Seethe Ramudi Katnam Serial Today May 2nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్, మధులతో కల్యాణం జరిపించనున్న మహా ప్లాన్ తెలుసుకున్న సీత.. కొడుకు కోడలిని చూసి మురిసిపోయిన సుమతి!
Seethe Ramudi Katnam Serial Today Episode : మహాలక్ష్మి కుటుంబాన్ని తన అన్నయ్య కుటుంబం కలిసి మాట్లాడటం చూసిన సుమతి ఆలోచనలో పడడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode : మహాలక్ష్మి సీతారాముల కల్యాణంలో రామ్, మధుమితలను కూర్చోపెడుతుందని చలపతి, రేవతి సీతకు చెప్తారు. దీంతో సీత తన స్థానంలో తన అక్క కూర్చోవడానికి ఏదో ప్లాన్ చేస్తుందని అది తాను తెలుసుకోవాలని అనుకుంటుంది. మరోవైపు మహాలక్ష్మి దేవస్థానం స్టాఫ్ ఒకతనితో మాట్లాడుతుంది. అతనికి డబ్బులు ఇచ్చి చిట్టీలో అన్ని పేర్లు రామ్, మధుమిత అని ఉండాలి అని ఏ చీటీ తీసినా రామ్, మధుమితల పేర్లే ఉండాలి అంటుంది. దీంతో అతను ఓకే అని డబ్బులు తీసుకుంటాడు. మహా అతనితో మాట్లాడటం సీత, చలపతి, రేవతి వింటారు.
మహాలక్ష్మి: ఓసేయ్ సీత నాకు చెప్పకుండా గుడికి రావడమే కాకుండా ఈ గుడిలో సీతారాముల కల్యాణం చేయిస్తావా ఇప్పుడు ఎలా చేయిస్తావే. ఇలాగే నీతో ఆడుకొని నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను.
చలపతి: మహాలక్ష్మి పెద్ద ప్లానే వేసింది ఇప్పుడు ఎలా సీత.
సీత: ఇది సీతారాముల గుడి ఇక్కడ రాముడి పక్కన సీతే ఉంటుంది. నా మామ పక్కన నేనే ఉంటాను. మీరే చూస్తారు కదా.
మహాలక్ష్మి: అన్నయ్య, సీత, రేవతిలు ఎక్కడ.
రామ్: బయటకు వెళ్లారు పిన్ని. ఏదో మాట్లాడాలి అని సీతని తీసుకెళ్లారు.
జనార్థన్: మహా రామ్, మధుల కల్యాణం ఏర్పాట్లు చేశావా.
మహాలక్ష్మి: చేశాను కల్యాణం వారి చేతుల మీదే జరుగుతుంది. జంటలు సంతోషంగా ఉండటం చూసి బాధపడుతున్న మధుని చూసి.. ఏంటి మధు ఆ జంటను చూసి బాధగా ఉందా..
అర్చన: ఉండదా మరి మధు ఇప్పుడు ఒంటరి అయిపోయింది కదా.
గిరిధర్: రామ్ ఉండగా మధు ఒంటరి ఎందుకు అవుతుంది.
జనార్థన్: అంటే రామ్‌తో పాటు మనందరం మధుకి తోడుగా ఉన్నాం కదా.
మహాలక్ష్మి: నువ్వేం ఫీల్ అవ్వకు మధు ఆ దేవుడికి ఎవరి జీవితాలతో ఎవరిని ముడి పెట్టాలో బాగా తెలుసు. మనం ఊహించుకున్నది ఒకటి అయితే ఆ దేవుడి రాత మరొకటిగా ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ ఉన్న అన్ని జంటలు కల్యాణం జరిపించడానికి తమ పేర్లను ఆ కలశంలో రాసి పెట్టారు. కానీ ఆ దేవుడి కల్యాణం ఎవరి చేతల మీదగా జరగాలి అని ఆ దేవుడే రాస్తాడు. ఏ జంట పేరు వస్తే ఆ జంటే కల్యాణం జరిపించాలి.
మరోవైపు సుమతి మహాలక్ష్మి, జనార్థన్ వాళ్లని చూస్తుంది. ఇక శివకృష్ణ సుమతికి తన భర్త వివరాలు అడుగుతాడు. ఆయన భర్తని తెచ్చి కల్యాణం జరిపిస్తాను అంటాడు. దీంతో సుమతి వద్దు అనేస్తుంది. ఇక సుమతి మహా వాళ్ల కంట పడకూడదు అనుకుంటుంది. ఇక సుమతి ఒంటరిగా ఉండాలని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్తుంది.
