Naga Panchami Serial Today April 23rd: 'నాగ పంచమి' సీరియల్: తన ప్రాణంతో భర్త, బిడ్డ, తల్లి ప్రాణం ముడిపెట్టావని విలవిల్లాడిన పంచమి.. తల్లిని హంతకురాలన్న మోక్ష!
Naga Panchami Serial Today Episode తన బిడ్డను కాపాడుకోవడానికి నీ దగ్గరే ఉంటాను నాకు అండగా ఉండు అని సుబ్బుని పంచమి కోరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode వైదేహి ఇంటికి వచ్చి పంచమి తనని మోసం చేసిందని అంటుంది. ఇదంతా నీ తప్పే అని రఘురాం అంటాడు. దాంతో వైదేహి తనని ఎవరూ అర్థం చేసుకోవడం లేదని పంచమి ఎక్కడున్నా వెతికి గర్భం తీయిస్తానని అంటుంది.
శబరి: మా ఎవ్వరికీ మోక్ష మీద ప్రేమ లేనట్లు మాట్లాడకు వైదేహి. మళ్లీ మన గురువుగారితో కలిసి మాట్లాడే వరకు నువ్వు తొందర పడకు.
మోక్ష: పంచమి.. పంచమి.. శబరి పంచమి ఇంటికి వచ్చిందా..
చిత్ర: మోక్ష నీ పిచ్చి కానీ ఇంటికి వచ్చేదంటే పారిపోదు కదా. పంచమి కనిపించడం అంటే ఇక డౌటే..
జ్వాల: మాయలపకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్లు ఇప్పుడు నీ ప్రాణాలు పంచమి దగ్గర ఉన్నాయి మోక్ష.
మోక్ష: అవును నా ప్రాణమే పంచమి.
వైదేహి: కానీ తన కడుపులో నీ మృత్యువు పెరుగుతుందిరా..
మోక్ష: అమ్మా నువ్వు మాట్లాడకు. నువ్వే నా ప్రాణాలు తీయాలి అనుకుంటున్నావ్. పంచమికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండను.
వైదేహి: పంచమి అంటే నాకేం కోపం లేదురా. కానీ నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాను.
మోక్ష: పుట్టబోయే బిడ్డను చంపడమా.. నువ్వు మాకు చేసే మంచి. ఒక హంతకురాలికి నీకు ఏమైనా తేడా ఉందా..
వైదేహి: చాలా దారుణంగా మాట్లాడుతున్నావ్ మోక్ష. అసలు ఇంకా పుట్టని బిడ్డ మీదే నీకు అంత ప్రేమ ఉంటే. పాతికేళ్లు పెంచి నీ మీద నాకు ఎంత ప్రేమ ఉండాలిరా.. అందరూ పంచమి గురించి మాట్లాడితే మోక్ష అందర్ని తిడతాడు. పంచమి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని అంటాడు.
మోక్ష: బెదిరించి భయపెట్టి తనని హాస్పిటల్‌కి తీసుకెళ్లావమ్మా. మీ మూఢ నమ్మాకాల కోసం మా బిడ్డను బలి ఇవ్వాలని చూశాం. చివరి నిమిషంలో తను ధైర్యం చేసి మా బిడ్డను కాపాడింది.
వైదేహి: కాదు మోక్ష నీ ప్రాణాలు పోయినా పర్వాలేదు అని అనుకుంది.
మోక్ష: నీకు తెలుసా మా బిడ్డ పుడితే నేను చనిపోతాను అని.. ఇదే గురువుగారు నేను పుట్టడం వల్ల నీకు ప్రాణ హాని ఉందని అంటే నన్ను చంపేసుండేదానివి కదా..
వైదేహి: అది కాదు మోక్ష.
