అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today January 26th: సీతే రాముడి కట్నం సీరియల్ - అక్కను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తండ్రి మీదే కంప్లైంట్ ఇచ్చిన సీత!

Seethe Ramudi Katnam Serial Today Episode: రామ్, మధుల ఫొటో పేపర్‌లో చూసిన సీత మహాలక్ష్మిని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode: రామ్, మధుమితల ఫొటో వచ్చిన పేపర్‌ను మందు పెట్టుకొని మహాలక్ష్మి చూస్తూ ఉంటుంది. ఈ పాటికి తాను వేసి స్కెచ్ వల్ల అంత గంధరగోళంగా ఉండుంటుందని.. శివకృష్ణకు బీపీ పెరిగి, సూర్య మతి తప్పి గొడవ గొడవ జరుగుతుందని ఆ రిజల్ట్ కాసేపట్లో తన చెవిలో పడుతుంది అని మహా అనుకుంటుంది. ఇంతలో సీత కిందకి దిగడం చూసి నువ్వు ఇంకా రాలేదా అనుకున్నాను వచ్చేశావా.. రా వచ్చి పేపర్ చూడు అని అనుకుంటుంది.

సీత: సీత పేపర్‌లో ఫొటో చూసి... ఏంటి ఇది అత్తయ్య. ఈ పేపర్‌లో ఈ ఫొటో ఏంటి. పేపర్‌లో ఈ ఫొటో మీరే వేయించారు కదా..
మహాలక్ష్మి: ఏం మాట్లాడుతున్నావ్.. నేను వేయించినట్లు ఫొటో కింద నా పేరు రాసిఉందా.. 
సీత: ఇది మీ పనే అని నాకు కచ్చితంగా నాకు తెలుసు. ఇలాంటి నీచమైన పని మీరు తప్ప ఇంకా ఎవరూ చేయరు. మర్యాదగా నిజం ఒప్పుకోండి. 
రామ్: ఏమైంది సీత ఎందుకు అరుస్తున్నావ్.
సీత: మీ పిన్ని ఏం చేసిందో చూడండి.. 
మహాలక్ష్మి: రామ్ పేపర్‌లో ఆ ఫొటో నేనే వేయించాను అని సీత నన్ను అనుమానించి నామీద అరుస్తుంది. 
సీత: అనుమానం కాదు అదే నిజం. అలాంటి పని మీరు తప్ప ఎవరూ చేయరు. ఎవరికీ ఆ అవసరం లేదు.
మహాలక్ష్మి: నాకు మాత్రం ఆ అవసరం ఏముంది.
సీత: అదే మీ ప్లాన్ కాబట్టి.
అర్చన: ప్లాన్ ఏంటి సీత.. ప్రతీ సారి మహానే ఎందుకు అనుమానిస్తున్నావ్.. ఇంట్లో బయట ఏం చేసినా  అది మహా చేసినట్లేనా..
సీత: ఆవిడకు తెలీకుండా ఎక్కడ ఏం జరగదు. 
మహాలక్ష్మి: అంటే ఏంటి నీ ఉద్దేశం పేపర్ వాళ్లకి ఆ ఫొటో నేనే ఇచ్చాను అంటావా.. 
చలపతి: నువ్వు కాకపోతే వేరే వాళ్లకి అంత ధైర్యం ఎక్కడ ఉంటుంది. నువ్వు కాదు అని ఓ క్లారిటీ ఇవ్వు చెల్లయ్..
మహాలక్ష్మి: నేను కాదు నాకు ఆ అవసరం లేదు..
రామ్: ఎవరైనా వేసుండొచ్చు సీత అనవసరంగా మా పిన్నిని నిందించకు.
సీత: పేపర్‌లో వేయడానికి మీరు మా అక్క ఉన్న ఫొటోనే దొరికిందా.. మీరు జంట అని వాళ్లు ఎలా అనుకుంటారు. మీ భార్య నేను అని వాళ్లకి తెలీదా..
అర్చన: తెలిస్తే వాళ్లు మీ ఫొటోనే వేస్తారు. 
 మహాలక్ష్మి: చూడు రామ్ తను ఎలా మాట్లాడుతుందో.. రిసెప్షన్‌లో తను నీ పక్కన ఉండి ఉంటే ఈ ప్రాబ్లమ్‌ వచ్చి ఉండేదే కాదు కదా. తను తప్పు చేసి నన్ను అంటుంది. 
సీత: తప్పు నాది కాదు మీది.. మీ అందరిదీ.. 
రామ్: షట్ అప్ సీత.. ఇంకొక్క మాట ఇలా మాట్లాడి పిన్నిని అవమానించకు. పిన్ని హర్ట్ అవుతుంది.
సీత: మీకు ఎప్పుడూ మీ పిన్ని గురించే బాధ నా గురించి కనిపించదా.. ఈ తప్పు ఎవరు చేసినా ఆ శిక్ష అనుభవిస్తుంది మా అక్క. ఈయన పక్కన మా అక్క ఫొటోని చూసిన వాళ్లు మా అక్కని ఎన్నెన్నిమాటలు అంటున్నారో మీకు తెలీదు. అక్క ఎంత ఇబ్బంది పడిందో మీకు అర్థం కాదు. ఒక్క సారి మా అక్క స్థానంలో ఉండి ఆలోచించండి.. ఈ సమస్యకు నేనే పరిష్కారం వెతుక్కుంటాను. ఏం చేయాలో నేనే చేస్తాను.. 
 
