Seethe Ramudi Katnam Serial Today February 19th: సీతే రాముడి కట్నం సీరియల్: మహాలక్ష్మి రామ్‌కి ఇచ్చిన డబ్బులు దొంగతనం చేసిన సీత.. సుమతి అన్నే సీత తండ్రి శివకృష్ణ!
Seethe Ramudi Katnam Serial Today Episode రామ్‌కి మహాలక్ష్మి ఇచ్చిన డబ్బు సీత తీసేయడంతో మహాలక్ష్మి సీతని ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode: మహాలక్ష్మికి జలజ ఫోన్ చేస్తుంది. మధుమిత మీద సూర్యకు సూర్య మీద మధుమితకి రకరకాలు చెప్పి గొడవలు పడేలా చేశాను. కానీ ఇప్పుడు కథ మొదటికి వచ్చిందని జలజ మహాలక్ష్మికి చెప్తుంది. సూర్య మధుమిత ఇప్పుడు సంతోషంగా ఉన్నారని చెప్తుంది జలజ.
మహాలక్ష్మి: ఉద్యోగం వచ్చింది అంటే కదా..
జలజ: అంతే కాదు మేడం.. మధుమిత అమ్మానాన్నలు ఇంటికి వచ్చారు. సూర్య, మధుమితలతో సరదాగా మాట్లాడారు. చూస్తుంటే అందరూ కలిసిపోయినట్లు ఉన్నారు మేడం. అదే గాని జరిగితే మీరు అనుకున్నవన్నీ జరగవు మేడం. అందుకే భయం వేసి మీకు వెంటనే ఫోన్ చేశాను. ఏం చేయమంటారు మేడం.
మహాలక్ష్మి: ఏం పర్లేదు నేను చూసుకుంటాను.
జనార్థన్: ఏంటి మహా ఆలోచిస్తున్నావ్. సీత గురించా..
మహాలక్ష్మి: కాదు మధుమిత గురించి. అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది. కానీ ఆ శివకృష్ణ కోపం మర్చిపోయి మధుమితతో కలిసిపోయేలా ఉన్నాడట. కూతుర్ని అల్లుడ్ని మంచి చేసుకోవాలని చూస్తున్నాడు.
జనార్థన్: అలా చేస్తే మధుమిత మన కోడలు కావడం కష్టం కదా.. నువ్వు అనుకున్నది జరగదు కదా.. శివకృష్ణ వాళ్లకు దగ్గర అయిపోతే నువ్వు అనుకున్నది జరగదు కదా..
మహాలక్ష్మి: ఎలా అయినా నేను అనుకున్నది జరిగి తీరాలి. జరిగేలా చేస్తాను. నేను అనుకున్నది సాధ్యమైన వరకు ఎంత దూరం అయినా వెళ్తాను. ఎవరిని అయినా ఇబ్బంది పెడతాను. ఆల్రెడీ నేను స్కెచ్ వేశాను. ఈ సారి నేను కొట్టే దెబ్బ సీతకు కాదు కాదా దాన్ని పుట్టించిన దేవుడికి కూడా తెలీదు. ఇప్పటికే సీతకు కొన్ని ఛాన్స్‌లు ఇచ్చాను. ఈసారి సీతకు ఛాయిస్ లేని చావు దెబ్బ కొడతాను. అది సీత ఊహకు అంచనాలకు అందనిది. సీతని అంతం చేసేది.
సీత టైలరింగ్‌కు సంబంధించిన వస్తువులను స్టోర్ రూంలో దాయడానికి వెళ్తుంది. అక్కడ తన అత్త సుమతి డైరీ చూస్తుంది. అత్తమ్మ డైరీ అంటూ గుండెలకు హత్తుకుంటుంది. దాన్ని చదవడం ప్రారంభిస్తుంది. అందులో న అన్నయ్య, అమ్మ అంటే ప్రాణం అని రాసుంటుంది. తన అన్న శాశ్వతంగా దూరం అయ్యానని కలవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అని రాసి ఉంటుంది. తర్వాత పేజీలు డైరీలో ఉండవు.
సీత: తర్వాత పేజీలు చింపేసున్నారు. ఎవరు చింపుంటారు. మీ అన్నయ్య ఎవరు అత్తమ్మ. ఆయన పేరు ఏంటి ఎక్కడ ఉంటారు. మీరిద్దరూ ఎందుకు విడిపోయారు. ఈ డైరీ చదివితే మీ గురించి పూర్తిగా తెలుస్తుంది అనుకున్నాను. ఎలా అయినా మీ వివరాలు తెలుసుకుంటా. ఇక డైరీలో చింపేసిన ఓ పేజీ కింద పడి ఉంటుంది. అందులో అమ్మ గోదావరి, అన్నయ్య శివకృష్ణ, వదిన లలిత అంటూ రాసి ఉంటుంది. చూస్తే సుమతి అన్నయ్య సీత తండ్రే.
మహాలక్ష్మి: రామ్.. నిన్ను నీకు మనీ ఇచ్చాను కదా ఆ డబ్బులు తీసుకొని రా ఆఫీస్‌కు వెళ్లాలి.
రామ్: సరే పిన్ని.
చలపతి: మనసులో.. నిన్న రామ్‌కి డబ్బులు ఇచ్చింది ఈరోజు తీసుకుంటుంది. కొంపతీసి మహాలక్ష్మి రాత్రికి రాత్రి ఏ కుట్రా చేయలేదు కదా..
మహాలక్ష్మి: ఆఫీస్‌లో సర్వెంట్స్‌కి ఐదు లక్షలు, రాధాకృష్ణకు రెండు, మురారికి మూడు లక్షలు ఇవ్వాలి ఎవరి మనీ వారికి విడివిడిగా తీసి పెట్టు.
