Krishna Mukunda Murari Serial Today March 11th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: బరితెగించేసిన ముకుంద.. ఎంత పని చేశావ్ కృష్ణ, పాపం ఆదర్శ్!
Krishna Mukunda Murari Serial Today Episode కృష్ష ముకుందని నిలదీయడంతో అందరి ముందు తనకు తన భర్త ఇష్టం లేదని మురారే జీవితం అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode మురారి ఆదర్శ్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆదర్శ్ సీరియస్ అవుతాడు. తన గదిలో ముకుంద ఎదురు చూసేది నీ కోసమే అని నీకు తెలీదా అని ప్రశ్నిస్తాడు. మురారి సైలెంట్ అయిపోయి కృష్ణ వైపు చూస్తాడు.
ఆదర్శ్: వెళ్లు ఆ గదిలో నీ కోసమే వెయిట్ చేస్తుంది వెళ్లు. ఏంట్రా ఆలోచిస్తున్నావ్ వెళ్లు నా భార్యని సంతోష పెట్టరా వెళ్లు అని ఆదర్శ్ అంటే మురారి ఆదర్శ్ చెంప పగలగొడతాడు.
మురారి: పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా..
ఆదర్శ్: ఇవి నా మాటలు కాదు. అక్కడ తను అంటున్న మాటలు. ఈ రోజు నా నోటితో అనేలా చేశావ్.
రేవతి: ఆదర్శ్ ఏం మాట్లాడుతున్నావ్ నాన్న.. తప్పు నాన్న నువ్వు అలా మాట్లాడకూడదు.
ఆదర్శ్: తప్పే పిన్ని నేను ఇలా మాట్లాడకూడదు. కానీ ఇది నా మాట కాదు. ముకుంద నోట విని నేను పిచ్చోడిని అయిపోయాను అని ఏడుస్తాడు. కాదు నేను పిచ్చోడిని కాదు అందరూ కలిసి నన్ను పిచ్చోడిని చేశారు. అందరూ అంటే మీరు కాదు పిన్ని ఇదిగో వీళ్లిద్దరూ.. ముఖ్యంగా ఈ కృష్ణ. నన్ను పిచ్చోడిని చేసింది నువ్వే కృష్ణ. నా మానాన నేను అన్నీ మర్చిపోయి ఈ జీవితమే వద్దు అని అక్కడెక్కడో మంచు కొండల్లో నా బతుకు నేను బతుకుతుంటే మీరు నా జీవితాన్ని మంటలపాలు చేశారు. ముకుంద మారిపోయింది. నీకోసమే ఆలోచిస్తుంది. నిన్నే ప్రేమిస్తుంది నీకు గుండెల్లో గుడి కట్టింది అని నన్ను మోసం చేసి నువ్వు తీసుకొచ్చావ్. కానీ ఇప్పుడు ఏమైంది నా గుండెల్లో గునపం దింపింది.
శకుంతల: అంటే ఏంట్రా ముకుంద నిన్ను గదిలో నుంచి బయటకు పంపించేసిందా..
ఆదర్శ్: ఈ ఏడుపు అంతా అదే కదా పిన్ని నీకు అర్థం కావడం లేదా. నా మెడ పట్టుకొని బయటకు పంపేయడం కాదు నా మనసును పట్టుకొని బయటకు గెంటేసింది. తన మనసులో నేను లేను అంట. నాలో కూడా ఈ మురారినే చూసుకుంటుంది అంట. చివరికి జీవితం అయినా పడక గది అయినా ఏదైనా సరే ఈ మురారితోనే పంచుకుంటుంది అంట. ఇందులో ముకుందది తప్పే లేదు. తప్పంతా మీ ఇద్దరిదే.. మనసులో ఒకరు ఉంటే ఏ ఆడపిల్ల అయినా మరొకరితో ఎలా కాపురం చేస్తుంది. ముకుంద ప్లేస్‌లో ఎవరున్నా ఇలానే చేస్తారు. ఇప్పుడు ముకుందకు మురారే కావాలి నేను కాదు.
కృష్ణ: స్టాపిట్ ఆదర్శ్ తాగి మాట్లాడుతున్నావా..
