Trinayani Serial Today November 22nd: 'త్రినయని' సీరియల్: అసలు నువ్వు ఎవరు? నన్ను పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు: త్రినేత్రికి విశాల్ ప్రశ్నలు
Trinayani Today Episode గురువుగారు విశాల్ ఇంటికి రావడం నయని అని త్రినేత్రితో మాట్లాడటం త్రినేత్రి ప్రవర్తనకు షాక్ అయిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode సుమన, విక్రాంత్ నయనిలా ఉన్న త్రినేత్రి గురించి మాట్లాడుకుంటారు. విక్రాంత్ సుమనకు తనని కాస్త దగ్గరగా పరిశీలించని అంటాడు. అక్క వాయించేస్తుంది నా వల్ల కాదని సుమన అంటుంది. ఇక త్రినేత్రి బయట కూర్చొని పువ్వులు చూసుకుంటూ ఉంటే అక్కడికి విశాల్ వెళ్తాడు. పువ్వులు పెట్టుకోకుండా దాచిపెట్టుకుంటున్నావ్ ఎందుకు అని అడుగుతాడు.
త్రినేత్రి: పెళ్లి తర్వాత భర్త చేతితో పువ్వులు పెట్టించుకుంటే అబ్బో అలా ఊహించుకుంటేనే ఏదోలా ఉంది.
విశాల్: నయని నీకు ఏమైంది ఎందుకు పెళ్లి కాలేదు అన్నట్లు మాట్లాడుతున్నావ్.
త్రినేత్రి: అయిందని ఎవరు చెప్తున్నారు మీరు కూడా నమ్ముతున్నారా బాబుగారు.
విశాల్: సరే నీకు పెళ్లి కాలేదు అనుకుందాం. నాకు పెళ్లి అయిందంటే నమ్ముతావా.
త్రినేత్రి: మీకు పెళ్లి అయిందని ఇద్దరు పిల్లలని ఇంట్లో అందరూ చెప్తే అప్పుడు నవ్వురాలేదు కానీ ఇప్పుడొస్తుంది బాబుగారు.
విశాల్: నయని నాకు నిజంగా పెళ్లి అయింది.
త్రినేత్రి: అవునా ఎవర్ని చేసుకున్నారు.
విశాల్: నేను పెళ్లి చేసుకుంది నయనిని. పూర్తి పేరు త్రినయని ఊరు ముక్కంటి పురం. వాళ్లమ్మ పేరు శ్యామల. వాళ్ల చెల్లి సుమన. ఇప్పుడు గుర్తొచ్చిందా.
త్రినేత్రి: నాకు ఇంతకు ముందు పరిచయం ఉండి మర్చిపోతే గుర్తొస్తుంది కానీ ఎలా.
విశాల్: నయని నేను పెళ్లి చేసుకుంది నీ గురించే.
త్రినేత్రి: బాబుగారు అవన్నీ నాకు తెలీదు నేను వచ్చింది మిమల్ని పెళ్లి చేసుకోవడానికి.
విశాల్: అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్. నన్ను పెళ్లి చేసుకోమని ఎవరు చెప్తారు. నువ్వు నయని కాదు త్రినేత్రి అని నీకు చెప్పింది ఎవరు వాటికైనా సమాధానం చెప్పు. సారీ..
త్రినేత్రి: పర్లేదు బాబుగారు ఏమైంది నాకు.
