Seethe Ramudi Katnam Serial Today November 21st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత, విద్యాదేవిలు అరెస్ట్.. కథ ఇప్పుడే మొదలైందంటోన్న సీత!
Seethe Ramudi Katnam Today Episode సీఐ సీత, విద్యాదేవిలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode డీఎన్ఏ రిపోర్ట్ ఫేక్ అని సీఐ చెప్తారు. దాంతో అందరూ సీతని నిలదీస్తారు. సుమతి పేరు చెప్పి మా సెంటిమెంట్‌తో ఆడుకున్నావని జనార్థన్ అంటాడు. మహాలక్ష్మీ కూడా రెచ్చిపోతుంది. తాను సుమతి కాదు కాబట్టి తన చేతుల మీద జరిగిన పెళ్లి క్యాన్సిల్ చేద్దామని మెడలో పడిన తాళి తీసేమని ప్రీతితో చెప్తుంది. అందరూ మహాలక్ష్మీ మాటకు బిత్తరపోయి నోరెళ్లబెతారు.
మహాలక్ష్మీ: ఇంకా ఆలోచిస్తావేంటి ప్రీతి నువ్వు తీస్తావా నేను తీయనా.
సీత: ఆగండి అత్తయ్య. తాళి కట్టిన వాడే తీయాలి.
మహాలక్ష్మీ: అయితే వాళ్లతోనే తీయిస్తా. సుమతితో కన్యాదానం చేయించాలని మీరు కోరుకున్నారు కాబట్టి ఆ తాళి మీ అబ్బాయికి తీసేయమనండి.
హేమంత్: సారీ నేను ప్రీతిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా నేను తాళి తీయను.
నిన్న రాత్రి మాతో సీత కలిసిందని చెప్తారు హేమంత్ తల్లిదండ్రులు. సీత సుమతిని తీసుకొస్తానని ఏదైనా కారణం వల్ల నేను సుమతిని తీసుకురాకపోతే పెళ్లి ఆపొద్దని బతిమాలుతుంది. దాంతో వాళ్లు ఈ పెళ్లి ఆగదు అని వాళ్లు మాటిస్తారు. ఈ విషయం మహాలక్ష్మీ వాళ్లతో చెప్తారు. పెళ్లికి ముందే నిర్ణయించుకున్నామని సుమతి వచ్చినా రాకపోయినా ప్రీతి మా కోడలు అనుకున్నామని అంటారు. సుమతి తాను అవునో కాదో మీరు తేల్చుకోండి అని చెప్పి ప్రీతిని తీసుకెళ్లిపోతారు. నా నమ్మకం ఒప్పు చేశావని ప్రీతి సీతతో అంటుంది.
ప్రీతి: మా అమ్మలా నటించి మీరు ఏం సాధించారు టీచర్. మీరు మా అమ్మలా రాకుండా ఉండి ఉంటే కనీసం మమల్ని ఎంతో ఇష్టపడే మా పిన్ని చేతిల మీదగా అయినా నా పెళ్లి జరిగుండేది. మిమల్ని ఎప్పటికీ క్షమించను.
మహాలక్ష్మీ: మీరు అంతా ముందే నా మాట వినుంటే ఇంత వరకు వచ్చేది కాదు.
ప్రీతి: సారీ పిన్ని నా పెళ్లి జరిగిపోయింది నేను అత్తారింటికి వెళ్తాను అని అందరితో చెప్పి ప్రీతి వెళ్లిపోతుంది.
మహాలక్ష్మీ: ఈ హంతకురాలిని ఏం చేయాలి సీఐ గారు నాకు వస్తున్న కోపానికి తన పీక పిసికి చంపేయాలి అని ఉంది.
సీఐ: మేం చూసుకుంటా మేడం.
హంతకురాల్ని దాచినందుకు నిన్న కూడా అరెస్ట్ చేస్తున్నాం అని సీతతో సీఐ అంటారు. విద్యాదేవి, సీత ఇద్దరినీ అరెస్ట్ చేయమని చెప్తారు. శివకృష్ణ అడ్డుకుంటే కోర్టులో చూసుకుందామని సీఐ అంటారు. ఇక విద్యాదేవి సీతని వదిలేయమని అంటుంది. రామ్ కూడా సీతని అరెస్ట్ చేయొద్దని అంటాడు. ఇక శివకృష్ణ ఐదు నిమిషాలు టైం ఇవ్వమని తర్వాత వాళ్లని తీసుకొస్తా అంటాడు. మహాలక్ష్మీ సైగ చేయడంతో సీఐ ఓకే అంటాడు. శివకృష్ణ లలిత, సీత, విద్యాదేవిని పక్కకు తీసుకెళ్తాడు. సీఐ ఎందుకు మహాలక్ష్మీకి సాయం చేస్తున్నాడని సీత అంటుంది. అతను ఫ్రాడ్ అని శివ చెప్తాడు. డైరెక్ట్‌గా మహాలక్ష్మీతోనే ఇప్పుడు యుద్ధం చేస్తానని సీత అంటుంది. ఇప్పుడు అసలైన కథ మొదలైందని అంటుంది. విద్యాదేవి వద్దని అంటే శివకృష్ణ, లలిత కూడా సీతకే సపోర్ట్ చేస్తారు. ఇక మహాలక్ష్మీ సీత తప్పు చేసిందని నేనే ఏం చేయలేను అని మహాలక్ష్మీ రామ్‌తో చెప్తుంది. రామ్ మాత్రం సీతని కాపాడమని మహాలక్ష్మీని వేడుకుంటాడు.
సీత వాళ్లు వచ్చి సీఐతో మీ వెనక ఎవరు ఉండి మిమల్ని ఎవరు ఆడిస్తున్నారో తెలుసని అంటుంది. ఇక రామ్‌ని ఓ మామ అని పిలిచి ఈ సీత సంగతి తెలుసు కదా తప్పుని తప్పు రేగొట్టి వస్తా టెన్షన్ పడకు అని చెప్తుంది. పోలీసులు సుమతి, సీతని తీసుకెళ్తారు. రామ్ వాళ్లు ఇంటికి వెళ్లిపోతారు. ఇక రాకేశ్ ప్రీతికి పెళ్లి అయిపోయిందని మహాలక్ష్మీ మనల్ని చీట్ చేసిందని కోపంతో ఊగిపోతాడు. మహాలక్ష్మీని చంపేస్తా అని రాకేశ్ గన్ తీసుకొని బయల్దేరుతాడు. దాంతో రాకేశ్ తల్లిదండ్రులు రాకేశ్‌ని ఆపి మాట తప్పిన మహాలక్ష్మీ మన మాట వినేలా చేయాలని ఓ ప్లాన్ రాకేశ్‌కి చెప్తారు. పోలీసులు విద్యాదేవి, సీతల్ని పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: చక్రవర్తికి సర్‌ఫ్రైజ్ ఇచ్చిన క్రిష్.. మైత్రి ఇంట్లో హర్ష.. నందిని ఫైర్!