ఆదర్శ్: అంటే బాధతో మాట్లాడితే తాగి మాట్లాడినట్లా.. ఈ గుండె పగిలి అడుగుతున్న మాటలు ఇవి కృష్ణ నీకు అర్థం కావడం లేదా..
కృష్ణ: లేదు ఆదర్శ్ ఎంత కాదు అన్నా ముకుంద ఆడపిల్ల ఇలా మాట్లాడదు.
ఆదర్శ్: అంటే నేను అబద్ధం చెప్తునాన్న. ఇంకా నన్ను పిచ్చోడిని చేయాలి అని చూస్తున్నావా.. లేక తప్పించుకోవాలి అని చూస్తున్నావా.. జీవితంలో ఎవరైనా ఒక్కసారే వెర్రోడు అవుతాడు నేను రెండుసార్లు అయ్యాను. ఇంకా నన్ను వెర్రోడిని చేయాలి అంటే నా మెడలో ఓ బోర్డు తగిలించి వదిలేయండి.
కృష్ణ: ఆదర్శ్ చాలు.. అంటే ముకుంద నీతో అలా మాట్లాడటం నిజం అంటావ్. అసలు తను ఏం మాట్లాడిందో నీకు ఏం అర్థమైందో ఇప్పుడే తేలుస్తా.. ముకుంద అలా మాట్లాడటం నిజం అయితే అది కరెక్ట్ కాదు. కారణం ఏదైనా ఇలా కట్టుకున్నవాడిని అవమానించడం ఎంత తప్పో పరాయి మగాడిని కోరుకోవడం అంతే తప్పు. పోనీలే అని సర్దుకుపోయే విషయం కాదు ఇప్పుడే తేలిపోవాలి. ముకుంద రా..
ముకుంద: కృష్ణ వదులు..
కృష్ణ: రా.. ఎప్పుడో నిన్ను ఇలా పట్టుకొని నిలదీసి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు.
ముకుంద: కృష్ణ చెప్పేది నీకే వదులు.
కృష్ణ: చంపేస్తా ఇంకొక్క మాట మాట్లాడావు అంటే. ఆదర్శ్ ఏం మాట్లాడుతున్నావో విన్నావు కదా.. ఆదర్శ్ చెప్పేది నిజం కాదు అని చెప్పు. రా.. అత్తయ్య నిజాలు బయట పెడితే కుటుంబం పరువు పోతుంది అని.. పెద్దత్తయ్య మీరు ఏమైపోతారో అని ఇన్నాళ్లు నోరు మూసుకొని కూర్చొన్నాను. కానీ ఈరోజు ఎవరి మనసులో ఏముందో మొత్తం తేలిపోవాలి. ముకుంద చెప్పు ఆదర్శ్ చెప్పింది నిజమేనా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వినడానికి అసహ్యం కలిగించేలా మాట్లాడుతున్నాడు. అవన్నీ నువ్వు అన్నావ్ అంటున్నాడు. అవన్నీ నువ్వు అన్నావా..
రేవతి: అదర్శ్ చెప్పినవన్నీ అబద్దాలు అని చెప్పమ్మా.. ఆదర్శ్ నీకు ముకుంద ఇష్టం లేకపోతే లేదు అని చెప్పు నిందలు వేయకురా తను ఇంతకు ముందు లా లేదు మారిపోయింది.
ముకుంద: మారలేదు అత్తయ్య కృష్ణ చెప్పింది నిజమే.. అక్కడ నేను అతన్ని అన్నవి ఇక్కడ మీరు విన్నవి అన్నీ నిజాలే.. కానీ ఇందులో ఆదర్శ్ తప్పు ఏం లేదు నా తప్పు లేదు..
కృష్ణ: పిచ్చి వాగుడు అంతా వాగి తప్పు లేదు అంటావ్ ఏంటి అసలు నిన్ను..
