Seethe Ramudi Katnam Serial Today March 1st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మోడ్రన్ మిధున.. పల్లెటూరి సీత.. పోలికేంటి? కథేంటి?
Seethe Ramudi Katnam Today Episode అచ్చం సీతలా ఉన్న మిధున ఇండియా రావడం సీత అత్తింటి నుంచి వచ్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత మహాలక్ష్మీతో నిజం నిరూపిస్తాను అప్పుడు నువ్వు బయటకు నేను లోపలికి వెళ్తామని ఛాలెంజ్ చేస్తుంది. తర్వాత సీత వెళ్లిపోతుంది. సీతని అందరూ అన్యాయంగా గెంటేశారని ఏం చేయలేకపోయానని చలపతి ఫీలవుతాడు. సీతకి కాల్ చేస్తాడు. సీత ఫోన్ కలవదు. శివకృష్ణకు ఫోన్ చేస్తాడు. ఇంట్లో జరిగిన గొడవ గురించి చలపతి శివకృష్ణ వాళ్లతో చెప్తాడు. సీతని ఇంటి నుంచి గెంటేశారని అంటాడు. సీత ఫోన్ కలవలేదని మీ దగ్గరకు వచ్చిందేమో అని కాల్ చేశానని అంటాడు.
చలపతితో శివకృష్ణ సీత ఇంకా రాలేదని చెప్తాడు. సీత లగేజ్‌తో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటుంది. మరోవైపు ఫారిన్ నుంచి ముఖర్జీ కూతురు మిధున (అచ్చం సీతలానే ఉంటుంది) ఇండియా వస్తుంది. మోడ్రన్ డ్రస్‌లో అచ్చం సీతలా ఉన్న మిధున తల్లిదండ్రులను పలకరించి ఇంటికి వెళ్తుంది. మిధునకు తల్లి దిష్టి తీస్తుంది. అమ్మాయి వచ్చింది ఇక పెళ్లి చేసేయాలి అని ముఖర్జీతో అతని భార్య చెప్తుంది. మరోవైపు శివకృష్ణ, లలితలు సీత ఇంకా రాలేదని చాలా టెన్షన్ పడతారు. ఇంతలో సీత ఇంటికి వస్తుంది. జరిగింది అంతా చలపతి చెప్తారని సీతతో తల్లిదండ్రులు చెప్తారు. అలా ఎలా గెంటేస్తారని వాళ్ల సంగతి తేల్చుతాను అని శివకృష్ణ అంటే సీత ఆపుతుంది. నేను నేరం చేశానని మామ నమ్ముతున్నాడని చెప్తుంది. మహాలక్ష్మీ చెప్పింది అబద్ధం అని నిరూపించడానికి కాస్త టైం కావాలి నాకు వదిలేయండి నేను చూసుకుంటా అంటుంది.
సీత వెళ్లిపోయిన తర్వాత ఇళ్లంతా ప్రశాంతంగా ఉందని అర్చన, గిరిలు మహాలక్ష్మీతో చెప్పి సంతోషపడతారు. చలపతి వచ్చి సీత లేదు కాబట్టి మీ ఆగడాలు ఇక పెరుగుతాయి. మొగుడు పెళ్లాల్ని విడదీశారు మీరు బాగు పడరని అంటాడు. బాగా చెప్పారని రేవతి వస్తుంది. రేవతి ఇంట్లోకి వస్తుంటే మహాలక్ష్మీ ఆపేస్తుంది. అయినా నేను ఈ ఇంటి ఆడపడుచును అని వస్తుంది. సుమతి వదిన చనిపోయి 10 రోజులు కాలేదు అప్పుడే సీతని పంపేశారు అంటుంది. దానికి చలపతి పగ తీర్చుకున్నారని చలపతి అంటే జనార్థన్ చలపతి మీద అరుస్తాడు. చలపతి సీతకి సపోర్ట్ చేస్తే నీకు నీ సొంత చెల్లి కంటే సీత ఎక్కువ అయిందా నా వల్లే ఈ ఇంట్లో ఉన్నావని గుర్తించు అని మహా అంటుంది. ఇక జనార్థన్ రేవతితో రామ్ తన గురించి పట్టించుకోవడం లేదు మాకు ఎందుకు అంటుంది. రేవతిని వెళ్లిపోమని గిరి అంటే రామ్‌తో తేల్చుకునే వరకు వెళ్లను అని అంటుంది. సీత మిమల్ని అంత తేలికగా వదలదు మీ అందరినీ అల్లాడిస్తుందని అంటుంది. రామ్ మనసు మార్చుతానని రేవతి రామ్ దగ్గరకు వెళ్తుంది.
శివకృష్ణ మార్కెట్‌కి వెళ్తే కొందరు ఆడవాళ్లు శివతో మీ కూతురు మొండిది అందుకే మొగుడు వదిలేశాడు. త్వరలో విడాకులు కూడా ఇచ్చేస్తాడు అని అంటుంది. దాంతో సీత ఇచ్చి ఇద్దరు ఆడవాళ్లని చెంప దెబ్బలు కొడుతుంది. వాళ్లని తిట్టి పంపేస్తుంది. సీతతో తండ్రి నువ్వు నిర్దోషి అని తేలే వరకు అందరూ ఇలాగే అంటారు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!





