రామ్: ఇంత సేపు ఎక్కడికి వెళ్లారు సీత. పిన్ని మీ గురించి టెన్షన్ పడుతుంది.
సీత: ఇప్పుడు నా రాముడిని కాపాడుకోవడానికి నేను యుద్ధం చేయాల్సి వస్తుంది.
అర్చన: ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతుంది.
సీత: రాముడి వెనక పడే సూర్ఫణకలు, రావణాసురులు ఉంటారు కదా వాళ్ల నుంచి సీతే రాముడిని కాపాడుకోవాలి కదా.
మహాలక్ష్మి: ఇదేంటి సీత తేడాగా మాట్లాడుతుంది. కొంప తీసి నా ప్లాన్ లీక్ అయిందా.
మధు: నువ్వు గుడిలో కూడా ప్రశాంతంగా ఉండవా సీత. ఎక్కడికి వచ్చానా గొడవలేనా.
సీత: నేను ఇప్పుడు గొడవ పడలేదు అక్క. కానీ ఎవరైనా నాతో గొడవ పెట్టుకోవాలి అని చూస్తే మాత్రం వాళ్లకి సీతా రావణ యుద్ధం చూపిస్తా.
లలిత సీత వాళ్లని చూస్తుంది. భర్తతో చెప్తే శివకృష్ణ వద్దని అంటాడు. మధుని ఇంటికి తీసుకెళ్లడానికి ఇదో మంచి అవకాశం అని సర్ది చెప్పి శివకృష్ణను సీత వాళ్ల దగ్గరకు తీసుకెళ్తుంది. మధు తన తల్లిదండ్రులను చూసి ముఖం తిప్పుకుంటుంది. ఇక మధుతో నీల, తన నానమ్మ మాట్లాడినా మధు సరిగా మాట్లాడదు.
మరోవైపు సుమతి దూరం నుంచి చూసి తన అన్నయ్య వాళ్లు తన భర్త, మహాతో ఎందుకు మాట్లాడుతున్నారని అనుకుంటుంది. సుమతి సీతని చూసి సీతకు, తన అన్నయ్యకు ఏంటి సంబంధం అని అనుకుంటుంది. అందరూ మధుని ఇంటికి రమ్మని పిలుస్తారు.
మధు: గుడికి వచ్చినా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా. నేను ఎక్కడికీ రాను.
సుమతి: ఆ అమ్మాయి ఎవరు అమ్మ, నీలవేణితో అలా మాట్లాడుతుంది. ఈ ఇద్దరు అమ్మాయిలకు అన్నయ్యకు సంబంధం ఏంటి.
మధు: మీరు వచ్చిన పని చూసుకోండి నన్ను వదిలేయండి.
సీత: అలా అంటావ్ ఏంటి అక్క. నీకు అమ్మానాన్నల మీద గౌరవం లేదు. నానమ్మ మీద కూడా లేదా.
మహాలక్ష్మి: కామ్ డౌన్ సీత ఎందుకు అరుస్తున్నావ్. ఇది ఇళ్లు కాదు గుడి.
సుమతి: వాళ్లిద్దరిలో ఒకరు నా కోడలు అయింటారు. ఇద్దరి మెడలో తాళి ఉంది. రామ్ భార్య ఎవరు.
కల్యాణానికి టైం అయిందని పంతులు పిలుస్తారు. సీత, రామ్‌ని తీసుకొని వెళ్తుంది. సుమతి సీత వాళ్లకు ఎదురు పడకుండా దాక్కుంటుంది. సీత, రామ్‌లను చూసి తనే రామ్ భార్యనా, నా కోడలా అని పొగిడేస్తుంది.
సుమతి: మహాలక్ష్మి రామ్‌కి మంచి అమ్మాయితోనే పెళ్లి చేసింది.
సీత: ఈ గుడిలోనే మనం సీతారామ్‌ల కల్యాణం జరిపించబోతున్నాం. మామ ఎలాంటి అడ్డుంకులు వచ్చానా నువ్వు నా పక్కనే ఉండాలి. నన్ను వదిలే పరిస్థితి వచ్చినా నువ్వు నాతోనే ఉండాలి.
సుమతి: ఈ అమ్మాయి భయం ఏంటి.
సీత: మాట మీద ఉంటావ్ కదా మామ. నాకు నీ మీద పిచ్చి ప్రేమ మామ. నువ్వు నాకే సొంతం అనే స్వార్థం ఉంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.