మరోవైపు మధుమిత తన తండ్రి, భర్త మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తుంది. అప్పుడే సీత అక్కడికి వస్తుంది. సీతని చూసి మధు ఏడుస్తుంది. తనకు బతకాలి అని లేదు అని మధు ఏడుస్తుంది.

మధు: ఇది చిన్న విషయం కాదు సీత.. నాన్న సూర్య ఎంత దూరం వెళ్లారో నీకు తెలీదు. నేనే ఇందంతా కావాలని చేశాను అంట. నీ స్థానం కోసం ఆశ పడ్డాను అంట. నిన్ను ఇబ్బంది పెట్టడానికే ఇందంతా చేశాను అంట. ఇంకా ఎన్నెన్నో అన్నారు.
సీత: మనం అక్కాచెల్లెల్లం అక్క. నన్ను నువ్వు ఎలా ఇబ్బంది పెడతావు. చిన్నప్పటి నుంచి నీవి అన్నీ నువ్వు నాకు ఇచ్చావు. నాకు ఇవ్వడం తప్ప నా నుంచి నీకు తీసుకోవడం తెలీదు.
మధు: ఈ  విషయం నాన్నకు ఎందుకు తెలీదు సీత. చిన్నప్పటి నుంచి మనం ఎలా ఉన్నామో నాన్న చూస్తూనే ఉన్నారు కదా.. నాన్న అలా నిందలు వేయడం వల్ల సూర్య నన్ను తిట్టాడు. నాన్న అలా అన్నప్పుడు సూర్య అనడంలో తప్పు ఏం ఉంది. కన్న తండ్రి కట్టుకున్న భర్త నన్ను అర్థం చేసుకోనప్పుడు నేను ఏం చేయాలి.
సీత: నీకు నేను ఉన్నాను కదా అక్క. ఈ సమస్యను నేను తీరుస్తాను. నాన్నతో సూర్య బావతో నేను మాట్లాడుతాను.
మధు: నువ్వు మాట్లాడితే వాళ్లు వినరు. 
సీత: పద అక్క నేను మాట్లాడుతా.. నేను నాన్నతో మాట్లాడుతా.. పద.. వెళ్దాం.. రా అక్క.. ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. వాళ్లని చూసి శివకృష్ణ షాక్ అవుతారు.
శివకృష్ణ: మనసులో నేను మధుని తిట్టాను అని నా మీదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా..
సీత: పరిచయం చేసుకుంటుంది. ఈ మధ్యనే మా అక్క ప్రేమ పెళ్లి చేసుకుంది. అది మా ఇంట్లో వాళ్లకు నచ్చక సందర్భం దొరికిన ప్రతీ సారి మా ఇంట్లో వాళ్లు సూటిపోటి మాటలతో వాళ్లను హింసిస్తున్నారు. ఇంటికి వచ్చి మరీ గొడవ చేస్తున్నారు మా నాన్న మేడం. 
పోలీస్: తనొక్కడే ఇబ్బంది పెడుతున్నాడా.. ఇదివరకు ఈ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారా..
సీత: మా నాన్న ఒక్కడే ఇబ్బంది పెడుతున్నాడు మేడం మిగతా అందరూ ఏం అనడం లేదు. మా నాన్న మారుతాడు అని ఎదురు చూశాం మారక పోగా మితి మీరి పోతున్నాడు అని సీత చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: నాగ పంచమి సీరియల్ జనవరి 25th: మోక్షని చీదరించుకున్న పంచమి.. ఫణేంద్రకు ఓ అవకాశం ఇచ్చిన నాగదేవత!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Embed widget