అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today March 6th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తన ఇంటికి మధుమితని తెచ్చుకున్న మహాలక్ష్మి.. అన్యాయమైపోయానని పుట్టింట్లో కన్నీరు పెట్టుకున్న సీత!

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మి ప్లాన్‌ను తన తల్లిదండ్రులకు చెప్పుకొని సీత కన్నీరు మున్నీరు కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode: సీత తన అక్క మధుమితను పుట్టింటికి తీసుకొస్తాను అని తన తల్లిదండ్రలకు చెప్తుంది. దీంతో శివకృష్ణ ఇంటి దగ్గర అందరూ సీత, మధుమితల కోసం ఎదురు చూస్తుంటారు. ఇంకా రాలేదు ఏంటా అని ఆలోచిస్తూ ఉంటారు. మహాలక్ష్మి ఎందుకు వచ్చిందని ఆలోచిస్తూ ఉంటారు. ఇక మధు ఇంటికి వస్తే ఏం అనొద్దు అని అందరూ శివకృష్ణకు చెప్తారు.

శివకృష్ణ: మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారు. మీ అందరికీ నా కోపమే కనిపిస్తుంది కానీ దాని వెనక ఉన్న నా బిడ్డల మీద ప్రేమ తెలీడం లేదా.. అమ్మేమో నేను తనకి సుమతిని దూరం చేశాను అంటుంది. మీరేమో మధుని దూరం చేశాను అంటున్నారు. ఆ మధు ఏమో నేను తన కన్న తండ్రినే కాదు అంటుంది. ఆఖరికి సీత కూడా నన్నే తప్పు పడుతుంది. అసలు నేను మీకు అర్థం కావడం లేదో మీరు నాకు అర్థం కావడం లేదో తెలీడం లేదు. ఇంతలో సీత వస్తుంది.
సీతతల్లి: సీత మధు ఎక్కడే.. మధు నీతో రాలేదా.. 
సీత: అక్క నాతో రాలేదు. మా అత్తయ్యతో వెళ్లిపోయింది అమ్మ మా అత్తయ్య గారింటికి.. 
శివకృష్ణ: ఏం జరిగింది సీత..
సీత: అక్కకు మన మీద నమ్మకం పోయింది నాన్న. అక్క ఏమందో తెలుసా అని జరిగింది చెప్తుంది. ఆ ఇంట్లో అక్కకు విలువ గౌరవం ఉండవు అని చెప్పినా వినకుండా వెళ్లిపోయింది.
బామ్మ: తప్పు మనదేనే మధుకి మనం ధైర్యం కలిగించలేకపోయాం. 
సీతతల్లి: సాయం చేయమని వస్తే తరిమి తరిమి కొట్టాం అది ఇంక మనల్ని ఎలా నమ్ముతుంది. 
శివకృష్ణ: పోతే పోనివ్వండి.. అయిన వారిని పరాయివాళ్లగా పరాయి వాళ్లని అయిన వాళ్లగా చూస్తే ఎవరు ఏం చేస్తారు. దాని ఖర్మ అదే అనుభవిస్తుంది వదిలేయండి..
సీత: వదిలేసే పరిస్థితి లేదు నాన్న మా అత్తయ్య మరో ప్లాన్‌తో అక్కని మా ఇంటికి తీసుకెళ్లింది. అక్కకు సాయం చేసే ఉద్దేశం మా అత్తగారికి లేదు నన్ను మోసం చేయడానికి అక్కని తీసుకెళ్లింది. మొదటి నుంచి మా అత్తకి నేను అంటే ఇష్టం లేదమ్మా. మా పెళ్లి అవ్వక ముందు జరిగిన ఒక సంఘటనను మనసులో పెట్టుకొని మా అత్తయ్య నామీద పగ పెంచుకుంది. నన్ను ఎప్పటికీ కోడలిగా అంగీకరించను అని చెప్పింది. నన్ను ఆ ఇంటి నుంచి పంపించేసి అక్కని కోడలిగా చేసుకోవాలి అనుకుంటున్నారు. అందరూ షాక్ అయిపోతారు. నన్ను తప్పించి అక్కని మామ భార్యగా చేయాలి అనుకుంటున్నారు. 
