Seethe Ramudi Katnam Serial Today January 20th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతని మర్డర్ చేయడానికి కిరాయి మాట్లాడిన మహాలక్ష్మీ.. కుడి భుజం మీద బల్లి!
Seethe Ramudi Katnam Today Episode సీతని చంపడానికి మహాలక్ష్మీ రౌడీలతో మాట్లాడటం సీత మీద బల్లి పడి అపశకునంలా భావించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Seethe Ramudi Katnam Serial Today January 20th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతని మర్డర్ చేయడానికి కిరాయి మాట్లాడిన మహాలక్ష్మీ.. కుడి భుజం మీద బల్లి! seethe ramudi katnam serial today january 20th episode written update in telugu Seethe Ramudi Katnam Serial Today January 20th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతని మర్డర్ చేయడానికి కిరాయి మాట్లాడిన మహాలక్ష్మీ.. కుడి భుజం మీద బల్లి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/20/10867cff11cecb62c3e2b3e9a632de481737346409491882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Seethe Ramudi Katnam Serial Today Episode సీత రామ్‌కి టిఫెన్ పెడుతుంది. రామ్ సీతకి ముద్దు అడుగుతాడ. ఇద్దరూ అన్యోన్యంగా ఉండటం మహాలక్ష్మీ, అర్చన చూస్తారు. ఇద్దరూ తిట్టుకుంటారు. ఇద్దరూ తెగించేస్తున్నారని పట్టపగలు ఈ సరసాలు ఏంటి అని అర్చన అంటుంది. ఇక రామ్ సీతతో సాయంత్రం త్వరగా వస్తాను బయటకు వెళ్దాం రెడీగా ఉండు అని చెప్తాడు. తర్వాత రామ్ సీతని దగ్గరకు తీసుకొని మళ్లీ ముద్దు పెట్టుకోబోతే సీత కుడి భుజం మీద బల్లి పడుతుంది.
సీత అరుస్తుంది. విద్యాదేవి వచ్చి ఏమైందని అడిగితే బల్లి పడిందని చెప్తే టీచర్ అలా పడకూడదు అరిష్టం అని అంటుంది. సీత భయపడుతుంటే మీరు ఇంకా భయపెడతారేంటి? ఏం కాదు అని అంటాడు. మీ జంటకు దిష్టి పడిందని దిష్టి తీస్తానని టీచర్ ఇద్దరికీ దిష్టి తీస్తుంది. విద్యాదేవి మహాలక్ష్మీ, అర్చనను చూసి తిడుతుంది. రామ్ సీతతో ఏం కాదు అని చెప్పి ఆఫీస్‌కి వెళ్తాడు. మహాలక్ష్మీ ప్రీతి, ఉషలకు ఫోన్ చేసి కాన్సిఫెర్స్ కలుపుతుంది. అర్చన, మహాలక్ష్మీ ఇద్దరూ సీత చేసిన పెళ్లి గురించి, ఆఫీస్‌లో తన స్థానం గురించి చెప్తారు. సీత మీద పగ తీర్చుకోవాలని అందుకు ఇద్దరినీ వెంటనే రమ్మని వచ్చాక వాళ్లు ఏం చేయాలో అది చెప్తుంది. సీత షాపింగ్ చేసి రోడ్డు మీద నడుచు కుంటూ వెళ్తుంటే రేవతి కలుస్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు. మహాలక్ష్మీని టీచర్‌తో కలిసి ఆడుకుంటున్నానని సీత చెప్తుంది. మహాలక్ష్మీని తక్కువ అంచనా వేయొద్దని ఏదో ప్లాన్‌లోనే ఉంటుందని రేవతి చెప్తుంది. తర్వాత రేవతి వెళ్లిపోతుంది.
సీత: రేవతి పిన్ని చెప్పింది నిజమే నేను అంతలా అవమానిస్తూ దెబ్బ మీద దెబ్బ తీస్తుంటే మహాలక్ష్మీ అత్తయ్య చూస్తూ ఊరుకోదు కచ్చితంగా ఏదో ప్లాన్ వేస్తూనే ఉంటుంది. ఈ సారి ఎలాంటి స్కెచ్ వేస్తుందో
అర్చన: ప్లాన్‌లో తర్వాత స్టెప్ ఏంటి మహా.
మహాలక్ష్మీ: చెప్తాను నీ ఫోన్ ఇవ్వు. అని రౌడీలకు కాల్ చేసి ఒకమ్మాయిని కిడ్నిప్ చేసి తర్వాత మర్డర్ చేయాలి అని చెప్తుంది. అర్చన షాక్ అయిపోతుంది.
మహాలక్ష్మీ ఆయనతో డీల్ చేసుకొని సీతని కిడ్నాప్ చేసి చంపాలని చెప్తుంది. అతనికి సీత ఫొటో పంపిస్తాను అని అంటుంది. అర్చన సెల్కే ఫోన్ చేయమని అంటుంది. ఇక రౌడీ డబ్బులు విషయంలో పక్కాగా ఉంటానని అంటాడు. ఇక అర్చన మహాలక్ష్మీతో ఈ సారి సీత చావు పక్కా అని దీపం ఆరిపోయినప్పుడే ఆ విషయం అర్థమైందని మనకి ఇక ఏ అడ్డూ ఉండదని మహాలక్ష్మీ తో చెప్తుంది. మరోవైపు సీత రెడీ అయి రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా రామ్ రాలేదు ఏంటా అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ తీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ని అనుమానిస్తూ ప్రశ్నించిన దీప.. దాసు దుస్థితికి ఏడుస్తున్న పారు.. జ్యో దొరికిపోతుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)