనా జరిగితే ప్రీతి జీవితం నాశనం అయిపోతుంది మామ.

మరోవైపు రాకేశ్ బెయిల్ మీద విడుదల అవుతాడు. తల్లిదండ్రులు రాకేశ్‌ని కలుస్తారు. ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది ఈ సారి అయినా జాగ్రత్తగా ఉండమని చెప్పమని లాయర్ అంటాడు. ఇక నీకు సంబంధం చూశామని రాకేశ్‌తో చెప్తారు. ప్రీతి ఫొటో చూపిస్తారు. ఫిగర్ బాగుందని రాకేశ్ అంటే పెళ్లి జరిగే వరకు జాగ్రత్తగా ఉండమని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: మీడియా ముందు మామని ఇరికించేసిన సత్య.. ఇక నో వెపన్స్.. మైత్రి, హర్షల సరసాలు చూసేసిన నందిని!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget