అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today November 22nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి, సీతలతో ఢీల్ మాట్లాడిన మహాలక్ష్మీ.. అనూహ్యరీతిలో కోడలిని ఇంటికి తీసుకొచ్చిన మహా!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ జైలుకి వెళ్లి సీత, విద్యాదేవిలతో ఢీల్ చేసుకొని సీతని ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీఐ త్రిలోక్ విద్యాదేవి, సీతలను పోలీస్ స్టేషన్‌కి తీసుకొస్తారు.  లేడీ కానిస్టేబుల్ ఇద్దరినీ సెల్‌లో పెడుతుంది. సీఐ విద్యాదేవితో నీ తోడు దొంగని కూడా తీసుకొచ్చాను.. మీ ఇద్దరికీ చిప్పకూడు తినిపించే వరకు వదలను అని అంటుంది. నా దురదృష్టం నీకు అంటింది సీత మహాలక్ష్మీ నా మీద కోపం నీ మీద చూపించిందని విద్యాదేవి అలియాస్ సుమతి ఏడుస్తుంది.

సీత: ఇదంతా తాత్కాలికం అత్తమ్మ పోలీసోడి కూతురిని అయి పోలీస్ స్టేషన్‌కి భయపడతానా. 
విద్యాదేవి: ఇంట్లో ఎప్పుడూ నా గురించే మాట్లాడేదానికి అదంతా మహాలక్ష్మీ మనసులో పెట్టుకుంది. తన వల్ల నేను పడ్డ కష్టాలు చాలవు అన్నట్లు ఇప్పుడు నీకు ఇబ్బంది పెడుతుంది. 
సీత: మనం పోరాడాలి అత్తమ్మ తప్పుల మీద తప్పులు చేస్తున్న ఆవిడకే అంత ధైర్యం ఉంటే మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి. ఆవిడ దగ్గర ఉన్న డబ్బు పలుకుబడి మీరు పెట్టిన భిక్ష. అదంతా మర్చిపోయి మిమల్ని చంపాలనుకున్న ఆ దుర్మార్గురాలిని వదిలేదే లేదు. మీకు నాకు పెట్టిన ఇబ్బందులకు శిక్ష వేయాలి. మహాలక్ష్మీ ప్రతీ క్షణం భయపడాలి చేసిన తప్పులకు మీ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలి.
విద్యాదేవి: అవన్నీ జరగాలి అంటే ముందు మనం బయట పడాలి సీత. ఇక్కడ నువ్వున్నావు అక్కడ రామ్ నీ గురించి ఏమనుకుంటున్నాడో.

రామ్ హాల్‌లో కూర్చొని సీత పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం గుర్తు చేసుకొని బాధ పడుతుంటాడు. జనార్థన్, గిరిధర్, అర్చనలు సీత చేసిందంతా తప్పు అని అంటారు. చలపతి మాత్రం సీత ఎలాంటిదో నీకు తెలుసు కదా రామ్ అని అంటాడు. సీత మొండిగా వెళ్తుందని అంటారు. మహాలక్ష్మీ సాక్ష్యాలను చూపించినా సీత విద్యాదేవిని సుమతి అని చెప్పడం ఏంటి అని జనార్థన్ అంటాడు.

