అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today December 13th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అన్నా చెల్లెళ్లని రెచ్చగొట్టిన మహాలక్ష్మీ.. ప్రీతి భర్త ఎంట్రీతో అందరూ సీన్ రివర్స్!

Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవి ఇంటి నుంచి వెళ్తేనే అత్తారింటికి వెళ్తానన్న ప్రీతి తన భర్త రాకతో షాక్ అయిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవి వల్ల తన కాపురం కూలిపోయిందని ప్రీతి ఇంటికి వచ్చేస్తుంది. రామ్‌ని పట్టుకొని ఏడుస్తుంది. జైలు కెళ్లిన హంతకురాలని ఇంటికి తీసుకొచ్చారని భర్త అత్తమామలకు తెలిసి తను వెళ్తేనే ఇంటికి తీసుకెళ్తామని చెప్పారని ప్రీతి అందరితో చెప్తుంది. దానికి దీనికి సంబంధం ఏంటని సీత అడుగుతుంది. దానికి మహాలక్ష్మీ ఈవిడ ఇక్కడ ఉండటం పరువు పోతుందని ఫీలైనట్లు ఉన్నారని ఇరుగు పొరుగు మాటలకు బాధ పడినట్లు ఉన్నారని అంటుంది. అర్చన, గిరిధర్‌లు కూడా మహాలక్ష్మికి వత్తాసు పలుకుతారు.

సీత: వాళ్లకి మా అమ్మానాన్నల మీద చాలా గౌరవం ఉంది ఇలా మాట్లాడరు. ప్రీతిని పంపరు.
ప్రీతి: మామయ్య అత్తల మీద వాళ్లకి చాలా గౌరవం ఉంది వదిన. కానీ ఈవిడను గౌరవించాల్సిన అవసరం ఏముంది. ఈవిడ ఇక్కడ నుంచి వెళ్తేనే నేను మా అత్తింటికి వెళ్తాను. 
సీత: కుదరదు ప్రీతి. ఆవిడ ఇంట్లోనుంచి వెళ్లదు. నేను మీ పిన్నితో నా జీవితం పణంగా పెట్టి పందెంలో కలిసి ఇంట్లోకి తీసుకొచ్చాను. ఆవిడ విద్యాదేవినా సుమతినా తేలేవరకు వెళ్లరు.
రామ్: అంటే ఏంటి సీత నీకు ప్రీతి కంటే ఆవిడే ఎక్కువనా.
సీత: ఆవిడను పరాయి ఆవిడలా చూడకుండా అత్తమ్మలా చూడండి మీకే అర్థమవుతుంది.
రామ్: మీ వల్ల ఎన్ని గొడవలు అవుతున్నాయో చూశారా మీ స్థానంలో మా అమ్మ ఉంటే కూతురి కాపురానికి నష్టం వస్తే ఊరుకునేది కాదు కూతురి కోసం ఏమైనా చేసేది.
ప్రీతి: ఆవిడ మన అమ్మ అయితే కదా అన్నయ్య మన గురించి ఆలోచించడానికి ఆస్తి కోసం వచ్చింది మనం ఏమైపోతే తనకేం. 
రామ్: ప్రతి ఆడదానికి అమ్మ మనసు ఉంటుంది అంటారు. మీకు ఆ మనసు ఉంటే నా చెల్లి జీవితం నిలబెట్టండి.
ప్రీతి: నా తల్లి స్థానంలో నాకు పెళ్లి చేశారు. ఇప్పుడు నాకు న్యాయం చేయండి లేదంటే నా తాళి తెంపేసి జీవితాంతం ఇక్కడే కూర్చొపెట్టండి. 
సీత: అవేం మాటలు ప్రీతి ఆవిడను ఎందుకు అలా చిత్రవద చేస్తున్నారు.
రామ్: ఇందులో నువ్వు కలుగజేసుకోకు సీత ఇలాంటి పరిస్థితే నీకు వస్తే మీ అమ్మ ఊరుకుంటుందా. నీలాంటిదే నా చెల్లి కూడా. 
ప్రీతి: అంతెందుకు నా కోసం ఇళ్లు వదిలేసి వెళ్లాల్సి వస్తే మా పిన్ని వెళ్లిపోయేది అలా ఉండాలి.

