Seethe Ramudi Katnam Serial Today April 22nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కోట్లు ఇస్తే గడప దాటుతా.. లేదంటే నీ జాతకం బయట పెడతా.. రేఖ వార్నింగ్!
Seethe Ramudi Katnam Today Episode రామ్ గౌతమ్‌ని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పడం గౌతమ్ రామ్ కాళ్ల మీద పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత పారిపోయిందని రౌడీలు గౌతమ్‌తో చెప్తారు. రౌడీలకు గౌతమ్ సీత ఎప్పుడు పారిపోయింది అంటే పది నిమిషాలే అయిందని రౌడీలు అబద్ధం చెప్తారు. దాంతో గౌతమ్ సీత, మిధున ఒక్కరు కాదులే అనుకుంటాడు. రేఖని ఎలా అయినా వదిలించుకోవాలి అనుకుంటాడు. ఇంతలో హాల్‌లో రేఖ లగేజ్‌తో వచ్చి కూర్చొనుంటుంది.
నేను ఇక్కడున్నా అని నీకు ఎవరు చెప్పారు?
గౌతమ్ రేఖని చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అంటే నేను ఇక నుంచి ఇక్కడే ఉంటాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చానని రేఖ చెప్తుంది. దాంతో గౌతమ్ అందంగా ఉంటావని వెంట పడ్డా పడేయాలి అని ప్రేమిస్తున్నా అన్నాను. పొందాలి అని పెళ్లి అన్నాను అంటాడు. ఆ ఒక్క మాట పట్టుకొని ఇంత దూరం వచ్చావా అసలు నేను ఇక్కడ ఉంటాను అని నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు. దానికి రేఖ సీత తనని చెప్పి తీసుకొచ్చింది అనడంతో సీత ఎంట్రీ ఇస్తుంది.
గౌతమ్‌కి శిక్ష పడాల్సిందే..
సీత మాటలు విని అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. సీత ఈవిడేనా నాకు తెలీదు అని రేఖ అంటుంది. దానికి మహాలక్ష్మీ ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారేమో అంటుంది. నువ్వే సీతతో కలిసి వచ్చావేమో అని మహా, గిరి, అర్చనలు సీత మీద పడితే రామ్ వాళ్లని అడ్డుకుంటారు. నువ్వు నిజంగా గ్రేట్ సీత ఒక అమ్మాయి జీవితం నిలబెట్టావు అనిఅంటాడు. ఇక జనార్థన్ కూడా సీతని పొగుడుతాడు. దానికి సీత నా సంగతి సరే ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా శిక్ష వేస్తారు కదా మరి అమ్మాయి జీవితంతో ఆడుకున్న గౌతమ్ సంగతి ఏంటి అని అంటాడు. గౌతమ్ తప్పు చేయలేదు పొరపాటు చేశాడు అని మహాలక్ష్మీ అంటుంది.
గౌతమ్ వెంటనే వెళ్లిపోవాలి..
గౌతమ్ పొరపాటు చేసిన తప్పు చేసిన ఆడ పిల్ల జీవితంలో ఆడుకోవాలి అనుకోవడం తప్పే ఇందుకు శిక్షగా గౌతమ్ వెంటనే ఈ ఇంటి నుంచి వెళ్లిపోవాలి అని అంటాడు. మహాలక్ష్మీ, గౌతమ్ అందరూ షాక్ అవుతారు. జనార్థన్ కూడా గౌతమ్‌ని ఇప్పుడే వెళ్లిపోమని చెప్తాడు. మహాలక్ష్మీ గౌతమ్ దగ్గరకు వెళ్లి నేను చూసుకుంటా వెళ్లి లగేజ్ తెచ్చుకో అని చెప్తుంది. పైకి మాత్రం నేను చూసుకుంటా నువ్వు వెళ్లి లగేజ్ తీసుకురా అంటుంది. గౌతమ్ లగేజ్ తెస్తాడు. వెళ్తున్న గౌతమ్‌ని మహాలక్ష్మీ ఆపి రామ్‌కి శిక్షించడమే కాదు క్షమించడం కూడా తెలుసు అని అంటుంది. రామ్ కాళ్ల మీద పడమని గౌతమ్‌తో చెప్తుంది.
రామ్ కాళ్లు పట్టుకున్న గౌతమ్..
మహాలక్ష్మీ చెప్పడంతో గౌతమ్ రామ్ కాళ్ల మీద పడి క్షమించమని వేడుకుంటాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని వేడుకుంటాడు. వాడి మాటలు నమ్మొద్దని చలపతి రామ్‌తో చెప్తాడు. తప్పు సరిదిద్దుకుంటాను అంటున్నాడు కదా ఒక అవకాశం ఇస్తే తప్పేంటి అని అంటాడు. దాంతో రామ్ గౌతమ్‌ని క్షమిస్తాడు. రేఖని పెళ్లి చేసుకోవడానికి గౌతమ్ ఒప్పుకుంటాడు. రేఖని తీసుకొని గౌతమ్ గదిలోకి వెళ్తాడు. సీతకి రామ్ థ్యాంక్స్ చెప్తాడు. ఎక్కడున్నా ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నందుకు సంతోషంగా ఉందని అంటాడు. ఇక సీత నేను గౌతమ్‌తో తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి అందుకే వాళ్లు ఇక్కడే ఉండాలి అని సీత అంటుంది.
అత్తా కోడళ్ల ఛాలెంజ్..
సీత వెళ్లిపోతుంటే మహాలక్ష్మీ పిలుస్తుంది. సీత మహాలక్ష్మీతో మిధున ఈ ఇంటి కోడలు కాకుండా చేశా మీరు ఊహించని షాక్ ఇచ్చాను కదా అంటుంది. నువ్వేం చేసినా ఈ ఇంటికి రావు అని మహాలక్ష్మీ సీతతో అంటే రామ్ మామ నన్ను బతిమాలితే నేను రాలేదు అంటుంది. నేను గెలుస్తా అంటే నేను గెలుస్తా అని ఛాలెంజ్‌లు చేసుకుంటారు. గౌతమ్ రేఖతో నీ వల్ల నాకు నష్టమే కాదు లాభం లేదు అంటాడు.
కోట్లు ఇస్తే వెళ్లిపోతా..
నువ్వు వచ్చింది డబ్బు కోసమే కదా 5 లక్షలా 10 లక్షలా ఎంత కావాలి అంటే అంత ఇస్తా చెప్పు అని గౌతమ్ అడిగితే దానికి రేఖ కోట్లు కావాలి ఇస్తే వెళ్లిపోతా అంటుంది. నువ్వు మహాలక్ష్మీ కొడుకువి కదా అని నువ్వే నాతో అన్ని చెప్పేశావ్ కదా నాకు నీ పుట్టు పూర్వొత్తరాలు అన్నీ తెలుసు అంటుంది. నువ్వు నన్ను ఇక్కడ నుంచి వెళ్లగొడితే నీ జన్మ రహస్యం అందరికీ చెప్పేస్తా అని అంటుంది. నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే నా దగ్గర ఉన్న తెలివితో నీకు కోట్లు వచ్చేలా చేస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇక నుంచి నువ్వు దేవా భార్యవి.. ఈ ఇంటి చిన్న కోడలివి.. ఓర్నీ ఇదంతా కలా!




