ముకుంద: హేయ్.. తప్పు లేదు అంటే లేదు అంతే.. పోనీ నువ్వు చెప్పు నేను చేసిన తప్పు ఏంటి. ఆదర్శ్ అంటే ఇష్టం అని నేను ఎప్పుడైనా చెప్పానా.. తను లేకపోతే ఉండలేను అని తన కోసమే పరితపిస్తున్నాను అని పోయి తీసుకురండి అని నేను ఎప్పుడైనా చెప్పానా.. చెప్పండి అత్తయ్య మీతో ఎవరితోనైనా ఏరోజు అయినా చెప్పానా. మీ అంతట మీరే ఏదో ఊహించుకొని ఆదర్శ్‌ని తీసుకొచ్చారు.
మధు: మరి అంత ఇష్టం లేనప్పుడు వాళ్లు ఆదర్శ్ కోసం వెళ్లినప్పుడు చెప్పొచ్చుకదా.
ముకుంద: నేను ఎందుకు చెప్పాలి. అసలు వద్దు అనడానికి నాకు ఏం హక్కు ఉంది. ఇప్పటికే ఆదర్శ్ నా వల్ల తన కుటుంబానికి దూరం అయ్యాడు అన్న బాధ నన్ను వేధిస్తోంది. ఇప్పుడు వద్దు అని శాశ్వతంగా అతన్ని తన కుటుంబాన్ని దూరం చేయాలా. తను నాకు దూరంగా ఉన్నంత వరకు తన వల్ల నాకు ఏ ఇబ్బంది లేనంత వరకు తను ఇక్కడున్న ఎక్కడున్నా పెద్ద ఇబ్బంది ఏం లేదు. అయినా మీలో ఎవరైనా ఆదర్శ్ వెనక్కి వచ్చాడు అన్న ఆనందం నా ముఖంలో చూశారా.. నా మనసు ఎవరూ అర్థం చేసుకోలేదు.
మధు: నువ్వు ఎన్నైనా చెప్పు ముకుంద కానీ విషయం ఇంత వరకు తేకుండా ముందే చెప్పాల్సింది.
ముకుంద: ముందే చెప్పాను మధు. ఇదే జరుగుతుంది అని మురారికే చెప్పా. కానీ నువ్వు వినలేదు కదా.. ఇలాగే అంటుంది శోభనం అయితే అన్ని మర్చిపోతుంది అని అనుకున్నావ్ అంతే కదా. ముహూర్తాలు పెట్టేస్తే కాపురం చేసేస్తా అనుకున్నావా. నా మనసులో నువ్వు ఉంటే మరొకరితో తనువు ఎలా పంచుకుంటా అనుకున్నావ్. ఈ కథకి ఇప్పుడే ముగింపు పలుకుదాం అని నిజం చెప్పేశా. నా మనసులో ఉన్నది ఉంటున్నది ఉండబోయేది మురారియే. మురారితోనే నా జీవితం.
కృష్ణ: ముకుంద అని కొడుతుంది. ఛీ.. నువ్వు అసలు ఆడదానివేనా.. తాళి కట్టిన భర్త ఎదురుగా ఉన్నాడు. తాళి మెడలో ఉంది.
ముకుంద: చాలు ఆపు కృష్ణ. తాళి మెట్టెలు అరుంధతి నక్షత్రం ఇవన్నీ కాదు మనసు మనసులో ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం.
రేవతి: ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావ్.. ఎంతమంది ఆడపిల్లలు సర్దుకోవడం లేదు.
ముకుంద: నేను అందరి లాంటి ఆడపిల్లని కాను. మురారిని దక్కించుకోవడానికి నేను ఏమైనా చేస్తాను అని నీకు తెలుసు కదా..
కృష్ణ: తెలుసు.. నీ కళ్లు అన్నీ నా భర్త మీద ఉన్నాయి అని నాకు తెలుసు. అయినా సరే నిన్ను శత్రువులా చూడకుండా నిన్ను మార్చాలి అని చూశా అది తప్పా.
ముకుంద: తప్పే. నాకు ఏదో మేలు చేశాను అనుకుంటున్నారు కదా. కాదు బలవంతం చేశారు.
కార్తీకదీపం 2: 'కార్తీకదీపం' సీరియల్ : కొత్త ప్రోమో వచ్చేసింది - అసలు కథ ఇదే