ప్రీతి, రామ్‌ మాటలకు విద్యాదేవి ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతుంది. సీత టీచర్ దగ్గరకు వెళ్తుంది. విద్యాదేవి సీతతో రేపు నేను ఈ ఇంటి నుంచి వెళ్లిపోతా అంటుంది. దానికి సీత మనం ఇంత కష్టపడింది ఇందుకేనా అత్తమ్మ అని అంటుంది. పిల్లలే వెళ్లిపోమంటున్నారని విద్యాదేవి బాధపడుతుంది. మీరు వెళ్లిపోతే మహాలక్ష్మీని కట్టడి చేయలేం అని సీత అంటుంది. మహాలక్ష్మీ ఉండగా మన ఆటలు సాగవని నన్ను మహాలక్ష్మీ పంతంగా పెట్టుకుందని అంటుంది. ఇక ప్రీతి రామ్‌తో కొత్తగా పెళ్లి చేసుకున్న నాకు ఈ బాధలు ఏంటి అన్నయ్యా అని ఏడుస్తుంది. దాంతో రామ్ ఆవిడను ఎలా అయినా రేపు వెళ్లగొడదామని అంటుంది. మహాలక్ష్మీ వచ్చి మంచి నిర్ణయం తీసుకున్నారని అంటుంది. సీత పంతం పట్టింది ఎలా పిన్ని అని ప్రీతి అంటుంది. సీత ఆపాలి అనుకుంటే మీరు ఇద్దరూ పట్టుపట్టాలని మహాలక్ష్మీ చెప్తుంది. సీత వాళ్ల మాటలు వింటుంది. సీత టీచర్‌ కోసం ఫైట్ చేస్తుందని మహాలక్ష్మీ అంటే నేను మా చెల్లి కోసం ఫైట్ చేస్తానని అంటుంది. మీరిద్దరూ బలంగా పోరాడితే సీత లొంగుతుందని అంటుంది. అన్నాచెల్లెళ్లను నా మీదకు యుద్దానికి పంపిస్తావా అత్తయ్య నీ పని చెప్తా అని సీత అనుకుంటుంది.

సీత రాత్రి తన తండ్రికి కాల్ చేస్తుంది. ఇంట్లో పరిస్థితి చెప్తుంది. అత్తమ్మని ఆపడానికి చూస్తాను అలా కుదరకపోతే మీరు ఇంటికి తీసుకెళ్లండి అని చెప్తుంది. నా చెల్లిని నేను చూసుకుంటానని శివకృష్ణ అంటాడు. సీత మాటలు రామ్ వింటాడు. సీత మీద కోప్పడతాడు. నిజంగా ఆవిడ మా అమ్మే అయితే తన కోసం ప్రాణాలు ఇస్తానని కానీ మా అమ్మని చంపిన హంతకురాలిని క్షమించనను అని అంటాడు. రేపు ఆవిడను ఆపితే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదని అంటాడు. దానికి సీత కారణం లేకపోతే ఆపను అని చెప్తుంది. ఉదయం అందరూ విద్యాదేవి వెళ్లిపోతుందా లేదా అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. ఇంతలో విద్యాదేవి బ్యాగ్ తీసుకొని హాల్‌లోకి వస్తుంది. నా వల్ల ఎవరూ బాధ పడకూడదు అని వెళ్లిపోవాలి అనుకుంటున్నానని విద్యాదేవి చెప్తుంది. సీత ఆమెతో మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని అంటుంది. ఎందుకు ఆపుతున్నావ్ అని రామ్ అంటాడు. ప్రీతి అత్తారింటికి వెళ్లడం ఇష్టం లేదా అని మహాలక్ష్మీ అడిగితే ప్రీతిని తీసుకెళ్లడానికి స్వయంగా తన భర్త వచ్చాడని సీత చెప్తుంది. సీత విజిలేస్తే ప్రీతి భర్త ఇంట్లోకి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్య పుట్టింటికి వచ్చి రచ్చ చేసిన భైరవి.. సత్యకి మహదేవయ్య మాస్ వార్నింగ్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Personal Loan: కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Embed widget