అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today April 23rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి వచ్చినా నాకు భార్య కాలేదన్న జనా, జీవితంలో ఇంటికి రానన్న సుమతి, సీతలో అనుమానం!

Seethe Ramudi Katnam Serial Today Episode ఇంటికి వచ్చిన సుమతి తన భర్త, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్న మహాలక్ష్మి జీవితంలోకి రాకూడదని వెనుదిరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode: సుమతి ఇంటికి వచ్చి తన కుట్ర తెలుసుకొని మహాలక్ష్మిని నిలదీసినట్లు.. రామ్, సీత, సుమతి అందరూ కలిసి మహాలక్ష్మిని రాక్షసి అని ఇంటి నుంచి మెడ పట్టుకొని గెంటేసినట్లు మహాలక్ష్మి ఊహించుకుంటుంది. ఒక్కసారిగా తేరుకొని షాకైపోతుంది. భయంతో గజగజ వణికిపోతుంది. 

మహాలక్ష్మి: ఇదేంటి నాకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయ్. చనిపోయిన సుమతి బతికి తిరిగి వచ్చి నిజం తెలుసుకొని నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం ఏంటి. కొంపతీసి సుమతి నిజంగానే బతికి ఉంటే ప్రాణాలతో తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి..

మరోవైపు సుమతి ఇంటి ముందు ఆటో దిగుతుంది. అప్పుడు తాను వదిలి పెట్టిన ఇళ్లు ఇప్పటికీ అలాగే ఉందని సరదా పడుతుంది. ఇంటికి తన పేరు రాసి ఉండటం చూసి సంతోషపడుతుంది.

సుమతి: నేను లేకపోయినా ఇంటికి నా పేరు పెట్టారు అంటే.. ఇదంతా నా ఫ్రెండ్ మహాలక్ష్మి గొప్పతనమే కారణం. మహాలక్ష్మి నన్ను మర్చిపోకుండా ప్రతీ క్షణం నన్ను గుర్తు చేసుకున్నట్లుంది. అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. లోపల మహా ఆలోచిస్తూ ఉంటుంది. మహాని చూసి.. మహాలక్ష్మి నువ్వు అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు. అప్పటికి ఇప్పటికే ఒకేలా ఉన్నావు..

ఇక తన భర్తని చూస్తుంది. ఏవండీ అనుకుంటుంది. ఇంతలో జనార్థన్ మహా పక్కన కూర్చొని ఏమైంది మహా అని అడుగుతాడు. అప్పుడు మహా ఏంకాలేదు జనా అని జనార్థన్ చేతికి ముద్దు పెడుతుంది. అది చూసిన సుమతి తన భర్త, మహా పెళ్లి చేసుకున్నారని పిల్లల కోసమే మహా ఆ పెళ్లి చేసుకొని ఉంటుందని అనుకుంటుంది. 