రామ్: సీత చేసినవి చూస్తుంటే నాకు ఇబ్బంది గానే ఉంది డాడ్. పిన్నికి ఎదురు తిరుగుతుందని కోపంగా కూడా ఉంది. కానీ ఏ ఆధారం లేకుండా సీత అలా చేయదు అని చిన్న ఆశ కూడా ఉంది.
చలపతి: నువ్వు ఆలోచిస్తుంది నిజం రామ్. సీత ఆధారాలు లేకుండా ఏ నిందని నిజం అని ఒప్పుకోదు. తప్పు వైపు అస్సలు ఉండదు.   
జనార్థన్: నువ్వు ఊరికే సీతకు సపోర్ట్ చేయకు చలపతి. సీత నిన్న కాక మొన్న వచ్చింది. మహాలక్ష్మీ నా భార్య మనం మహా మాటని నమ్మాలా లేక దారిన పోయిన విద్యాదేవిని సుమతి అని అన్న సీతని నమ్మాలా.
చలపతి: సీత పరాయిది కాదు బావ నీ మేనకోడలు. 
అర్చన: సీత తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటుంది.
జనార్థన్: నీ భార్యని ఏం చేస్తావో నువ్వే ఆలోచించుకో రామ్. మహా మన కోసం తన జీవితం త్యాగం చేసింది. నిన్ను ప్రీతిని ప్రేమగా పెంచుకుంది అలాంటి మహా మాట వింటావో లేక సీతని వెనకేసుకొస్తావో నీ ఇష్టం. 
మహాలక్ష్మీ: మహాలక్ష్మీ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తుంది. దొంగ మేనత్త మేనకోడలు ఎలా ఉన్నారు మీకు పోలీస్ స్టేషన్ సౌకర్యంగా ఉందా. 
సీత: మేం ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాం మీరెలా ఉంటారు అత్త.
విద్యాదేవి: ఇంకెలా ఉంటుంది నిజం తెలిసి నాకు భయపడి తప్పుడు కేసులో ఇరికించింది ఎక్కడ ఆ నిజం బయట పడుతుందో అని టెన్షన్ పడుతుంది. నిజం ఎక్కువ రోజులు దాచలేవు మహాలక్ష్మీ. నేను కాబట్టి నిన్ను అమాయకంగా నమ్మాను నా మేనకోడలు అలా కాదు.
మహాలక్ష్మీ: తెలుసు నీ విషయంలో సీత నేను ఊహించనట్లు మారింది. మనం ఒక డీల్‌కి వద్దాం. తను సుమతి అని నాకు తెలుసు నేను మీ ఇద్దరినీ ఇంటికి తీసుకెళ్తా మీ కేసులు కొట్టిస్తా దానికి బదులుగా మీరు ఓ పని చేయాలి.
సీత: ఏం చేయాలి.
మహాలక్ష్మీ: అందరి ముందు తను సుమతి కాదు విద్యాదేవి అని ఒప్పుకోవాలి. డబ్బు కోసమే ఇదంతా చేశానని క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా నువ్వు చచ్చే వరకు నేను చూసుకుంటా. నా ఇంట్లో నీకు రూమ్ ఇచ్చి తిండి పెట్టి బట్టలు డబ్బులు ఇస్తా. ఏంటి డీల్ ఒకేనా.
విద్యాదేవి: నా ఇంట్లో నాకు రూమ్ ఇచ్చి నాకు తిండి పెట్టి బట్టలు డబ్బులు ఇస్తావా. బదులుగా నేను ఎవరో చెప్పకూడదా నిన్ను చంపేస్తా మహాలక్ష్మీ అని విద్యాదేవి మహాలక్ష్మీ గొంతు పట్టుకోవడానికి వస్తుంది. 
సీత:  మా అత్తమ్మ మీలా ఎంగిలి మెతుకులు తినే రకం కాదు అత్త. నా అత్తమ్మ పక్కన నేను ఉన్నాను మేం ఇద్దరం కలిస్తే నీ ఆటలు చాలవు.  
మహాలక్ష్మీ: మంచి ఆఫర్ ఇచ్చా అయినా మీరు వినడం లేదు ఇక మీ ఖర్మకు మిమల్ని వదిలేయడం తప్ప నేను ఏం చేయలేను. 

మహాలక్ష్మీ వెళ్లిపోతుంది. ఇక ఇంట్లో అందరూ మహాలక్ష్మీ ఎక్కడా అని అనుకుంటారు. సీన్ కట్ చేస్తే మహాలక్ష్మీ తన కారులో సీత తీసుకొని ఇంటికి వస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. సీత ఎలా బయటకు వచ్చిందని అడుగుతారు. సీత ఇంటిలో వాళ్లతో మహాలక్ష్మీ అత్తయ్యే నన్ను బతిమాలి బయటకు తీసుకొచ్చిందని చెప్తుంది. రామ్ సీత అరెస్ట్‌తో డిస్ట్రబ్ అయ్యాడని రామ్ కోసం తీసుకొచ్చానని అంటుంది. సీత లేకుండా రామ్ ఉండలేడు అని ఈ ఇంటి పరువు మర్యాద పోతే నేను బతకలేనని అంటుంది. రామ్ తల్లిగా సీత అత్తగా ఆలోచించానని అందుకే సీతని తీసుకొచ్చానని మహాలక్ష్మీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: అసలు నువ్వు ఎవరు? నన్ను పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు: త్రినేత్రికి విశాల్ ప్రశ్నలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Bangladesh China Frienship: బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Today Weather Report: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
Embed widget