Naga Panchami Serial Today January 25th: మోక్షని చీదరించుకున్న పంచమి.. ఫణేంద్రకు ఓ అవకాశం ఇచ్చిన నాగదేవత!
Naga Panchami Serial Today Episode తన కోసం వచ్చిన మోక్షని పంచమి తిట్టి పంపించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode: పంచమి మోక్షని తలచుకొని ఏడుస్తుంది. ఇక సుబ్బు అక్కడికి వస్తాడు. మోక్ష ఇక ఎప్పటికీ తనకు దగ్గర కాలేడు అని చెప్పుకొని పంచమి బాధ పడుతుంది. దానికి సుబ్బు నువ్వు ప్రేమతో పెంచుకునే చెట్టు ఎవరైనా నరికేస్తే చూస్తూ ఉండగలవా.. కాయలు కాయకపోయినా ఆ చెట్టు చల్లటి నీడని ఇస్తుంది. అలాంటిదే మీరిద్దరూ ఒకరి మీద ఒకరు పెంచుకున్న ప్రేమ. అందుకే మీరు ఒకర్ని వదిలి ఒకరు ఉండలేరు అని సుబ్బు అంటాడు. మేం కలవము మేం కలవము అని పంచమి ఏడుస్తుంది. చూస్తే నిద్రలో పంచమి కలవరిస్తుంటుంది. ఇక గౌరి పంచమిని నిద్ర లేపుతుంది.
గౌరి: ఏంటమ్మా కలవరిస్తున్నావు. నువ్వు ఇంత బలవంతంగా దూరం చేసుకున్నా మోక్షాబాబుని మర్చిపోలేవు పంచమి.
పంచమి: తప్పదు అమ్మా.. నేను మర్చిపోకపోయినా పర్లదు కానీ మోక్షాబాబు నన్ను మర్చిపోవాలి. తన జీవితంలో నేను ఒక కలగా ఉండాలి.
గౌరి: నీ జీవితం నిజం పంచమి అబద్ధం కాదు కల అనుకోవడానికి.. కలలా ఒకరాత్రితో అయిపోదు తల్లీ. జీవితం అంటే చాలా నిద్రలేని రాత్రలు గడపాలి. మోక్షాబాబు గురించి ఒకసారి కాదు అమ్మా వందసార్లు అయినా ఆలోచించు. తను లేకుండా నువ్వు బతకలేవు.
పంచమి: నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను అమ్మా ఇక మార్చుకోలేను.
నాగదేవత: (నాగదేవతకు ధ్యానం చేయగా నాగదేవత ప్రత్యక్షం అవుతుంది.) నీ కఠోర దీక్ష నన్ను కదిలించింది యువరాజా. నీ జపం నన్ను ప్రసన్నురాలిని చేసింది.
ఫణేంద్ర: ధన్యుడిని మాతా. నేను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి ధ్యానం చేశాను మాతా. నాగలోకం ప్రవేశం కోసం నేను అభ్యర్థించను మాతా. నా నిజాయితీని నిరూపించుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మన యువరాణి రూపంలో ఎవరో నన్ను మోసం చేశారు. ఎన్నో మంత్ర తంత్ర విద్యలు బాగా తెలిసిన వారే అలా చేయగలరు మాతా. వారు ఎవరో నన్ను యువరాణిని ఎందుకు మోసం చేశారో తెలుసుకోవాలి. శత్రువు శక్తులను ఎదుర్కొవాలి అంటే నాకు కొన్ని శక్తులు అవసరం అవుతాయి మాతా. అందుకోసమే మిమల్ని వేడుకున్నాను.
నాగదేవత: నీ మాటల్లో నాకు నిజాయితీ కనిపిస్తుంది యువరాజా. అందుకే నమ్ముతున్నాను.
ఫణేంద్ర: అదృష్టవంతుడిని మాతా. నాకు ఇష్టరూప శక్తులు ప్రసాదిస్తే.. వీలైనంత త్వరగా ఆ శత్రువుని పట్టుకొని నా నిజాయితీ నిరూపించుకుంటాను మాతా. అప్పుడు మీరు నన్ను నమ్మితేనే నాకు యువరాణికి నాగలోక ప్రవేశం కల్పించండి.
నాగదేవత: అలాగే యువరాజా. భూలోకంలో నీ శక్తులను అపవిత్రం చేయకూడదు. అధర్మానికి ఉపయోగించకూడదు. నాగలోక ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేయకూడదు. వీలైంత త్వరగా నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. మరో విషయం ఫణేంద్ర నీ మీద ఎప్పుడూ నిఘా ఉంటుంది. నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా.. ఆ మరుక్షణమే నీకు ఇచ్చిన శక్తులు వెనక్కి తీసుకుంటాను. అలాగే తప్పునకు తగిన శిక్ష ఉంటుంది.
