Seethe Ramudi Katnam Serial Today March 18th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత చూస్తుండగానే రామ్, మధులను కలిపి ఆ పని చేసిన మహాలక్ష్మి..!
Seethe Ramudi Katnam Serial Today Episode రామ్, మధుమితలు బయట నుంచి రావడంతో సీత ఎదురుగానే మహాలక్ష్మి వాళ్లిద్దరికి జంటగా దిష్టి తీయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode తన అత్తమ్మ సుమతికి ఏం జరిగిందో, మహాలక్ష్మి ఈ ఇంటికి ఎలా వచ్చారో తన అక్క మొగుడు సూర్య ఎలా అరెస్ట్ అయ్యాడో అన్ని గుట్టులను త్వరలోనే రట్టు చేస్తాను అని సీత మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది. దీంతో మహాలక్ష్మి బయపడుతూనే.. అనవసరంగా ఏదేదో వాగకు అని సీతని అంటుంది.
సీత: మీరు నాకు ఈ ఫొటోలు పంపించారు అని నేను నా భర్తకు పంపిస్తే ఏం జరుగుతుందో తెలుసా అత్త. దీన్నే పులినోట్లో తల పెట్టడం అంటారు. ఎరక్కపోయి ఇరుక్కుపోయావ్ అత్త.
మహాలక్ష్మి: నువ్వు ఏం చేస్తావో చేసుకోవే. నీ దారి నీకు ఉంటే నా దారి నాకు ఉంది.
మరోవైపు రామ్, మధుమితలు ఇంటికి వస్తారు. సీత బుంగమూతి పెట్టుకుంటుంది. చలపతి, రేవతి కూడా అక్కడికి వస్తారు. ఇక అర్చన రామ్, మధులను గుమ్మం దగ్గరే ఉండమని చెప్తుంది.
గిరిధర్: నిన్నూ మధుని పక్కపక్కన చూస్తుంటే చాలా బాగుంది రామ్.
ప్రీతి: మీ జంట సూపర్ అని మా ఫ్రెండ్స్ అంటున్నారు అన్నయ్య.
మహాలక్ష్మి: అర్చన, గిరి వాళ్లని బయటే నిల్చోబెట్టారేంటి లోపలికి రానివ్వండి.
అర్చన: ఈ జంట మీద ఎంతమంది కళ్లు పడ్డాయో మహా. దిష్టి పడుంటుంది.
ప్రీతి: దిష్టి తీయడానికే కదా బాబాయ్ అన్నయ్య, వదినల్ని బయట ఆపింది. రాజ్యం దిష్టి తీసుకురా..
రేవతి: దిష్టి తీయడానికి వాళ్లేమీ భార్యాభర్తలు కాదు కదా ప్రీతి అనవసరమైన ఓవర్ యాక్షన్ చేయకు.
అర్చన: దిష్టి తీయించుకోవడానికి భార్యభర్తలే కానవసరం లేదు రేవతి.
చలపతి: భార్యభర్తలు కానివారిని కలిపి దిష్టి తీయకూడదు చెల్లాయ్.
గిరిధర్: ఆడవాళ్ల విషయాలు మగవాళ్లం మనకు ఎందుకు బావ.
రేవతి: మగవాళ్లు ఆడవాళ్ల మాటలు వినడం మొదలు పెడితే ఇలాంటి దిక్కుమాలిని దిష్టి విషయాలే వస్తాయి.
అర్చన: ఆడదానివి అయి ఉండి మగాలు ఆడవాళ్ల మాటలు వినకూడదు అంటావ్ ఏంటి రేవతి.
మహాలక్ష్మి: తన మాట వినే మగాడు లేడు అని రేవతి బాధలే అర్చన.
చలపతి: మనసులో.. ఎంత దారుణంగా మాట్టాడుతున్నావ్ చెల్లమ్మ.
రామ్: ఇప్పుడు ఈ దిష్టి ఎందుకు పిన్ని.
మహాలక్ష్మి: మధుమిత గురించి కాకపోయినా నీకు దిష్టి తగిలితే నాకు కష్టంగా ఉంటుంది రామ్..