రామ్: ఆరు లక్షలే ఉన్నాయి పిన్ని..
మహాలక్ష్మి: అదేంటి రామ్ నేను నీకు ఇచ్చింది పది లక్షలు కదా మిగతా నాలుగు లక్షలు ఏమయ్యాయి.
రామ్: తెలీదు..
రేవతి: నిన్న రామ్‌కి నిజంగా పది లక్షలు ఇచ్చారా వదినా..
మహాలక్ష్మి: ఏంటి నీ ఉద్దేశం రేవతి ఆరు లక్షలు ఇచ్చి పది లక్షలు అంటున్నాను అనా..
రేవతి: మరి నాలుగు లక్షలు ఏమయ్యాయి.
జనార్థన్: అది రామ్ చెప్పాలి. నైట్ డబ్బులు ఎక్కడ పెట్టావా రామ్.
రామ్: మా బీరువాలో పెట్టాను డాడ్.
అర్చన: నువ్వు డబ్బు దాచడం సీత ఏమైనా చూసిందా రామ్.
రేవతి: అంటే సీతని అనుమానిస్తున్నారా..
చలపతి: మనసులో.. సీతని దొంగని చేయాలి అని మహాలక్ష్మి ప్లాన్.
రామ్: పిన్ని నాకు డబ్బులు ఇవ్వడం సీతకి తెలుసు.
రేవతి: తెలిస్తే సీత తీస్తుందీ అనా నీ అభిప్రాయం రామ్.
రామ్: సీత నాకు చెప్పకుండా ఎందుకు తీస్తుంది అత్తయ్య. నేను అలా అనలేదు.
జనార్థన్: ఈ ఇంట్లో ఎప్పుడూ ఇలా జరగలేదు.
గిరిధర్: ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చిన సీతనే అడగాలి.
రేవతి: ఆ డబ్బు సీతే తీసింది అని గ్యారెంటీ ఏంటి ఇంట్లో ఇంత మంది ఉన్నారు ఎవరైనా తీసి ఉండొచ్చు కదా..
మహాలక్ష్మి: ఇంతకు ముందు ఎప్పుడైనా ఎవరైనా అలా చేశారా రేవతి. బయట నుంచి ఇంట్లోకి ఎవరూ రాలేదు. ఇక్కడున్న వారిలో ఎవరూ దొంగతనం చేయరు. (సీత అక్కడుండదు.) మిగిలింది ఆ సీత మాత్రమే. తనని పిలిచి అడిగితే అంతా బయటకు వస్తుంది. సీతని పిలువు రామ్.
రామ్: సీత.. ఒకసారి కిందకి రా..
సీత: చెప్పండి..
రామ్: నిన్న నేను బీరువాలో డబ్బులు పెట్టాను కదా.. అందులో నువ్వు నాలుగు లక్షలు తీశావా..
అర్చన: ఏంటి అలా చూస్తున్నావ్ ఆ డబ్బు తీశావా లేదా చెప్పు. చెప్పు దొంగతనం చేశావా.
సీత: లేదు..
మహాలక్ష్మి: మరి ఆ నాలుగు లక్షలు ఏమయ్యాయి. రెక్కలు వచ్చి ఎగిరి పోయాయా..
సీత: ఎగిరిపోలేదు నేనే తీసుకున్నాను.
ప్రీతి: మరి దొంగతనం చేయలేదు అన్నావ్.
సీత: దొంగతనం చేయలేదు డబ్బులు తీసుకున్నాను. నేను పరాయి వాళ్ల ఇంట్లో పరాయి వాళ్ల డబ్బులు తీసుకుంటే దొంగతనం అవుతుంది. నా ఇంట్లో నా బీరువాలో నా భర్త పెట్టిన డబ్బు తీసుకుంటే దొంగతనం ఎలా అవుతుంది.
మహాలక్ష్మి: ఎవర్ని అడిగి ఆ డబ్బు తీశావు. రామ్‌ని అడిగావా.. రామ్‌ని అడగకుండా డబ్బు తీశావు అంటే నీకు ఎంత ధైర్యం. నీతో కూడా చెప్పకుండా ఇలా చేసింది అంటే తను నీకు ఎంత విలువ ఇస్తుందో అర్థమవుతుందా రామ్. నీ భార్య ఎలాంటిదో ఇప్పటికైనా అర్థమైందా నీకు.
జనార్థన్: ఇంత పెద్ద ఇంట్లో ఉంటూ అంత చిన్న బుద్ధులు ఏంటమ్మా నీకు ఎవరికైనా తెలిస్తే మన పరువు ఏం కావాలి.
రామ్: ఎందుకు ఇలా చేశావ్ సీత..
మహాలక్ష్మి: ముందు ఆ డబ్బు ఏం చేసిందో అడుగు రామ్.
సీత: ఆ నాలుగు లక్షలు ఎందుకు తీశానో ఏం చేశానో అన్నదే కదా మీకు కావాల్సింది. నేను తీసుకున్న ప్రతి రూపాయ్‌కి లెక్క చెప్తాను. మీరు నాతో రండి అంటూ రామ్ చేయి పట్టుకొని తీసుకెళ్తే.. మహాలక్ష్మి ఆగమని రామ్‌ని ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అని అడుగుతుంది. దీంతో సీత లెక్క అప్పజెప్పడానికి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: వరుణ్: వాలెంటైన్స్ డేకు లావణ్య ఇచ్చిన గిఫ్టెంటీ? - వరుణ్ తేజ్ షాకింగ్ రిప్లై!