ఫణేంద్ర: అలాగే మాత ఎక్కడ తప్పు చేయను. మీరు విధించిన వాటికే కట్టుబడి ఉంటాను. నాగ దేవత శక్తులు ప్రసాదిస్తుంది.
పంచమి: మోక్ష వచ్చి పంచమిని ఆపి చేయి పట్టుకోవడంతో.. నేను ఇలా బతకడం కూడా మీకు ఇష్టం లేకపోతే చెప్పండి మోక్షాబాబు ఈ లోకాన్నే వదిలేసి వెళ్లిపోతాను.
మోక్ష: నన్ను బతికించింది నువ్వు నాకు దూరం అవ్వడానికా..
పంచమి: మీ ప్రాణాలు కాపాడింది మేఘన.
మోక్ష: కానీ నేను బతికింది మాత్రం నీ కోసమే పంచమి. లేకపోతే నాకు ఈ ప్రాణాలు అవసరం లేదు.
పంచమి: మీరు పుట్టింది నా కోసం కాదు. మీ జీవితంలోకి నేను మధ్యలో వచ్చిన దాన్ని.
మోక్ష: కానీ నూరేళ్లు కలిసి బతుకుదాం అని పెళ్లి చేసుకున్నాం.
పంచమి: అప్పుడు నాకు నేను పంచమిగానే తెలుసు. నాలో ఓ నాగకన్య దాగి ఉందని నాకు తెలీదు.
మోక్ష: నేను పెళ్లి చేసుకుంది పంచమిని నువ్వు నాతో ఉండటం ధర్మం.
పంచమి: నేను నాగకన్యని మాత్రమే ఆ పంచమి చచ్చిపోయింది. నేను మీకు భార్యగా తగను. మీకు ఏ సుఖం సంతోషం ఉండదు. పిల్లాపాపలు లేని మోడు బారిన జీవితం అనుభవించాలి.. ఆనందం అనేమాట మర్చిపోవాలి.
మోక్ష: మనిషిని చూసి ఇష్టపడిన వారే ఇవన్నీ కోరుకుంటారు పంచమి. మనసును కోరుకున్నవారికి ఇవన్నీ అవసరం లేదు. పక్కన నడిస్తే చాలు. వాళ్లకు కాలం తెలీకుండా గడిచిపోతుంది. వాళ్లకు ఈ లోకమే అక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా ఏ లోకం వెళ్లినా కలిసే వెళ్లిపోతారు. ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో అయినా మనం అన్నీ కలిసి అనుభవిస్తాం పంచమి. కానీ ఈ జన్మలో విడిపోతే మళ్లీ మనం ఏ జన్మలో కలవం.
పంచమి: మీతో ఆనందం పంచుకోవడానికి మీకు చాలా మంది ఉన్నారు. నాకోసం వాళ్లందరినీ నిరాశ పరచడం న్యాయం కాదు.
మోక్ష: అందుకు నేను అనే వాడిని ఉండాలి కదా పంచమి. నువ్వు నా పక్కన లేకుండా నేను వెళ్లడం అనేది జరగదు.
పంచమి: మనం దూరం అయిపోయి అప్పుడే ఒకరోజు గడిచిపోయింది. ఇక రెండు రోజుల తర్వాత అది అలవాటు అయిపోతుంది. తర్వాత మనల్ని మనం మర్చిపోతాం. ఇక మీరు బయల్దేరండి.
మోక్ష: వచ్చింది ఒంటరిగా తిరిగి వెళ్లడానికి కాదు. నువ్వు నాతో వస్తున్నావు పంచమి.
పంచమి: అది ఈ జన్మలో జరగదు.
మోక్ష: నువ్వు వచ్చిన దాకా నేను ఇక్కడి నుంచి కదలను.
పంచమి: సరే ఓ పని చేయండి.. రేపు గుడి దగ్గరకు రండి అక్కడ నా అస్థికలు ఉంటాయి తీసుకెళ్లిపోండి.
మోక్ష: పంచమి..
పంచమి: మీరు ఇక్కడే ఉంటే జరగబోయేది అదే..
మోక్ష: నా మాట విను పంచమి నేను సంతోషంగా ఉండాలి అని నువ్వు నాకు దూరం అవుతున్నావు. కానీ నేను ఆ సంతోషాన్ని దగ్గరకు రానివ్వను. నువ్వు మళ్లీ తిరిగివస్తేనే నాకు సంతోషం.. పంచమీ..