గిరిధర్: అవును రామ్ మళ్లీ నీకు ఏమైనా అయితే వదిన తట్టుకోలేదు రామ్.
మహాలక్ష్మి: అర్చన మధుమిత మన గెస్ట్ తనకు దిష్టి తగిలిన మనకు నష్టమే. రామ్, మధుమితలకు కలిపి దిష్టి తీయ్.
అర్చన: అలాగే మహా. అని ఇద్దరికి కలిపి దిష్టి తీస్తుంది. సీత చాలా ఫీలవుతుంది.
గిరిధర్: ఆ ఊరిలో మీకు ఏ ఇబ్బంది రాలేదు కదా రామ్.
రామ్: సూర్య మధుమిత గారి మీద చాలా కోపంగా ఉన్నాడు పిన్ని.
మహాలక్ష్మి: మగాలు అందరూ నీలా ఓపికగా అర్థం చేసుకోరు రామ్. తమ కోపాలను ఫ్రస్టేషన్‌ను అమాయకులైన భార్యల మీద చూపిస్తారు.
రామ్: చేయని నేరానికి అరెస్ట్ అయ్యానని సూర్య చాలా ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు పిన్ని.
మహాలక్ష్మి: సూర్య నేరం చేసినా చేయకపోయినా పాపం మధుమితకి శిక్ష పడింది. అటు కన్నవాళ్లు ఇటు తోడబుట్టిన చెల్లెలు మధుని అర్థం చేసుకోకుండా శత్రువులా చూస్తున్నారు.
రేవతి: మధుమితని వాళ్లకి కాకుండా చేస్తుంది నువ్వే కదా వదిన.
అర్చన: మహా మధుమితకు న్యాయం చేస్తుంది రేవతి.
చలపతి: మధుమిత ఇక్కడ ఉంటే న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ జరుగుతుంది.
గిరిధర్: ఇక్కడ మధుమితకు అన్యాయం ఎవరు చేస్తారు బావ.
రేవతి: మధుమిత ఇక్కడ ఉండటమే అన్యాయం.
మహాలక్ష్మి: మాట్లాడాల్సిన వాళ్లే మౌనంగా ఉన్నారు. మీరేంటి మాటలు మీరుతున్నారు. ఇక సీత ఏం మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నువ్వు వీళ్ల మాటలు పట్టించుకోవద్దు మధు. వీళ్లు కూడా మీ అమ్మానాన్నల్లా పరిస్థితుల్ని అర్థం చేసుకోరు.
రామ్: సూర్యని ఈరోజు కోర్టుకు తీసుకెళ్లారు పిన్ని మనం త్వరగా సూర్యని విడిపించాలి.
మహాలక్ష్మి: నేను ఆ పనిలోనే ఉన్నాను రామ్. సూర్య గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూనే ఉన్నాను. నువ్వేం వర్రీ అవ్వకు మధు అంతా నేను చూసుకుంటా. మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి.
రామ్ ఒళ్లు విరుచుకుంటూ తమ రూమ్‌కి వచ్చి బాగా టైడ్ అయ్యాను సీత గీజర్ ఆన్ చేయవా స్నానం చేస్తాను అంటాడు. సీత కోసంతో పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ విసిరేస్తుంది. రామ్ భయపడతాడు. ఏమైందని సీతని అడుగుతాడు.
సీత: ఇంతకంటే నేనేం చేయగలను వేరే రకంగా నా కోపాన్ని చూపించలేను కదా.
రామ్: కోపం ఎందుకు..
సీత: కోపం ఎందుకా.. నా భర్త బయట వరకు వెళ్తే నాకు మీ పిన్ని చెప్తే తెలిసింది. నా భర్త మా అక్కతో మా అమ్మానాన్నల కళ్లలో పడితే మా నాన్న ఫోన్ చేసి చెప్తే తెలిస్తే.. నా భర్త మా అక్కతో కలిసి పొలాల్లో తిరుగుతుంటే మరో రకంగా నాకు తెలిసింది. ఇలాంటి విషయాలు అన్నీ బయటివాళ్లు చెప్తే నాకు ఎలా ఉంటుంది.
