Seethe Ramudi Katnam Serial Today May 3rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మిథున జీవితం నాశనం చేసేసిన రామ్.. ఏం న్యాయం చేస్తాడు!
Seethe Ramudi Katnam Today Episode మిథున సీతలా గెటప్ మార్చేసి రామ్‌తో ఏకాంతంగా గడిపి మిథునకు రామ్ అన్యాయం చేశాడని రచ్చ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మిథునగా నటిస్తున్న సీత రామ్‌తో ఏకాంతంగా కలవడానికి పాలలో మత్తు మందు కలిపి రామ్‌కి ఇస్తుంది. రామ్ తాగేస్తాడు. రామ్ పాలు తాగే వరకు ఇక్కడే కూర్చొంటా అని మిథున మారాం చేస్తుంది. ఇక సీతకి వీడియో కాల్ చేస్తాను అని రామ్ అంటాడు. మిథున టెన్షన్ పడుతుంది. నేను వెళ్తా అని చెప్తుంది. పాలు తాగే వరకు ఉంటాను అని చెప్పి వెళ్లిపోతావ్ ఏంటి అని రామ్ అడుగుతాడు. దానికి మిథున మీ ఇద్దరూ మాట్లాడితే మధ్యలో నేను ఏం చేయాలి అనుకుంటుంది.
గదిలోకి వెళ్లిన మిథున ఓరి నాయనో ఇప్పుడు మామ ఫోన్ చేస్తాడు అర్జెంట్‌గా సీతలా రెడీ అవ్వాలని అనుకుంటుంది. వెంటనే సీతలా గెటప్ మార్చేసి మాట్లాడుతుంది. మిథున ఏమంటుంది మామ అని అడుగుతుంది. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు అని రామ్ అంటాడు. రేపు బయల్దేరుతా ఈవినింగ్ రేవతి పిన్ని ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్తాడు. సీత పాలు తాగావా మామ అంటే రామ్ సీత చూస్తుండగానే పాలు మొత్తం తాగేస్తాడు. సీత తొంగి చూసి మామ పాలు తాగేశాడు కాసేపట్లో కిక్ ఎక్కుతుంది ఆ తర్వాత నేను అనుకున్నదే జరుగుతుందని అనుకుంటుంది. రామ్‌కి మత్తు ఎక్కుతుంది. దిండూ దుప్పటి తీసుకొని బయటకు వెళ్లిపోవాలని మత్తులో అనుకుంటూ గదిలోకి వస్తాడు.
మిథున గదిలో సీతలానే పడుకున్నట్లు నటిస్తుంది. రామ్ చూసి సీత అని దగ్గరకు వెళ్తాడు. సీతలా రామ్‌ని కవ్విస్తుంది. సీత రామ్ ఇద్దరూ ఒక్కటైపోతారు. మరోవైపు మహాలక్ష్మీ పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. త్రిలోక్తో ఎందుకు నన్ను అర్జెంట్‌గా పలిచారు అంటే సెల్‌లో ఉన్న గౌతమ్, రేఖల్ని త్రిలోక్ మహాలక్ష్మీకి చూపిస్తాడు. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. మహాలక్ష్మీని చూసి ఇద్దరూ మమ్మీ అత్తయ్య అని కేకలేస్తారు. ఇద్దరూ గెటప్‌లు మార్చి ఫామ్‌హౌస్ చుట్టూ తిరుగుతున్నారని త్రిలోక్ మహాలక్ష్మీకి చెప్తాడు. డ్రస్‌లు చూపించి రామ్ మిథునలు ఉన్న దగ్గరకు వెళ్లి రామ్‌ని చంపాలని ప్రయత్నించారని చెప్తారు.
మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. ఇద్దరినీ మహాలక్ష్మీ ప్రశ్నిస్తుంది. రేఖ ఐడియా అని గౌతమ్ చెప్తాడు. దాంతో రేఖ గౌతమ్ మీ సొంత కొడుకు అని ఎవరికీ తెలీదు కదా అదే రామ్ని లేపేస్తే ఆస్తి మీ సొంత అవుతుందని ఇలా చేశాం అంటుంది. మహాలక్ష్మీ గౌతమ్ని లాగిపెట్టి కొడుతుంది. ఇలాంటి దాన్ని ప్రేమించావ్ ఏంట్రా నీకు ఇలాంటిది దొరికిందని అంటుంది. రామ్ని చంపితే జైలు పాలవుతారని మన శత్రువు సీత రామ్ కాదు ఇంకెప్పుడూ రామ్ జోలికి వెళ్లొద్దు ఈ విషయం సీతకి తెలిస్తే మిమల్ని చంపేస్తుందని అంటుంది. ఇద్దరికీ త్రిలోక్ వార్నింగ్ ఇచ్చి పంపేస్తాడు.
రామ్ ఉదయం లేచే సరికి మిథున మీద చేయి వేసుకొని పడుకొని ఉండటం చూసి షాక్ అయిపోతాడు. కంగారుగా లేచి మిథునతో ఉన్నానేంటి అనుకొని మిథునని నిద్ర లేపుతాడు. మిథున కూడా లేచి ఏం తెలీనట్లు హాల్లో పడుకుంటా అన్నావ్ నా పక్కన వచ్చి పడుకున్నావ్ ఏంటి అని అడుగుతుంది. సీత సీత అని డోర్ కొట్టి నేను సీతని కాదని ఎంత చెప్పినా వినకుండా హగ్ చేసుకున్నావ్ గుర్తు చేసుకో అని అంటుంది. జరిగింది రామ్ గుర్తు చేసుకొని బిత్తరపోతాడు. తల పట్టుకొని కుప్పకూలిపోతాడు. రాత్రి నువ్వు చీర కట్టుకొని సీతలా కనిపించావని అంటాడు. నేను ఈవినింగ్ నుంచి ఈ డ్రస్లో ఉన్నాను. నైట్ నీకు ఏమైందో తెలీదు సీత సీత అని నాతో ఏకాంతంగా ఉండి నా జీవితం నాశనం చేసేశావని అంటుంది.
రామ్ మిథునకు సారీ చెప్తాడు. నైట్ ఏమైందో గుర్తు లేదు అంటాడు. నాతో పెళ్లి ఇష్టం లేదు అని నాతో ఫస్ట్ నైట్ చేసుకున్నావ్ అని ఏడుస్తుంది. నువ్వు చేసిన తప్పునకు నాకు ఏం న్యాయం చేస్తావో చెప్పు అని అడుగుతుంది. మీ ఇంటికి వెళ్లి తేల్చుకుందామని అంటుంది. రామ్ వద్దని బతిమాలుతాడు. ఈ ఇంట్లో విషయం తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని బతిమాలుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను నీ ఫాలోవర్‌ని బేబీ.. మతడ పెట్టేసిన మిథున.. కాంతానికి రోకలి ట్రీట్మెంట్!





















