Seethe Ramudi Katnam Serial Today March 11th: సీతే రాముడి కట్నం సీరియల్: మధుమిత తన దగ్గరే ఉంటుందని సీతకు తెగేసి చెప్పిన రామ్.. అత్తాకోడళ్ల ఛాలెంజ్ అదుర్స్!
Seethe Ramudi Katnam Serial Today Episode సీత మధుమితను ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పడంతో రామ్ సీతని తిట్టి మధు తన దగ్గరే ఉంటుంది అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode మధుమితకు సీత తన అత్తయ్య మహాలక్ష్మి గురించి చెప్తుంటే రామ్ వచ్చి సీతని తిడగాడు. తన పిన్నిని అపార్థం చేసుకోవడమే కాకుండా మధుమిత మనసు మార్చేస్తున్నావ్ అని అంటాడు. ఇక సీత తన అక్క ఇక్కడ ఉండకూడదు అంటుంది.
రామ్: మధుమిత ఇక్కడే ఉంటుంది అని చెప్పాను కదా.. ఇది మా పిన్ని ఆర్డర్. మళ్లీ నువ్వు మీ అక్కకి చాడీలు చెప్పొద్దు. విసిగించకుండా వెళ్లు ఇక్కడి నుంచి..
సీత: మీకు ఇప్పుడు అర్థం కాదు ముందు ముందు మీకే తెలుస్తుంది.
రామ్: మధుమిత సారీ.. మీరు సీత మాటలు పట్టించుకోవద్దు. సీతకు మా పిన్ని మధ్య చిన్న చిన్న మిస్ అండర్‌స్టాండింగ్‌లు ఉన్నాయి. వాళ్ల మధ్య నేను నలిగిపోతున్నా. మీరు ఈ వర్రీస్ ఏం పెట్టుకోవద్దు. హ్యాపీగా ఉండండి..
మధు: తనలో తాను.. నేనుంటే మహాలక్ష్మి గారికి ఇష్టం అని తెలుసుగానీ ఆవిడ నన్ను ఇంకా రామ్ భార్యను చేయాలి అనుకుంటుందా. పెళ్లికి ముందు నా మీద రామ్‌గారికి ఉన్న ఇష్టం ఇంకా ఉందా.. ఈ ఫ్యామిలీ అంతా నన్ను సీత స్థానంలోకి రావాలి అని కోరుకుంటుందా.. సీత చెప్పింది నిజమా.. అబద్ధమా..
రామ్: సీత.. ఏంటి కోపం వచ్చిందా.. సీత నేను నీతో మాట్లాడాలి. సీత రాముడి మాట వినాలి.
సీత: రాముడు కూడా సీతని నమ్మాలి.
రామ్: చూడు సీత మధుమిత ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే సూటిగా వెళ్లిపోమని చెప్పు అంతే కానీ మా పిన్ని గురించి చెప్పడం కరెక్ట్ కాదు.
సీత: అంటే నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నారా.. ఆడపిల్ల ఏ విషయంలో అయినా అబద్ధం చెప్తుందేమో కానీ తన భర్తను వేరే అమ్మాయితో పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అని అబద్ధం చెప్పదండి. ఏ అమ్మాయి అలాంటి ఊహల్లో ఉండదు. అలాంటి కలలు కూడా కనదు.
రామ్: సరే సీత నీకు నా మీద నమ్మకం ఉందా లేదా చెప్పు. నా పేరు రామ్. ఆ రాముడిలా ఒకరే భార్య.
సీత: మీరు ఆ రాముడిలాంటి వారనే నా భయం. ఆ రాముడు తండ్రి మాట విని అడవులకు వెళ్లాడు. ప్రజల మాట విని నిండు గర్భిణి అయిన భార్యని వదిలేశాడు. దేవుడంతటి వాడే మాటలు విని సీతని వదిలేశాడు. అలాంటిది మీరు మీ పిన్ని మాటలు విని నాకు కష్టాల పాలు చేస్తున్నారు.
రామ్: సీత నువ్వు ఎటు తిరిగి మా పిన్ని దగ్గరకే వస్తున్నావు. నన్ను అర్థం చేసుకోవడం లేదు.
మహాలక్ష్మి: ఏంటి సీత ఏదో చిరాకులో ఉన్నట్లు ఉన్నావ్..
సీత: చిరాకుతో కాదు అసహ్యంతో ఉన్నాను.
మహాలక్ష్మి: తప్పు తప్పు .. రాంగ్ వర్డ్ దాన్ని అసహ్యం అనరు వికారం అంటారు. అంటే షాక్ తగిలినప్పుడు తల తిరుగుతుంది కదా అప్పుడు కలిగే ఫీలింగ్.. ఆట మొదలైంది ఇప్పుడే కదా సీత. ఈ గేమ్‌లో చాలా రౌండ్స్ ఉన్నాయి. చివరి రౌండ్ వరకు నువ్వు తట్టుకొని ఉండాలి.
సీత: నాతో మీకు డైరెక్ట్‌గా ఢీ కొట్టే ధైర్యం లేక మీరు మా అక్క, నా భర్తలను మీ మాయలో పెట్టి గేమ్ ఆడుతున్నారు. మీ ఆటను అసలు ఆటే అనరు. దొంగచాటు వ్యవహారం అంటారు. ఇదే మీ నీచబుద్ధి. మీది వెన్నుపోటు ఆట.
మహాలక్ష్మి: నాది వెన్నుపోటు అయితే మరి మీ అమ్మానాన్నలది ఏంటి. మాకు మీ అక్కని చూపించి రామ్‌ని నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తారా.. దాన్ని ఏమంటారు. ఒక కూతురు ఎవరితోనో లేచిపోతే అది కవర్ చేయడానికి ఇంకో కూతుర్ని ఇచ్చారు. మీ పరువు కాపాడుకోవడం కోసం నా పరువు తీశారు.
సీత: ఇప్పుడు ఏ పరువు కోసం మా అక్కని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు.
మహాలక్ష్మి: అప్పుడు పోయిన పరువును ఇప్పుడు తీసుకురావడానికి. అప్పుడు నా కోడలుగా మిస్ అయిన మీ అక్కని ఇప్పుడు నా కోడలు చేసుకోవడానికి నా చెంప మీద నువ్వు కొట్టిన దెబ్బను ఇప్పుడు నీ జీవితం మీద కొట్టడానికి.
సీత: చాలా క్లారిటీగా ఉన్నావ్ అత్తా.. దొంగ చాటుగా నన్ను దెబ్బతీయడానికి ఆట మొదలు పెట్టారు కదా. మీ వేళ్లు తోనే మీ కళ్లు పొడిచి ఆట నేను ముగిస్తాను.
మహాలక్ష్మి: అది నీ వల్ల కాదు. గెలిచేది నేను.
ఇక శివకృష్ణ, లలిత ఇంటికి వచ్చే సరికి ఇరుగు పొరుగు వారు మధుమిత, సీతల గురించి బ్యాడ్‌గా మాట్లాడుతాడు. పెద్దళ్లుడు జైలులో ఉంటే పెద్ద కూతురు చిన్న అల్లుడు ఇంటి దగ్గర ఉన్నాడు అని అంటాడు. ఇక శివకృష్ణ అతని కాలర్ పట్టుకుంటాడు. దీంతో లలిత విడిపించి.. ఎదురుగా అన్నారని కాలర్ పట్టుకున్నారు. వెనక అంటే ఏం చేస్తారు అని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇక జరిగినందా లలిత, శివకృష్ణలు తన తల్లి, మరదలకు చెప్పి బాధ పడతారు. తనని చూసి అందరూ నవ్వుతున్నారు అని శివకృష్ణ ఏడుస్తాడు. తనకు చనిపోవాలని ఉందని శివకృష్ణ ఏడుస్తాడు. అందరూ షాక్ అయి వాళ్లు కూడా ఏడుస్తారు. శివకృష్ణకు ధైర్యం చెప్తారు.
మరోవైపు మధుమిత అంతా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సీత అక్కకి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. మధుమిత పక్కన పెట్టేస్తుంది. దీంతో సీత అక్క నేను ఇప్పుడు చెప్పిన విషయాలు నీకు నచ్చకపోవచ్చు కానీ మనకు ఒకరికి ఒకరంటే ఇష్టం అక్క. ఇంకా తమ బంధం గురించి చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 11th: బరితెగించేసిన ముకుంద.. ఎంత పని చేశావ్ కృష్ణ, పాపం ఆదర్శ్!