మోక్ష: ఇంకేం చెప్పకమ్మ. నీకు నీ బిడ్డ ముఖ్యం. మాకు మా బిడ్డ ప్రాణాలు అంతే ముఖ్యం. మా బిడ్డని నువ్వు తీయించి ఉంటే నువ్వు నాకు ఓ హంతకురాలిగా కనిపించేదానివి. నా భర్య ప్రాణాలతో ఉంటేనే ఈ మోక్ష కూడా ప్రాణాలతో ఉన్నట్ల లేకపోతే లేనట్లే..
మోక్ష మాటలకు వైదేహి కుప్పకూలిపోయి ఏడుస్తుంది. ఇక పంచమి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వస్తుంది. స్వామి ముందు కూలబడి ఏడుస్తుంది.
పంచమి: స్వామి ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావ్. తల్లిని అయ్యాను అన్న సంతోషమే లేకుండా చేశావ్. నా బిడ్డతో నా భర్త ప్రాణాలకు ముడి పెట్టావ్. తల్లిగా ప్రాణం చంపుకొని భార్యగా భర్తని బతికించుకుందాం అనుకుంటే నా తల్లిని తెచ్చి నా కడుపులో పెట్టావు. ఇప్పుడు నేనే ఏం చేయాలి స్వామి. ఎవరి మాటలు నమ్మాలి. ఎవరిని కాపాడుకోవాలి. ఎవరిని చంపుకోవాలి. నా తల్లి నా బిడ్డ నా భర్త నాకు ముగ్గురు ముఖ్యమే స్వామి.
నా ఒక్కదాని ప్రాణాలకు ముగ్గురు ప్రాణాల్ని ముడి పెట్టావ్ ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి. అని పంచమి కళ్లు తిరిగి పడిపోతుంది. ఇంతలో సుబ్బు వస్తాడు. పంచమికి స్ఫృహ వచ్చేలా చేస్తాడు. సుబ్బుని చూసి పంచమి ఏడుస్తుంది. తన కష్టాలు పడలేను అని నా తరుఫున నువ్వే ఆ స్వామికి చెప్పు అని అంటుంది. సుబ్బు పంచమిని తీసుకొని వెళ్లి ఓ చోట కూర్చొంటాడు. సుబ్బుకి పంచమి మొత్తం చెప్తుంది.
సుబ్బు: నాకు తెలిసి నువ్వొక కారణ జన్మురాలివి. ఏం జరిగినా అది ఏదో ఒక మంచికే అయింటుంది.
పంచమి: సుబ్బు నేను నీతో పాటు ఇక్కడే ఉంటాను. ఇంటికెళ్తే నా బిడ్డగా పెరుగుతున్న మా అమ్మని కాపాడుకోలేను. నా దృష్టిలో నువ్వే నాకు ఆ స్వామిలాగా సుబ్బు. నువ్వు నన్ను కాపాడగలవు అన్న నమ్మకం ఉంది. నీ దగ్గర ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది సుబ్బు. నేను ఇక్కడే ఉంటాను. నన్ను నా బిడ్డను నువ్వే కాపాడాలి. అని పంచమి నేల పడుకొంటుంది.
మరోవైపు వైదేహి తన భర్తతో తన ఆవేదన చెప్పుకొని ఏడుస్తుంది. పంచమిని ఎలా అయినా పట్టుకొని గర్భం తీయిస్తాను అని అంటుంది. దీంతో రఘురాం వైదేహిని తిడతాడు. అయినా వైదేహి వినిపించుకోదు. సర్ది చెప్పినా పట్టించుకోదు. చివరకు నిన్ను మార్చడం నావల్ల కాదు అని చేతులెత్తేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇక మోక్ష పంచమిని వెతుక్కుంటూ గుడి దగ్గరకు వస్తాడు. అక్కడ పంచమిని చూస్తాడు. పంచమి పడుకొని ఉంటుంది. దగ్గరకు వెళ్లి పంచమి కడుపు మీద చేయి వేసి ఏడుస్తాడు. ఇక పంచమి లేస్తుంది.ద ఇద్దరూ ఒకర్ని ఒకరు హగ్ చేసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.