మోక్ష కనిపించడం లేదని కారు కూడా లేదని భార్గవ్ మీనాక్షి, బామ్మలకు చెప్తాడు. మీనాక్షి వరుణ్‌ని ఇంట్లో చూడమని చెప్తుంది. ఇక మోక్ష లేడని వరుణ్ చెప్పడంతో జ్వాల పంచమి దగ్గరకు వెళ్లి ఉంటాడని చెప్తుంది. దీంతో మోక్షకు ఫోన్ చేయమని భార్గవ్‌తో మోక్ష తండ్రి చెప్తాడు. అయితే వైదేహి అవసరం లేదు వెళ్లిన వాడు గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తాడు అని అంటుంది.
వైదేహి: పంచమి దగ్గరకు కూడా రానివ్వదు. మళ్లీ నాతో చీవాట్లు తినాలి అని అనుకోదు. పంచమికి పౌరుషం ఎక్కువ. పంచమిని అలా బెదిరించకపోతే మోక్ష మనకు దక్కడు. నాకు నా కొడుకు ముఖ్యం.
శబరి: వైదేహి పంచమి కూడా ఒక తల్లి బిడ్డే. తన వైపు ఏదైనా తప్పు ఉంటే మనకు తన మొఖం కూడా చూపించడానికి ఇష్టపడదు పంచమి.
మీనాక్షి: మోక్ష, పంచమిల మధ్య ఏవైనా పొరపొచ్చాలు ఉంటే వాళ్లిద్దరే తేల్చుకుంటారు వదినా. నువ్వు తిట్టడం వల్ల బలవంతంగా వాళ్లిద్దరినీ విడదీసినదానివి అవుతావు.
వైదేహి: అవును అవుతాను అయితే ఏంటి. పంచమి మోక్షతో తెగతెంపులు చేసుకోవడమే నాకు కావాలి. అప్పుడే మోక్ష నా మాట వింటాడు.
పంచమి: నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఫణేంద్ర. నావల్ల నువ్వు ఈలోకంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఫణేంద్ర: మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయి పంచమి. నాగదేవత నన్ను కరుణించింది. కఠోర దీక్షతో నాగదేవతను వేడుకున్నాను పంచమి. ప్రత్యక్షమై చెప్పింది శాంతంగా వినింది. మన తప్పలేదు అని నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమని వేడుకున్నాను. సరే అని ఒప్పుకుంది. కొన్ని షరతులు విధించి నాకు మళ్లీ ఇష్టరూప శక్తులు ప్రసాదించింది.
పంచమి: చాలా సంతోషమైన వార్త చెప్పావు ఫణేంద్ర. ఇప్పుడు నాకు కొంచెం ఊరట లభించింది.
ఫణేంద్ర: మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి పంచమి. మేఘన ఎవరు ఏంటో తెలుసుకోవాలి. లేదంటే నువ్వు కోరుకున్నట్లు మోక్ష సంతోషంగా ఉండడు. నీ త్యాగం నీ కష్టం వృథా అయిపోతుంది. నీ రూపంలో నా దగ్గర మంత్రం చెప్పించుకొని నాగలోకం వెళ్లగలిగింది అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలి.
పంచమి: నాకు తెలుసు ఆ శక్తి కరాళిది. ఈ లోకంలో నాకు శత్రువులు ఎవరైనా ఉంటే అది కరాళి మాత్రమే. మోక్షను నాకు దూరం చేస్తాను అని నాతో శపథం. ఇవన్నీ ఆ కరాళి మాయలే.
ఫణేంద్ర: నువ్వు నా పక్కన ఉండి సాయం చేస్తే నేను ఆ కరాళిని పట్టుకొని నాగదేవత దగ్గర నా నిజాయితీని నిరూపించుకుంటాను పంచమి. అప్పుడు నీ మీద పడ్డ నింద కూడా తొలగిపోతుంది. నాగలోకం వచ్చింది నువ్వు కాదని నాగదేవతకు తెలియాలి.
పంచమి: నాగదేవత కోసం కాకపోయినా నేను మోక్షాబాబు కోసం ఆ కరాళి అంతు చూడక తప్పదు ఫణేంద్ర. తప్పకుండా వెళ్దాం వెళ్లి ఆ కరాళి పనిపడదాం.
గౌరి: పంచమి..
పంచమి: అమ్మా నేను పట్నం వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఆ కరాళి పని పట్టాలి. సరే అమ్మా నువ్వు జాగ్రత్త. మేం కరాళి గురించి తెలుసుకొని వెంటనే వచ్చేస్తాం. పద ఫణేంద్ర. మరోవైపు మేఘన మోక్ష ఇంట్లో పూజలు చేసి అందర్ని తన వైపునకు తిప్పుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: కృష్ణ ముకుంద మురారి జనవరి 25th: ఆదర్శ్‌కు గోరుముద్దలు తినిపించిన భవాని.. భర్త ఆలోచనల్లో ముకుంద