సుమతి: ఆయన్ను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమన్నాను అని నాకు ఇచ్చిన మాట కోసం మహా పెళ్లి చేసుకొని ఉంటుంది. 
జనార్థన్: ఏం లేదు అంటావ్ ఏంటి మహా.. ఏదో అయింది అని నీ ముఖం చూస్తే తెలుస్తుంది. ఏం ఆలోచిస్తున్నావో చెప్పు మహా.
మహాలక్ష్మి: సుమతి గురించే ఆలోచిస్తున్నాను జనా..
సుమతి: నాకు తెలుసు మహా నువ్వు నా గురించే ఆలోచిస్తావని. అందుకే నువ్వు నా ప్రాణ స్నేహితురాలు అయ్యావు.
మహాలక్ష్మి: సుమతి మనకు దూరం అయి చాలా సంవత్సరాలు అయింది. తను చనిపోయిందని మనకు ఎవరో చెప్పారు. కనీసం మనం సుమతిని ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. సుమతి వెళ్లిపోయాక నేను నీ జీవితంలోకి వచ్చాను. రామ్, ప్రీతిలకు తల్లినయ్యాను. కానీ ఎక్కడో ఏదో వెలతి జనా. సుమతి స్థానంలో నేను ఉన్నానని. సుమతి తిరిగి వచ్చుంటే బాగుండేది కదా జనా. ఈ ఇంటిని మీ అందరిని ఇంకా బాగా చూసుకునేది కదా..
జనార్థన్: అలా ఎందుకు అనుకుంటున్నావ్. సుమతి దూరం అవ్వడం ఓ దురదృష్టం. సుమతికి ఇచ్చిన మాట కోసం నువ్వు ఈ ఇంటిని కుటుంబాన్ని బాధ్యతగా తీసుకున్నావ్. రామ్ ప్రీతీలను నీ కన్న బిడ్డలుగా చూసుకున్నావ్. ఆఖరికి సుమతి ఉన్నా నీలా పిల్లల్ని చూసుకోలేదు. వాళ్లకోసం నువ్వు పిల్లన్ని కూడా వద్దు అనుకొని త్యాగం చేశావ్. నీ కంటూ ఒక జీవితం లేకుండా మేమే నీకు అన్నీ అనుకున్నావ్. ఇంకా నీకు గిల్టీ ఏంటి మహా.
మహాలక్ష్మి: అంటే సుమతి ప్రాణాలతో ఉండి రేపు ఎప్పుడైనా ఇంటికి తిరిగి వస్తే తన స్థానంలో ఉన్న నన్ను సుమతి అర్థం చేసుకుంటుందో అపార్థం చేసుకుంటుందో అని భయంగా ఉంది. 
జనార్థన్: సుమతి ఎందుకు అపార్థం చేసుకుంటుంది. నిజానికి సుమతి మా జీవితాల్లో 5 ఏళ్లు మాత్రమే ఉంది. కానీ నువ్వు ఇన్ని సంవత్సరాలుగా మాతో మా కోసమే బతుకుతున్నావ్. ఇంకా చెప్పాలి అంటే ఈ స్థానం సుమతిది కాదు నీది మహా. నువ్వు అన్నట్లు సుమతి బతికి రేపు ఎప్పుడైనా వస్తే ఈ ఇంటికి సుమతి అతిథి అవుతుంది కానీ మళ్లీ నాకు భార్య కాలేదు. మన పిల్లలకు తల్లి కాలేదు.
మహాలక్ష్మి: అలా అంటావ్ ఏంటి జనా సుమతి నీతో కలిసి ఏడు అడుగులు వేసింది. తొమ్మిది నెలలు పిల్లల్ని కనింది. అలాంటప్పుడు తను నీకు అతిథి ఎలా అవుతుంది. 
జనార్థన్: తను మాకు దూరం అయింది. ఇన్నేళ్ల తర్వాత వస్తే అతిథే అవుతుంది. నువ్వు నిజం చెప్పు మహా రేపు ఎప్పుడైనా సుమతి వస్తే నువ్వు నన్ను వదిలేస్తావా.. రామ్ ప్రీతిలను సుమతికి వదిలేసి వెళ్లిపోతావా.
మహాలక్ష్మి: నా ప్రాణాలు అయినా వదిలేస్తా కానీ మిమల్ని ఎలా వదిలేస్తాను జనా. మీరే నా ప్రాణం మీరు లేకపోతే నాకు జీవితమే లేదు.
జనార్థన్: అందుకే చెప్తున్నా జరగని వాటి గురించి ఆలోచించకు. సుమతి చనిపోయింది. ఇక తిరిగి రాదు. నువ్వు ఇలా బాధపడుతున్నావ్ అని తెలిస్తే రామ్ ప్రీతిలు తట్టుకోలేరు. 

రామ్, ప్రీతిలను జనార్థన్ పిలుస్తాడు. రామ్ ఫాస్ట్‌గా వచ్చి పడిపోబోతే మహా పట్టుకుంటుంది. రామ్ మహాతో మీరు ఉండగా నాకు ఏం అవుతుంది పిన్ని మీరు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు కదా అంటాడు. ఇక సుమతి పిల్లల్ని చూసి ఎంత పెద్ద వాళ్లు అయిపోయారు అని మురిసిపోతుంది. ఇక మహా పిల్లల్ని ఇద్దర్ని దగ్గరుకు తీసుకొని మీరు నా ప్రాణం అని మిమల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్లనని అంటుంది. ఇక జనార్థన్ మన నలుగురం ఒక్కటే మనల్ని ఎవరూ వేరు చేయలేరు అని అంటాడు. దీంతో సుమతి వెనక్కి వెళ్లిపోతుంది. తన ఇంటికి తాను అతిథిలా కూడా వెళ్లకూడదు అని వాళ్ల కంటికి కనిపించకూడదు అని అనకుంటుంది. 

ఇంతలో సీత అక్కడికి వస్తుంది. సుమతి తాను తీసుకొచ్చిన స్వీట్స్ పిల్లలకు ఇవ్వాలి అని కానీ తనని ఎవరూ చూడకూడదు అనుకొని కొంగు కప్పుకుంటుంది. ఇంతలో సీత ఎవరు మీరు అని సుమతిని ప్రశ్నిస్తుంది. దీంతో సుమతి తాను స్వీట్స్ చేసి ఇంటి ఇంటికి తీసుకెళ్లి అమ్ముతాను అని అంటుంది. ఇక సీత స్వీట్స్ వద్దు అనేస్తుంది. సుమతి సీతకి స్వీట్స్ తీసుకోమని అంటుంది. ఇక సీత స్వీట్స్ తీసుకొని డబ్బులు తీస్తాను అని అంటుంది. సీత డబ్బులు తీసుకొని వచ్చేలోపు సుమతి వెళ్లిపోతుంది. సీత ఆమె ఎవరు అని ఆమెకు ఇంటికి ఏంటి సంబంధం అని అనుకుంటుంది. మరోవైపు సుమతి తనకు ఆ ఇంటితో సంబంధం తెగిపోయింది అని మళ్లీ ఇంటకి రాను అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'నాగ పంచమి' సీరియల్: తన ప్రాణంతో భర్త, బిడ్డ, తల్లి ప్రాణం ముడిపెట్టావని విలవిల్లాడిన పంచమి.. తల్లిని హంతకురాలన్న మోక్ష!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget