Seethe Ramudi Katnam Serial Today December 12th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాని పిచ్చిదాన్ని చేసేస్తున్న అత్తాకోడళ్లు.. కాపురం కూలిపోయిందని వచ్చేసిన ప్రీతి!
Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవి వల్ల తన కాపురం నాశనం అయిందని ప్రీతి తట్టాబుట్టా సర్దుకొని పుట్టింటికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీని కాదని జనార్థన్ విద్యాదేవిని సుమతి అని చెప్పి బయటకు తీసుకెళ్తాడు. రాత్రి పక్కన పడుకున్నందుకు ఆ విద్యాదేవి బావగారిని మార్చేసింది ఇక నీ జీవితం అయిపోయింది మహా అని అర్చన రాగాలు అందుకుంటుంది. నిన్న అలా ఇప్పుడు ఇలా నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు అని రామ్ అంటాడు. సీత మహాలక్ష్మీతో ఇక మీరు సన్యాసం తీసుకోండి అత్తయ్య అని పాటలు పాడుతుంది. మహాలక్ష్మీ కోపంతో రగిలిపోతుంది. మనసులో జనా నువ్వు ఇంటికి రా నీ సంగతి చెప్తా అనుకుంటుంది. జనార్థన్ విద్యాదేవిని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్‌కి తీసుకెళ్తాడు. ఇద్దరూ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేస్తారు.
జనార్థన్: సారీ విద్యాదేవి గారు మీ మనసులో ఎన్ని ప్రశ్నలు ఉంటాయని నాకు తెలుసు కానీ మీరు సుమతి అని చెప్పి సంతకం పెట్టించి నా పని పూర్తి చేసుకున్నాను. ఆ సైట్ నేను సుమతి ఉన్నప్పుడు కొనాలి అనుకున్నాను. కానీ అది కుదరలేదు. మీరు పదే పదే సుమతి అని చెప్తున్నారు కాబట్టి మిమల్ని తీసుకొచ్చి సంతకం పెట్టించా సారీ అండీ.
విద్యాదేవి: ఆ సంతకం గురించి నాకు తెలుసండి. 1998లో ఆ సైట్ రిజిస్టర్ అవ్వాల్సింది. అని స్టోర్ చెప్తుంది. ఓ సారి మనం ఇక్కడికి వచ్చినట్లు ఆ షాప్‌లో టీ బిస్కెట్స్ తిన్నాం అని చెప్తుంది.
జనార్థన్: ఈవిడకు ఈ విషయాలు ఎలా తెలిశాయి. సుమతికి నాకు మధ్య జరిగినవి ఇంత కరెక్ట్‌గా ఎలా చెప్తుంది.
సీత: ఎందుకు అత్తయ్యా అంత టెన్షన్ పడుతున్నారు సుమతి అత్తమ్మ గురించి మామయ్యకు తెలిసిపోయిందనా.
మహాలక్ష్మీ: రామ్ తనని కామ్‌గా ఉండమని చెప్తావా. జనార్థన్, విద్యాదేవి ఇంటికి వస్తారు. జనార్థన్ గదికి వెళ్తుంటే మహా ఆపుతుంది.
గిరిధర్: ఏంటి అన్నయ్య ఇంట్లో ఒకరిని వీధిలో ఒకర్ని మెంటైన్ చేయడానికి నువ్వు ఇద్దరి పెళ్లాల ముద్దుల మొగుడు అనుకుంటున్నావా.
జనార్థన్: ఏం మాట్లాడుతున్నావ్ గిరి. నేనేం తప్పు చేశాను.
రామ్: ఏంటి డాడీ ఇది ఇంట్లో పిన్నిని పెట్టుకొని వేరే ఆవిడతో వెళ్లే పిన్ని ఫీలవదా చూసే వారు ఏమనుకుంటారు.
అర్చన: ఇంత అందమైన మహాని వదిలేసి ఆవిడను తీసుకెళ్లాలని మీకు ఎలా అనిపించింది బావగారు.
మహాలక్ష్మీ: నన్ను ఇన్సల్ట్ చేయడానికే ఇలా చేశావు కదా జనా.
జనార్థన్: ఆపుతారా ఇంక నేను తనతో షికారుకు వెళ్లలేదు రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్లాను.
సీత: అంటే మళ్లీ రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారా మామయ్య. మహాలక్ష్మీ: నాతో ఒక మాట అయినా చెప్పుకుండా ఆమెను పెళ్లి చేసుకుంటావా జనా నేను ఏం పాపం చేశాను.
జనార్థన్: మీ అందరికీ ఏమైంది నేను చెప్పేది పూర్తిగా వినరా. తనని నేను తీసుకెళ్లింది ల్యాండ్ రిజిస్టేషన్‌కి తన వల్ల మనకు ఈ రోజు కోట్ల లాభం వచ్చింది. అని జరిగింది మొత్తం చెప్తాడు.
ఆవిడ సుమతి అని ఎలా నమ్మావు జనా అని మహాలక్ష్మీ నిలదీస్తే ఆవిడ సుమతి కాదు విద్యాదేవి కాదని తెలుసని రిజిస్టర్ ఆఫీస్‌లో సుమతి ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదని తనని తీసుకెళ్లానని చెప్తాడు. ఇంట్లో ఇద్దరు పిచ్చోళ్లతో తట్టుకోలేం అని సీత అంటే రామ్ కూడా అవును పిన్ని కొద్ది రోజులు ఇలాగే ఉంటే మన ఇళ్లు మెంటల్ హాస్పిటల్ అవుతుందని చెప్పి వెళ్లిపోతాడు. సీత మహాలక్ష్మీతో సినిమా మంచి ఇంట్రస్టింగ్‌గా ఉంది కదా అత్తయ్య అని అంటుంది. ఇక విద్యాదేవి సీతతో ఆయనలో నా గురించి ఆలోచన మొదలైందని అంటుంది. ఇక జనార్థన్ విద్యాదేవి సుమతి ఒక్కరేనా అని ఆలోచిస్తుంటాడు. ఇక మహాలక్ష్మీ ఆవేశంగా ఉంటే అక్కడికి అర్చన వెళ్తుంది. మహాలక్ష్మీ అర్చన మీద బీభత్సంగా అరుస్తుంది. పిచ్చి అని అర్చన మాట్లాడితే ఎవరికే పిచ్చి అని మహాలక్ష్మీ అర్చన గొంతు పట్టుకొని నులిపేస్తుంది.
ఇక ప్రీతి బ్యాగ్‌తో ఇంటికి వచ్చి విద్యాదేవి విద్యాదేవి అని పేరు పెట్టి పిలుస్తుంది. అందరూ ప్రీతిని చూసి షాక్ అయిపోతారు. సీత ఎందుకు పెద్దావిడని అలా పిలుస్తున్నావ్ అంటే తన వల్ల నా కాపురం నాశనం అయిందని రామ్‌ని పట్టుకొని ఏడుస్తుంది. ఏం జరిగిందని జనార్థన్ అడిగితే ప్రీతి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.