రామ్: నీ కోపం నాకు అర్థమైంద సీత. అన్ని విషయాలకు సారీ.. ఇదంతా దురుద్దేశంతో మాత్రం చేయలేదు. నేను ఉదయం లేచే సరికి కింద హాల్‌లో మీ అక్క, మా పిన్ని ఉన్నారు. సూర్యని చూడాలి అని మీ అక్క ఏడుస్తుంది. తనని తీసుకెళ్లి సూర్యని చూపించమని పిన్ని చెప్పింది అందుకే వెంటనే వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నువ్వు మంచి నిద్రలో ఉన్నావు అని చెప్పావు. ఇక ఫోన్ చేద్దామంటే మీ ఊరిలో సిగ్నల్స్ లేవు నీకు ఆ విషయం తెలుసు కదా. అర్థం చేసుకో సీత. అక్కడ సూర్య మీ అక్క మీద సీరియస్ అయ్యాడు. మీ అక్క డల్‌గా ఉంది అని మన పొలాలు అన్నీ తిప్పి చూపిస్తే రిలీఫ్‌గా ఉంటే అలా చేశాను.
సీత: మీ పిన్ని చెప్తే చేయలేదు అన్నమాట.
రామ్: మా పిన్ని కూడా చెప్పింది అనుకో మా పిన్ని చేసింది కూడా మీ అక్క కోసమే కదా. నీకు మరీ ఇంత జలస్ పనికి రాదు సీత. సరే నీ కోపం తగ్గడానికి నేనేం చేయాలి. సీత రామ్‌ని పట్టుకొని ఏడుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావ్ సీత. సీతే రాముడి కట్నం అయితే రాముడు సీతకే సొంతం. మనల్ని ఎవరూ విడదీయలేరు.
సీత: చాలు మామ ఈ మాట చాలు
రామ్: నిన్ను హర్ట్ చేసినందుకు రేపు మనం సరదాగా బయటకు వెళ్లి వద్దాం.
ఇక మహాలక్ష్మి ఒకామెకి డబ్బు ఇచ్చి రామ్, మధుమితలే భార్యభర్తలు అని చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు అని సంతోషంగా ఉంటున్నారు అని అందరికి చెప్పమని అంటుంది. ఇక పనామే రాజ్యం సీత దగ్గరకు వెళ్లి మధుమిత గురించి వీధిలో వాళ్లు తప్పుగా అంటున్నారు అని చెప్తుంది. రామ్, మధుమితల మధ్య ఏదో సంబంధం నడుస్తుంది అని అనుకుంటున్నారు అని చెప్తుంది. ఇంట్లో మీరు కోడలిగా ఉండగా మధుమితని తెచ్చుకున్నారు అని అనుకుంటున్నారు అని చెప్తుంది. ఈ మాటలు మధు వింటుంది. రాజ్యం కూడా తనకి అనుమానంగానే ఉందని అంటే సీత పనామె చెంప పగలగొడుతుంది.
సీత: చూడక్క ఆయన గురించి మా అక్క గురించి తెలియని వాళ్లు ఏదేదో వాగొచ్చు కానీ నువ్వు ఈ ఇంటి దానివి. నువ్వు పని మనిషివి అయినా నా మనిషిగా సొంత అక్కగా చూశాను. నీ నోటి నుంచి అలాంటి మాట రావడం నాకు చాలా బాధగా ఉంది.
రాజ్యం: క్షమించు అమ్మ. పక్కింటి పని మనిషి నాకు ఇలా చెప్పడంతో..
సీత: ఇప్పుడు నేను నిన్ను కొట్టినట్లుగా నువ్వు ఆమెను కొట్టి వచ్చి ఇలా చెప్పుంటే నేను ఆనంద పడేదాన్ని. తప్పుడు కూతలు కూసిన వారి నాలుక కోసేయాలి కానీ ఆ మాటలు నా దగ్గర చెప్పడం ఏంటి. ఇకపై వీధిలో ఎవరు తప్పుగా మాట్లాడినా చెంప పగలగొట్టు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: అమృత అయ్యర్: క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ‘హనుమాన్’ బ్యూటీ