శివకృష్ణ: ఏమంటున్నావ్ సీత మధుని రామ్‌కి భార్యని చేయడం ఏంటి. నీకు రామ్‌కి పెళ్లి అయింది కదా..
సీత: వాళ్ల దృష్టిలో అసలు అది పెళ్లే కాదు నాన్న. నేను వాళ్ల కోడలినే కాదు. మామ మొదటి ఇష్టపడింది అక్కను. వాళ్లు కోడలిగా చేసుకోవాలి అనుకున్నది కూడా అక్కనే. వాళ్లు ఇప్పటికీ ఆ ఉద్దేశంతోనే ఉన్నారు. అనుకోకుండా నాకు మామకు పెళ్లి జరిగింది. దాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే రిసెప్షన్‌లో అక్కను రప్పించి సూర్య బావని రానివ్వకుండా చేశారు. రిసెప్షన్‌లో నన్ను పిచ్చి దాన్ని చేశారు. మధు అక్క తన కోడలు అని ప్రచారం చేశారు. కావాలనే నన్ను తప్పించి అక్కని రామ్‌గారిని పక్క పక్క నిల్చోపెట్టి ఫొటోలు తీశారు. ఆ ఫొటోలు పేపర్లలో వచ్చేలా చేశారు. అక్కడ అందరికీ మామ భార్య నేను కాదు అక్క.
శివకృష్ణ: ఎంత పెద్ద ప్లాన్ చేశారు. ఈ విషయం రామ్‌కి తెలుసా.. నేను చెప్పినా ఆయన నమ్మడం లేదు. వాళ్ల పిన్నినే ఆయన నమ్ముతారు.
సీతతల్లి: ఇంత జరుగుతున్నా ఎందుకే నువ్వు మాతో ఒక్కమాట కూడా చెప్పలేదు.   
సీత: మిమల్ని బాధ పెట్టాలి అనుకున్నాను. ఈ సమస్యను నేనే పరిష్కరించాలి అనుకున్నాను. తను అనుకున్నది సాధించడం కోసం మా అత్తయ్య గారు ఎంతకైనా తెగిస్తారు నాన్న. ఆవిడకు ఇంట్లో అందరి సపోర్ట్ ఉంది. ఆవిడ చెప్తే మా ఆయన గుడ్డిగా నమ్మేస్తారు. తిరిగి నన్నే అంటారు. ఈ రోజు కూడా పెద్ద ద్రోహం చేశారు. అక్కకు అవేం తెలీకుండా ఆవిడతో వెళ్లిపోయింది. అక్కని మార్చేసి మామకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అటు సూర్య బావ, ఇటు నేను అన్యాయం అయిపోతాం నాన్న. ఈ సమస్యను నేను పరిష్కరించుకుంటాను..
శివకృష్ణ: లేదు సీత అది నీ వల్ల కాదు. మధు ఆ ఇంట్లో ఉంటే మీ అత్తయ్య అన్నంత పని చేస్తుంది. మేం వచ్చి తనకి బుద్ధి చెప్తాం. పదండి వెళ్దాం..

మధుని తీసుకొని మహాలక్ష్మి తన ఇంటికి వస్తుంది. ఇక సెక్యూరిటీ వాళ్లు మధుమితని ఇంటికి తెచ్చారు అంటే కొత్త యుద్ధం జరుగుతుంది అని.. ఏం జరిగినా మనం సీతమ్మ వైపే ఉందామని అనుకుంటారు. ఇక మహాలక్ష్మి మధుని గుమ్మం దగ్గరే ఆపి అర్చన, ప్రీతి వాళ్లని పిలుస్తుంది. అర్చనకు హారతి తీసుకురమ్మని అంటుంది. అర్చన మధుమితకి హారతి ఇస్తుంది. మధుని కుడి కాలు పెట్టమని చెప్పి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అందరూ మధుతో ప్రేమగా మాట్లాడుతారు. రామ్‌ కూడా వస్తాడు. మధు ఒంటరి అయిందని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారు అని అందుకే ఇక్కడ ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ప్రేమలు తెలుగు: వెల్‌కాం టు హైదరాబాద్ - ఒకే నగరం భిన్న జీవితాలు, ‘ప్రేమలు’ తెలుగు వీడియో సాంగ్ చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget