Jagadhatri Serial Today August 7th: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
Jagadhatri Serial Today Episode August 7th: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది.ఆదిలక్ష్మీ మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా గట్టిగా చెప్పి సురేశ్ వెళ్లిపోతాడు.ఇంట్లో అందరూ హాయిగా కూర్చుని నవ్వుకుంటారు. చిన్నప్పుడు వైజయంతి పిన్ని తమను ఎలా చూసుకుందో గుర్తుచేసుకుని కౌషికి కన్నీళ్లు పెట్టుకుంటుంది.కమలాకర్ కూడా వదిన మంచితనాన్ని పొగడటంతో అందరూ ఎమోషనల్ అయిపోతారు. దీంతో వైజయంతి అందరికీ నచ్చిన వంటకాలు దగ్గరుండీ చేసిపెడుతుంది.తినడానికి వచ్చిన కేదార్, జగధాత్రిని నిషిక,యువరాజు అవమానిస్తారు.దీంతో జగధాత్రి యువరాజుకు గట్టిగా క్లాస్ పీకుతుంది.
కౌషికి ఇంట్లో సందడి
కౌషికి వాళ్లఅత్త ఆదిలక్ష్మీ చేసిన రచ్చకు ఇంట్లో ఒకరినొకరు మాట్లాడుకోవాడనికే వారంరోజులు పడుతుందని జగధాత్రి,కేదార్ అనుకుంటారు. ఇంతలో కౌషికి అక్కడికి వచ్చి మీరు అవన్నీ మర్చిపోండని అంటుంది. నిజం చెప్పి తప్పుచేశామేమోనని జగధాత్రి అనగా...మా అత్తయ్య తప్పు చేసింది.అందుకే క్షమాపణలు కూడా చెప్పిందని కౌషికి అంటుండగా అక్కడికి వచ్చిన సురేశ్...నిజం చెప్పకుండా ఉండాల్సింది అని అంటాడు. ఏదీఏమైనా మా అమ్మ అలా తలదించుకోవడం నేను చూడలేకపోయానని అంటాడు. మరోసారి ఇలా చేయకుండా గట్టిగా వార్నింగ్ ఇచ్చానని చెప్పి వెళ్లిపోతాడు. కేదార్,జగధాత్రి కిందకు వచ్చేసరికి ఇంట్లో అంతా సందడిగా నవ్వుకుంటుంటారు.ఇది చూసిన ధాత్రి ఎంతో సంతోషించగా....ఆదిలక్ష్మీ మాత్రం కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది.
వైజయంతి గొప్పతనం
సుధాకర్ నడవలేకపోవడంపై చాలా బాధపడుతుండగా...కమలాకర్ నేను నడిపిస్తాను అన్నయ్య అని తన భుజాలపై అన్నయ్య చేతులు వేసుకుని నడిపిస్తాడు. దీంతో సుధాకర్ కమలాకర్ చిన్నప్పుడు చేసిన చిలిపి పనుల గురించి చెప్పడంతో అందరూ పగలబడి నవ్వుతారు. అప్పుడే కమలాకర్...వాళ్ల వదిన గొప్పతనం గురించి చాలా గొప్పగా చెబుతాడు. మా వదిన మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకుందని అంటాడు. దీంతో వైజయంతి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.కౌషికి కూడా వైజయంతి చిన్నప్పుడు తమను ఎంత గొప్పగా చూసుకుందో చెబుతుంటే అందరి కళ్లు చెమ్మగిల్లుతాయి. వైజయంతి అలా చెప్పకండని చెప్పినా....కౌషికి మాత్రం ఆమె దగ్గరకు వెళ్లి నువ్వు మమ్మల్ని పిన్నిలా కాకుండా కన్న కూతుళ్లులా చూసుకున్నావు కదా పిన్ని అని అంటుంది. దీంతో వైజయంతి చాలా ఎమోషనల్ అయిపోతుంది. దీంతో కమలాకర్‌ను,కౌషికిని దగ్గరకు తీసుకుంటుంది. కమలాకర్ నీ చేతులతో వండిన వంటలు తినాలని ఉంది వదిన అని అనగానే....ఇవాళ అందరికీ నేనే నా చేతులతో చేసి పెడతానని కిచెన్‌లోకి వెళ్తుంది. వైజయంతి అత్తయ్య ఇంత మంచివారా అని జగధాత్రి అనుకుంటుంది. కచ్చితంగా ఆమెను ఎవరో మార్చేశారని....లేకపోతే ఆమె చాలా మంచిదని అంటుంది. ఆమెను ఎవరు మార్చారో తెలుసుకుంటే...మళ్లీ తిరిగి మార్చడం సులువేనని చెబుతుంది.వెళ్లి కౌషికిని అడగ్గా....చిన్నప్పుడు మా పిన్ని మమ్మల్ని చాలా బాగా చూసుకునేదని....కాకపోతే ఇదంతా పాపారాయుడు మామయ్యకు నచ్చేది కాదని చెబుతుంది.ఆయన వచ్చినప్పుడల్లా పిన్నికి లేనిపోనివి నూరిపోయడం వల్ల ఇలా మారిపోయిందని చెబుతుంది.
కేదార్‌కు అవమానం...ధాత్రి ఆగ్రహం
అందరికీ ఇష్టమైన వంటలు చేసి వైజయంతి భోజనాలకు రమ్మని పిలవడంతో అందరితోపాటు కేదార్,జగధాత్రి కూడా వస్తారు.అప్పుడు కేదార్ కుర్చీలో కూర్చుంటుండగా...నిషిక, యువరాజు లేపుతారు.ఇది చూసి కాచీ నిషికను ప్రశ్నిస్తుంది. ఎందుకు అలా చేశారని అడగ్గా....మన ఫ్యామిలీ అందరం కలిసి తింటున్నప్పుడు బయటవాళ్లు ఎందుకని పంపించామంటుంది. ఆ మాటలకు కేదార్ చాలా బాధపడతాడు. అయినా తినడానికి వచ్చినవాళ్లను ఎవరైనా అవమానిస్తారా అని అనగా....యువరాజు చెప్పడంతో నిషిక లోపలకి వెళ్లి స్టీల్ ప్లేట్ తీసుకుని వస్తుంది. అది ఇంట్లో పనివాళ్లకు పెట్టేది కదా అని సుధాకర్ అనగా...వీళ్లు కూడా ఈ ఇంటిపనివాళ్లే కదా అని అందులో అన్నం పెట్టి కిందకు విసిరేస్తాడు.వెళ్లి కిందకూర్చుని తినమని చెబుతాడు. అప్పటి వరకు ఓపిక పట్టిన జగధాత్రి...యువరాజుకు గట్టిగా క్లాస్ పీకుతుంది. కేదార్ ఈ ఇంటివారసుడని...ఆ మాటకు వస్తే నీకన్నా ముందే ఈసీటులో కూర్చోవడానికి అన్ని అర్హతలు ఉన్నవాడని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది.
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