వల్లభ ఆలోచిస్తూ ఉంటే అక్కడికి తిలోత్తమ వెళ్తుంది. నయని ఎందుకు అలా ప్రవర్తిస్తుందని అనుకుంటారు. ట్యాబ్లెట్స్ విసిరేసింది.. సుమనను కొట్టింది అంటే ఏమై ఉంటుందని అనుకుంటారు. అంతా తేడాగా జరుగుతుందని ఈ టైంలో పరీక్షలు చేస్తే మనం దెబ్బలు తినడం ఖాయమని వల్లభ అంటాడు. తెల్లారితే చూద్దాం అని తిలోత్తమ అంటుంది. సీన్ కట్ చేస్తే ముక్కోటి పరుగు పరుగున వచ్చి వైకుంఠానికి పిలుస్తాడు. త్రినేత్రి ఫొటో ఎవరు తీశారని అడుగుతాడు. దాంతో బామ్మ స్వామీజీ ఏం చెప్తారు. ఆ స్వామీ అలా మాట్లాడటం వల్ల నాకు ధైర్యం వచ్చిందని బామ్మ చెప్తుంది. త్రినేత్రి ఇక రాదని ఆస్తి ఇవ్వమని వైకుంఠం, ముక్కోటి అడుగుతారు. దాంతో బామ్మ తిడుతుంది.
త్రినేత్రి ఉదయం ఇంటి ముందు ముగ్గు పెడుతుంది. దూరం నుంచి విశాల్ చూస్తుంటాడు. త్రినేత్రి విశాల్‌కి చూసి ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా అని పాట పాడుతూ ముగ్గు వేస్తుంది. ఇంతలో దురంధర ఫారెన్ నుంచి వస్తుంది. గౌన్ వేసుకొని క్యాప్ పెట్టుకొని టిప్ టాప్ మీద వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అందరూ చేరుకుంటారు. కడుపుతో ఉన్న దానివి ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఇలా ఫారెన్ ట్రిప్స్ ఏంటి అని అందరూ అంటారు. ఇక త్రినేత్రి ఎవరు ఇది అని దురంధరని చూసి అడుగుతుంది. జోకులు వేస్తున్నావా నయని అని దురంధర అంటే మిమల్ని చూడటం ఇదే మొదటి సారి అని అంటుంది. వల్లభ తను నయని కాదని త్రినేత్రి అని అంటుంది. ఇక విశాల్ మా నాన్న చెల్లి మా మేనత్త అని చెప్తాడు. నయనికి యాక్సిడెంట్ అయిందని అందుకే ఇలా ప్రవర్తిస్తుందని పావనా చెప్తాడు. అందరినీ పరాయివాళ్లలా చూస్తుంది మా అక్క అని చెప్తుంది సుమన. ఇంతలో గురువుగారు అక్కడికి వస్తారు. వల్లభ గురువుగారికి విషయం చెప్తాడు. యాక్సిడెంట్ అయిన రెండు రోజులకే ఇంటికి వచ్చేసింది అని చెప్తారు.
గురువుగారు: ఎవరు తీసుకొచ్చారు.
తిలోత్తమ: తనే వచ్చేసింది.
గురువుగారు: ఇక మీరు ప్రశ్నించడం నేను సమాధానం చెప్పడం అనవసరం.
సుమన: అర్థం కాలే.
విక్రాంత్: నాకు అర్థమైంది వదిన అయితే అలా ఎలా వస్తుంది వచ్చింది ఇంకెవరు అయింటారేమో.
విశాల్: విక్రాంత్ ఎవరైనా అలా అనొచ్చు కానీ నువ్వు అనడం ఏంటిరా.
త్రినేత్రి: బాబుగారు నామానాన నేను ముగ్గు వేసుకుంటే అందరూ వచ్చి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు.
తిలోత్తమ: చూస్తున్నారు కదా గురువుగారు ఇది నడిపికోడలి వాలకం.
గురువుగారు: నయని.
త్రినేత్రి: స్వామి నా పేరు త్రినేత్రి.
గురువుగారు: త్రినేత్రి నీకు ఈ పేరు ఎవరు పెట్టారు. మీ అమ్మానాన్న ఎవరమ్మా.
త్రినేత్రి: అది గుర్తుకురావడం లేదు స్వామి. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత, విద్యాదేవిలు అరెస్ట్.. కథ ఇప్పుడే మొదలైందంటోన్న సీత!